`మానవత్వం చూపిన మహనీయుడు…. దైవత్వం నిండిన కరుణామయుడు.
` ప్రజల శ్రేయస్సు కాంక్షించే నాయకత్వం కూడా దైవత్వమే…
`రెండు వందల పెన్షన్ ఇచ్చిన వాళ్లనే ఇప్పటికీ గుర్తు చేస్తే…రెండు వేల పెన్షన్ ఇస్తున్న కేసిఆర్ ను వెయ్యేళ్లు గుర్తు చేసుకోవాలి….గుండెల్లో పెట్టుకోవాలి.
`దేశానికి కేసిఆర్ నాయకత్వం కావాలి.
`దేశమంతా సస్యశ్యామలం కావాలి.
`తెలంగాణ పథకాలన్నీ అమలు కావాలి.
`తెలంగాణ వెలుగుల వలే దేశం వెలిగిపోవాలి.
`సాగులో విప్లవాలు తేవాలి.
`ప్రగతిలో ప్రపంచం ఆశ్చర్యపోవాలి.
`పారిశ్రామిక గతి మారాలి. అభివృద్ధికి భారత్ దిక్సూచి కావాలి.
`దేశంలో సమానత్వం వెల్లివిరియాలి.
`అసమానతలు లేని సమాజం నిర్మింపబడాలి.
`అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించాలి.
`భారత్ స్వేచ్ఛ, శాంతికి నిలయమని ప్రపంచమంతా పొగడాలొలి.
` రైతు రాజ్యం తేవాలి.
`తెలంగాణలో ఎనమిదేళ్ల అధ్భుతాలు దేశమంతా విస్తరించాలి.
` రెండు వందల రూపాయల పెన్షన్ నిన్న…రెండు వేల పెన్షన్ నేడు…ఏది గొప్ప!
`తెలంగాణలో చుక్క జాడలేదు నిన్న…
`ఎక్కడ చూసినా నీటి ఊటలే నేడు…
`తెలంగాణ రాకపోతే, కేసిఆర్ సిఎం కాకపోతే కరంటు వచ్చేదా!
`సాగుకు నీరందేదా!
` ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే…
హైదరాబాద్,నేటిధాత్రి: దేశం తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ లాంటి నాయకుడు మన రాష్ట్రంలో వుంటే బాగుండు అని ప్రతి రాష్ట్రం ఆలోచిస్తోంది. కేసిఆర్ దేశ నాయకుడైతే తెలంగాణ లాగా దేశమంతా సుబిక్షమౌతుందని ఆశ పడుతోంది. కాని తెలంగాణలో వున్న కొంత మంది నాయకులకు మాత్రం ఇది కంటగింపుగా వుంది. ప్రతిపక్షాలకు ప్రతిబంధకంగా మారుతోంది. తమ పార్టీలకు రాజకీయ మనుగడ లేకుండాపోతోందని మధనపడుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు అందకారమౌతోందని ఆందోళన చెందుతున్నారు. కాని ప్రజలకు మేలు జరుగుతోందన్న ఆలోచన ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు చేయడం లేదు. దేశమంతా కొనియాడేటువంటి పథకాలు అమలు జరుగుతున్నా, తెలంగాణలో అరాజకీయాలు చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్ధిర పర్చాలని కొందరు చూస్తున్నారు. అబాసు పాలు చేయాలని మరి కొన్ని పార్టీలు చూస్తున్నాయి. ప్రజలు మేలు జరగడం కూడా ఓర్చుకోలేనంత దుష్టరాజకీయం చేస్తున్నారు. ఎప్పుడో దశాబ్ధంన్నర కిందట రెండు వందల రూపాjల పెన్షన్ ఇచ్చిన నాయకుడిపేరు ఇప్పటికీ తలుచుకుంటూ భజన చేస్తున్నారు. అదే తెలంగాణ సాధకుడు, విధాత కేసిఆర్ ప్రజలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంటే చూసి ఓర్వ లేకపోతున్నారు. కళ్లుండి చూడలేకపోతున్నారు. ప్రజలకు మేలు జరుగుతుంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఎలాంటి ఆసరా లేని ప్రజలకు ఆసరా ఫించన్ ఇచ్చి ఆదుకుంటున్నందుకు వారి ఓట్లు బిఆర్‌ఎస్‌కే పడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మునుగోడులో కూడా ఓడిపోయాక ఇంకా అక్కసు మరింత పెంచుకున్నారు. ప్రజల మెప్పు పొందే ఆలోచన మర్చి, ప్రభుత్వ పనులును చూసి కుళ్లు కుంటున్నారు. కుత్సిత రాజకీయాలు చేస్తున్నారు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. దేశమంతా కేసిఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు.
గత ఐదేళ్లుగా రైతులకు రైతు బంధు అందుతోంది.
అప్పటినుంచే రైతు భీమా కూడా అమలు జరుగుతోంది. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా చూసింది లేదు. విన్నది లేదు. కాని కొత్తగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనలకు రూపంగా అందజేయబడుతోంది. తెలంగాణ రైతుల గోస తెలిసిన నేతగా వారి కష్టం పంచుకునే ప్రయత్నం ప్రభుత్వం తరుపన చేయడం జరుగుతోంది. ఇదంతా దేశమంతా అమలు జరిగితే రైతుకు ఎంతో మేలు. వ్యవసాయం చేయడానికి ఏ రైతు వెనుకాడడు. ఎందుకంటే సమయానికి అప్పులు పుట్టక, ఒక వేళ అప్పు దొరికినా విత్తనాలు వేసినా, ఆరుగాలం శ్రమించినా పంట చేతికొస్తుందో లేదో అన్న అపనమ్మకం మీద ప్రయాణమే వ్యవసాయం. ఇలాంటి పరిస్ధితులు గతంలో తెలంగాణ ఎదుర్కొన్నది. కాని ఇప్పుడు కాదు…ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు సాగు అంటే ఎంతో బాగు..బాగు…బహుబాగు అన్నంత పండగయ్యింది. ప్రతి రైతు కళ్లలో అనందం నింపింది. అంత గొప్పదైన రైతు బంధు అమలు అన్నది దేశం మొత్తం మీద అమలు చేస్తే ప్రతి రైతు కళ్లలో సంతోషం…కళ్లాలలో పంటలు..రైతు ఇంట సిరులు కురుస్తాయి.
ఇక రైతు భీమా.
.ఒకనాడు రైతుకు ఏలాంటి ప్రమాదం జరిగినా ఆదుకునేవారు లేరు. కాని ఇప్పుడు ప్రభుత్వమే జరగకూడని ప్రమాదం జరిగి, రైతు ప్రాణాలుపోతే, ఆ కుటుంబం వీధినపడకుండా రైతు భీమా కాపాడుతోంది. ఇలాంటి పధకం కూడా దేశంలో ఎక్కడా లేదు. కేవలం ఒక్క తెలంగాణలోనే అమలు జరుగుతోంది. తెలంగాణలో కాళేశ్వరం అన్నది ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. ఇంత త్వరిగ గతిని ఒక ప్రాజెక్టు నిర్మాణం అన్నది పాలకులకు ఎంతో చిత్తశుద్ది వుంటే తప్ప పూర్తి కాదు..ప్రజలకు పలాలు అందించదు. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అపరభగీరదుడు. తెలంగాణలో నీట సిరులు ఎలా పారవో చూద్దామని పట్టుదలతో సాధించి చూపించారు. కాళేశ్వరం నిర్మాణం చేసి తెలంగాణ అంతటా గోదారి పరవళ్లు దుంకిస్తున్నాడు. పొలలకు ఆ నీళ్లను మళ్లిస్తున్నాడు. తెలంగాన సస్యశ్యామలం చేశాడు. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాలలో తెలంగాణ చేరిపోయింది. ఒక్కసారిగా తెలంగాణలో సాగు విప్లవం వచ్చింది. దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి కేసిఆర్…ఇలా చెప్పుకుంటూ పోతే పాలమూరు రంగారెడ్డి వడివడిగా పనులు పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే పలుగురాళ్లు తప్ప, పంటలులేక, ఎండిన బీళ్లు తప్ప, నీటి జాడలు లేక, వలసలు తప్ప ఉపాధి లేని పాలమూరు జిల్లాలో ఇప్పుడు పచ్చబడిరది. పసిడి పంటలు పండిస్తోంది. పచ్చదనంతో మురిసిపోతోంది. దానికి కారణం ముఖ్యమంత్రి కేసిఆర్…ఆయన సాధించిన తెలంగాణ. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ. మిషన్‌కాకతీయ ఊరంతటికీ నీళ్లును పంచుతోంది. మిషన్ భగీరధ ఇంటింటికీ నీళ్లు మోసుకెళ్తోంది. ఒకప్పుడు ఆడబిడ్డలు మైళ్ల దూరం వెళ్లి తెచ్చుకునే మంచినీరు ఇప్పుడు వారి చేతికి అందుబాటులోకి తెచ్చింది. ఇంటింటికీ దేశంలోనే సురక్షితమైన మంచినీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ కీర్తికెక్కింది. ఇదందా ముఖ్యమంత్రి కేసిఆర్ వల్లనే సాధ్యమైంది. ఒకనాడు వైద్యం అంటే పల్లెలకు ఆమడ దూరం…కాని నేడు పల్లె పల్లెలో దవఖానాలు…బస్తీ. బస్తీలో వెలిసిన బస్తీ దవఖానాలు…ఎక్కడ చూసినా ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రజల ఆరోగ్యంపై భరోసా కల్పించింది. తెలంగాణను చూసి దేశం మురుస్తోంది. దేశమంతా ఆచరించాలని కోరుకుంటోంది. ఒకప్పుడు మెడికల్ కాలేజీ అనే పదమే వినడానికి వింతగా వుండేది. డాక్టర్ సదువు ఏ కొందరికో అందుబాటులో వుండేది. కాని ఇప్పుడు తెలంగాణలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో, ఏటా వేలాది మంది వైద్యులు ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారు. తెలంగాణ చదువుకొని, తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. పాలన ప్రజల వద్దకు మరింత చేరువ చేశారు. గతంలో ఏదైనా పని కోసం సామాన్యుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఎంతో గగనమయ్యేది. పది సార్లు తిరగాలంటే ఎంతో శ్రమపడాల్సివచ్చేది. కాని ఇప్పుడు జిల్లా కార్యాలయాలు చాలా దగ్గరయ్యాయి. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. పైగా అన్ని జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేసి, సమీకృత భవనాలు నిర్మాణం చేశారు…దాంతో ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలు ఒకే చోట అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. తెలంగాణలో సరైన గుర్తింపు లేక, పట్టాలు అందక, ఎవరి భూమి హద్దులు వారికి సరైన అవగాహన లేక, గెట్టు పంచాయతీలతో నిత్యం సతమతమయ్యే రైతులకు ధరణి ఒక దారి చూపించింది. కొత్త పట్టాదారు పుస్తకాలు అందిచింది. ఉచితంగా ఆ సేవలు తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గతంలో పట్టాదారు పుస్తకాలు కావాలంటే రైతుల పడిన వేదన అంతా ఇంతా కాదు…కాని వాటికి కాలం చెల్లింది. అందరికీ పట్టాలు అందాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల రకాల సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు దేశమంతా ఈ పథకాలు అమలు కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. తెలంగాలో అమలౌతున్న పథకాలన్నీ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇన్నేళ్లయినా ఏ నాయకుడు ఆలోచించని, ఆచరించని , అమలు చేయని పధకాలు తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే అమలు చేస్తున్న సందర్భం చూస్తున్నారు. అయినా అక్కడి పాలకుల్లో చలనం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సోయి లేదు. తెలంగాణ ప్రజలు అందుకుంటున్న సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశ్యం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. దాంతో ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. దేశం సస్యశ్యామలం కావాలని కోరుకుంటున్నారు…దేశంలో కేసిఆర్ కొత్తవెలుగులు నింపాలని ఆశపడుతున్నారు.