`పొంగులేటి ఆత్మవంచన?
`నమ్మినందుకు నయవంచన?
`‘‘పొంగులేటి’’ పై ‘‘పల్ల’’ ఫైర్
`ఎన్టీఆర్ హయాం స్వర్ణ యుగమా?
`సీమాంధ్రుల పాలనలో ఒక్క చెరువన్నా బాగైందా?
`ఒక్క రిజర్వాయరైనా కట్టారా?
`మద్రాసుకు మంచినీళ్లు తీసుకుపోయిన ఎన్టీఆర్ తెలంగాణకు నీళ్లిచ్చాడా?
`అర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడ్డది తుమ్మల కాదా?
`రాజకీయ గురువు తుమ్మలను ఓడిరచలేదా?
`తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇది కాదా?
`వైఎస్‌ఆర్. దగ్గరకే రానివ్వలేదు?
`కేసిఆర్ అక్కున చేర్చుకున్నాడు?
`100 కోట్ల కాంట్రాక్టర్ వేల కోట్లకు ఎలా ఎదిగావు?
`అదే వైసిపిలో వుంటే ఇన్ని కాంట్రాక్టులు వచ్చేవా?
`పనులు నీకే కావాలి? పదవులు నీకే కావాలా?
`పది మంది ఎమ్మెల్యేల ఖర్చు అంటే కనీసం వెయ్యి కోట్లు కావాలి?
`తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల కోట్ల పనుల్లో అంత మిగిల్చుకున్నావా?
`నాణ్యత లేని పనులు చేసి సొమ్మంతా వెనకేసుకున్నానని చెబుతున్నావా?
`బిఆర్‌ఎస్ లో చేరిన నాటి నుంచి కష్టాలే…అయితే 3 వేల కోట్ల కాంట్రాక్టులు ఎలా వచ్చాయి?
`కపటదారి వేషాలు, కప్ప దాటుడు ముచ్చట్లు జనం నమ్మరు?
`నమ్మి బలవంతుడిని చేస్తే, నమ్మక ద్రోహానికి బ్రాండ్ అయ్యావా?
`నీతి లేని వ్యక్తి నిజాలు మాట్లాడతారా?
`పదిమందిని గెలిపించే సత్తానే వుంటే గత ఎన్నికలలో గెలిపించిన సీట్లెన్ని?
`దగ్గరుండి ఓడిరచిన కుట్రదారు పొంగులేటి?
హైదరబాద్,నేటిధాత్రి:
చిలక పలుకులు చిన్న పిల్లలు పలికితే బాగుంటుంది. పెద్దలు మాట్లాడితే అసహస్యంగా వుంటుంది. మాజీ ఎంపి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు కూడా అలాగే వున్నాయి. తనకేదో అన్యాయం జరిగిందని సరిగ్గా ఎన్నికల ముందు ప్రజలను గందరగోళపర్చాలన్న దురుద్ధేశ్యంతో పొంగులేటి ఎన్ని కట్టు కధలు అల్లినా ప్రజలు నమ్మే పరిస్ధితి లేదు. ఎవరూ ఆయన వెంట వెళ్లరు. ఆయనకు అంత సీన్ కూడా లేదు. ఒక వేళ ఆయనే అంత నాయకత్వ పటిమ వుంటే గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రతిభా పాటవాలు ఎటు పోయాయి? ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ప్రతిరూపమేది? ఉట్టికెగరనమ్మ, ఆకాశానికి ఎగరాలని ప్రయత్నం చేసినట్లు వుంది. గత ఎన్నికల్లో పొంగులేటి ఎన్నికల్లో నిబడ్డా ఓడిపోయే పరిస్ధితే. అందుకే ఆయనకు పార్టీ టిక్కెట్టు ఇవ్వలేదు. ఆయన పర్యవేక్షణ లోపం ఎంతో వుందో ఎప్పుడో అర్ధమైంది. పైగా పొంగులేటి బాధ్యతారాహిత్యం గత ఎన్నికల్లోనే తేలిపోయింది. అయినా మంత్రి కేటిఆర్ ఎంతో ఓపిగా పొంగులేటికి ఎంతో విలువిస్తూ వచ్చారు. ఆయన మాట కూడా లెక్క చేయకుండా, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసిఆర్‌ను అప్రదిష్టపాలు చేయాలనుకుంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా లేదు. ఇలా ముఖ్యమంత్రి కేసిఆర్ మీద మాట్లాడిన వారినెవ్వరినీ ప్రజలు ఆదరించలేదు. వారెవరూ మళ్లీ రాజకీయాల జోలికి కూడా రాకుండా ప్రజలే తగిన బుద్ది చెప్పారు. ఇప్పుడు ప్రగల్భాలు పలుతుకున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా అందుకు భిన్నంగా ఏమీ వుండదు. తెలంగాణ సాధకుడు, తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చుతూ, దేశంలోనే నెంబర్ వన్ స్ధానంలో నిలిపారు. తెలంగాణ గడ్డమీద నిలబడి పొంగులేటి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఊహించకోవచ్చు. తెలంగాణలో అమలౌతున్న సంక్షేమపథకాలు ఎక్కడా లేవని దేశమంతా కొనియాడుతుంటే, పొంగులేటికి ఎన్టీఆర్ పరిపాలన కాలం స్వర్ణయుగమనడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కాదా? దీంతో తెలంగాణపై పొంగులేటికి ఎంత చిత్తశుద్ది వుందో అర్ధం చేసుకోవచ్చు. ఆత్మవంచనకు కూడా వెనుకాడని వ్యక్తినని నిరూపించుకున్న పొంగులేటి నయవంచన ప్రజలు బాగా గమనిస్తున్నారని ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి తూర్పారపట్టారు. ఇంత కాలానికైనా పొంగులేటి అసలు స్వరూపం తెలిసిపోయిందని అంటున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డితో నేటిదాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావు చిట్‌చాట్…పూర్తి వివరాలు పల్లా మాటల్లోనే..
ఇంత కాలమైనా సీమాంధ్ర పాలకుడైన ఎన్టీఆర్ పాలన స్వర్ణయుగమంటూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడడం ఆయన నీతిబాహ్వానికి నిదర్శనం.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పడిన కష్టాలు ఏమిటో తెలిసిన వాళ్వెవ్వరూ అలా మాట్లాడరు. తెలంగాణ గుక్కెడు మంచినీళ్ల కోసం ఆరాపడుతున్న సమయంలో తెలుగు గంగ పేరుతో చెన్నై నగరానికి మంచినీరు తరలించి, తెలంగాణకు చుక్క నీరివ్వని ఎన్టీఆర్ గొప్ప పాలకుడయ్యాడా? ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ వాదులెవరైనా మాట్లాడతారా? అసలు తెలంగాణ రాకపోతే ఖమ్మం జిల్లా రూపురేఖలు ఇలాగే వుండేవా? ఖమ్మం జిల్లా రాజకీయ ఉద్యమ చరిత్ర తెలిస్తే పొంగులేటి అలా మాట్లాడేవారు కాదు. పొంగులేటి తెలంగాణ బాధలు తెలియదు. తెలంగాణ వాదం తెలియదు. తెలంగాన ఉద్యమంలో ఆయన పాల్గొన్నది లేదు. కేవలం వ్యాపారవేత్తగా ఎదిగి, దన అహాంకారంతో తెలంగాణ మీద ఆయనకు వున్న అక్కసు ఏమిటో ఆయనే స్వయంగా బైట పెట్టుకుంటున్నాడు. తెలంగాణలో అభివృద్ధి జరగడంలేదంటాడు? లక్షల కోట్ల పనులకు టెండర్లు వేశారంటున్నారు? అంటే తెలంగాణలో కొన్నిలక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పరోక్షంగా ఆయనే ఒప్పుకున్నారు. మరి తెలంగాణలో ఏమీ జరగలేదని అనడం వెనుక రాజకీయకుత్సితం తప్ప మరేం లేదు.
తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందో తెలిస్తే తెలంగాణ ఎంత ముందంజలో వుందో తెలుస్తుంది.
సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ స్వరూపం ఏమిటో? ఇప్పుడున్న తెలంగాణ ఎలా వుందో కళ్లారా చూస్తూ కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్న పొంగులేటిని ప్రజల గమనిస్తున్నారు. ఒకనాడు తెలంగాణ నాయకులకు చిన్న తరహా నీటి పారుదల శాఖను అప్పగించి, రూపాయి కూడా కేటాంపులు లేకుండా మంత్రులను ఉత్సవవిగ్రహాలుగా చేసిన ఘనత సీమాంధ్ర పాలకులది. అరవైఏళ్ల ఉమ్మడి పాలనల్లో తెలంగాణలోని ఒక్క చెరువైనా బాగుచేశారా? తుమ్మల నాగేశ్వరరావు నాయకుడి వల్ల ఆర్ధికపరమైన లబ్ధిపొంది, ఆయనకే వెన్నుపోటు పొడిచిన నాయకుడు పొంగులేటి. రాజకీయంగా కూడా జీవితాన్ని ఇచ్చిన తుమ్మల ఓటమికి కారణమైన పొంగులేటి నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే వున్నాయి. తెలంగాణ రాకపోతే పాలేరు ఎత్తిపోతల పధకం వచ్చేదా? సీతారామా ప్రాజెక్టు వచ్చేదా? ఖమ్మం జిల్లాలోని అనేక చెరువులు బాగయ్యేవా? కిన్నెరసాని రిజర్వాయర్‌కు మరమ్మత్తులు జరిగేవా? 2014 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడైన పొంగులేటి కేంద్రంతో కొట్లాడి తెచ్చిన నిధులెన్ని? చేసిన పనులెన్ని చెప్పగలడా? కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవతో, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో జరిగిన అభివృద్దే తప్ప, కేంద్రం చేసిందేమైనా వుందా? అన్నీ నాకే కావాలి. పనులు నాకే కావాలి. పదవులు నాకే కావాలి. అంటే పార్టీ కోసం పనిచేస్తున్న ఇతర నాయకులేమైపోవాలి? వేలాది కోట్లరూపాయల పనులు తీసుకొని నీతిమాలిన మాట్లాడుతూ, విశ్వాసఘాతుకుడా పొంగులేటి మిగిలిపోవడం ఖాయం.
ఒకనాడు వంద కోట్ల వ్యాపారం మాత్రమే చేశానని చెప్పుకొచ్చిన పొంగులేటి ఇప్పుడు వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు ఎలా చేస్తున్నాడో సమాధానం చెప్పాలి.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు. కాకపోతే రాజకీయ అవసరాల కోసం జగన్ పంచన చేరి, వ్యక్తిగత రాజకీయ లాభాఫేక్ష కోసమే బిఆర్‌ఎస్‌లో చేరి, వేలకోట్ల పనులు దక్కించుకొని ధన మధంతో పొంగులేటి మాట్లాడుతున్నాడు. ఖమ్మం జిల్లా మొత్తం గెలిపించే సత్తా వున్న నాయకుడిగా గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. దేశంలోనే ఇప్పుడు బలమైన శక్తిగా మారిన బిఆర్‌ఎస్ మీద నిందలేస్తే జనం చీకొడతారు? సానుభూతి వస్తుందన్న భ్రమల్లో పొంగులేటి వున్నట్లున్నారు. తెలంగాణలో అమలౌతున్న సంక్షేమం ప్రపంచంలోనే ఎక్కడా జరగడం లేదు. ముందు అది తెలుసుకో! కూర్చున్న కొమ్మను నరికేస్తున్నాన్న పగటి నిద్రలో చెట్టు మీద నుంచి జారిపడిపోయానన్న నిజం త్వరలోనే తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది.