పచ్చి అవకాశవాది..!

`రవీందర్‌ సింగ్‌కు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య!

`ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పైనే గతంలో చేయకూడని వ్యాఖ్యలు చేశాడు.

`కవితకు పదవికేం తొందరొచ్చిందన్నాడు?

`వినోద్‌ కుమార్‌ పదవి లేకుండా మూడు నెలలు కూడా వుండలేడా? అని రవీందర్‌ సింగ్‌ ప్రశ్నించాడు.

`పార్టీ ముఖ్యులను తేలిక చేసి మాట్లాడాడు!

`గత ఎన్నికలలో మంత్రి గంగుల కమలాకర్‌ ఓటమికి శత విధాల కృషి చేశాడు?

`తన అనుచరుల ప్రాంతాలలో బిజేపికి మెజారిటీ?

`ఆది నుంచి గంగుల మీద విషం చిమ్ముతూనే వున్నాడు?

`ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణలో కుటుంబ పాలన అన్నాడు?

 `కేసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు?

`నమ్మించి మోసం చేయడం టిఆర్‌ఎస్‌ అధినేతకు అలవాటే అని కూడా అన్నాడు?

`హుజూరాబాద్‌ లో ఈటెలకు సపోర్ట్‌ చేసినట్లు అనేక ఆరోపణలు!

`రవీందర్‌ సింగ్‌కు పదవీ కాంక్ష తప్ప ప్రజాశ్రేయస్సు పట్టదు?

`మేయర్‌గా వున్నంత కాలం స్మార్ట్‌ సిటీ పనులు చేపట్టలేదు?

`కాంట్రాక్టర్‌ను ఎందుకు బెదిరించాడు?

 

`ఈ మధ్య మరీ శృతిమించుతోన్న రవీందర్‌ సింగ్‌ ఆగడాలు?

`పార్టీకి తీరని నష్టం చేసేలా రవీందర్‌ సింగ్‌ వ్యవహారం?

`గంగులను అడుగడుగునా అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది!

`రవీందర్‌ సింగ్‌ ను పార్టీ నుండి బహిష్కరించాలని టిఆర్‌ఎస్‌ శ్రేణుల పిర్యాధులు?

`అర్హతకు మించి ఆశలు పెట్డుకొని, పార్టీ పరువు బజారుకీడుస్తున్నాడంటూ విమర్శలు!

`రవీందర్‌ సింగ్‌ వంటి చీడ పురుగులను ఏరేయాల్సిందే అంటున్న శ్రేణులు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఆశావహులు వేరు. అవకాశ వాదులు వేరు. ప్రతి రాజకీయ పార్టీలోనూ ఆశావహులు చాలా మందే వుంటారు.

కాని వారు అవకాశవాదులైనప్పుడే పార్టీలకు ఇబ్బందులు. తలవంతపులు కూడా…అంతే కాదు వారి వ్యక్తిగత రాజకీయ జీవితానికి కూడా తిప్పలే…అయినా కోరికోరి కష్టాలు తెచ్చుకుంటుంటారు.

అనుకున్నదే తడువుగా అందలమెక్కాలని అనుకుంటుంటారు. ఓపిక అన్నది లేకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారు. కొన్ని సార్లు పార్టీకి తీరని నష్టం తెచ్చిపెడుతుంటారు. నీడనిచ్చ చెట్టును కొట్టేయాలనుకుంటారు?

అలాంటి వారి పట్ల వ్యక్తులైనా, వ్యవస్ధలైనా అప్రమత్తంగా వుండడం అవసరం. ఎందుకంటే నైరాశ్యం పేరుతో అవకాశవాదులెప్పుడూ పార్టీ నాశనాన్ని కోరుకుంటుంటారు. స్వయంగా పార్టీని ముంచే పనిలో నిమగ్నమై వుంటారు. పైకి ఎంతో తియ్యగా కనిపిస్తున్నా,

లోలోన చేదేక్కి వ్యవహరిస్తుంటారు. విషం చిమ్ముతుంటారు. గూడు కట్టుకొని వున్న అసంతృప్తిని ఎప్పుడు వెళ్లగక్కుదామా? అని ఎదురుచూస్తుంటారు. పార్టీ ఎంత నిలబెట్టినా, పార్టీనే తాను నిలబెట్టానని చెప్పుకుంటారు. అతి విశ్వాసం ప్రదర్శిస్తుంటారు. అక్కసును వ్యక్తం చేస్తూ వుంటారు. లేని కయ్యాలు సృష్టించి పార్టీని కూల్చే పనిలో పడతారు…పైకి అమాయకులుగా, లోన అపరిచితులుగా వ్యవహరిస్తుంటారు. కరీంనగర్‌ టిఆర్‌ఎస్‌లో అలాంటి నేత మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ అంటున్నారు. పార్టీని అదును చూసి, ప్రతీసారి ఇరుకున పెట్టే ప్రయత్నం శతవిధాల ప్రయత్నం చేయడమే ఆయన రాజకీయం అంటూ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. తాజాగా ఆయన అనుచరులు మంత్రి గంగుల కమలాకర్‌ను అప్రదిష్టపాలు చేయడానికి పన్నిన కుటిల ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. అంటే వెనకటి గుణమేల మాను వినరా సుమతి! అనే పద్యాన్ని నిజం చేస్తున్నారు. పార్టీకి తీరని ద్రోహం చేస్తున్నారు. మంత్రిని ఇరుకున పెట్టడమే కాదు, ఇబ్బందుల పాలు చేస్తున్నామంటూ టిఆర్‌ఎస్‌లోని రవీందర్‌ సింగ్‌ వర్గం ఫోన్‌ సంబాషణలు ఇప్పుడు సంచనలమయ్యాయి. రవీందర్‌సింగ్‌కు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులే చెబుతున్నారు. 

తనకు పదవుల యావ తప్ప , ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశ్యమే ఆయనకు లేదని వారు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలోనే రవీందర్‌ సింగ్‌ ఎమ్మెల్సీ ఆశలు పెట్టుకున్నారు. ఉద్యమంలో పాల్గొనడం వేరు…రాజకీయాల్లో ప్రభావం వేరు…అన్నది తెలుసుకోకుండా తనను తాను అతిగా ఊహించుకోవడం రవీందర్‌ సింగ్‌కు అలావటే అని పార్టీ నేతలే అంటున్నారు. ఎమ్మెల్సీ ఆశ తీరలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ 2014లో రవీందర్‌ సింగ్‌ను కరీంనగర్‌ మేయర్‌ను చేశారు. అయినా ఆశ తీరలేదు. పదవుల మీద మోజు తీరలేదు. మేయర్‌ పదవి అన్నది ఆయనకు చాల చిన్న పదవిలా కనిపించింది. ఒకే నాయకుడికి పదే పదే అవకాశాలు ఇస్తూ, పోతే ఇతర నాయకులకు ఎప్పుడు పదవులు అందుతాయన్న కనీస సోయి కూడా లేకుండా రవీందర్‌ సింగ్‌ రాజకీయాలు చేయడం కొత్త కాదన్నది పార్టీ నేతల మాట. అందుకే తాజాగా రవీందర్‌ సింగ్‌పై కరీంనగర్‌ కు చెందిన అనేక మంది కార్పోరేటర్లు పార్టీకి పిర్యాధులు చేశారు. రవీందర్‌ సింగ్‌ అవకాశ వాద రాజకీయాలు పార్టీకి తీరని నష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన మేయర్‌గా వున్న సమయంలోనే కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులు చేపట్టలేదు. కాంట్రాక్టర్‌ తాను అడిగింత ఇస్తేనే పనులు చేయనిస్తానని అనడంతో, పనులు అక్కడే ఆగిపోయానని అంటున్నారు. అంటే కరీంనగర్‌ స్మార్టు సిటీ కావడం కూడా రవీందర్‌కు ఇష్టం లేదని, ఆ పనులు చేస్తే పార్టీకి మంచి పేరు రావడం ఇష్టంలేకనే రవీందర్‌ సింగ్‌ పనులు జరగన్విలేదన్నది ఓ వాదన. గంగుల కమలాకర్‌ టిఆర్‌ఎస్‌లోకి రాకముందే కరీంనగర్‌ ఎమ్మెల్యే. 

ఆయనను తానే పార్టీలోకి తీసుకొచ్చానని రవీందర్‌ సింగ్‌ చెప్పుకోవడంలోనే డొల్లతనం వుంది. ఒక ఎమ్మెల్యే స్ధాయి వ్యక్తిని కార్పోరేటర్‌ స్ధాయి నాయకుడు పార్టీలోకి తేవడం అన్నదే ఆలోచించడానికి వీలులేనిది. పార్టీ పరంగా, పార్టీ ఆదేశాల మేరకు తాను కూడా కృషి చేశానని చెప్పడంలో తప్పులేదు. ఒక వేళ పార్టీ మీద అంత ప్రేమ, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద అంత గౌరవం వుంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్‌ ఓటమికోసం రవీందర్‌ సింగ్‌ ప్రయత్నాలు చేశారన్నది ఎందుకు తెరమీదకు వచ్చింది. కరీంనగర్‌ మొత్తం మెజార్టీ వచ్చి, రవీందర్‌ సింగ్‌కు చెందిన అనుయాయులు, ఆయన వర్గీయులు, బంధువులు వున్న ప్రాంతాల్లో బిజేపికి ఎందుకు మెజార్టీ వచ్చిందనేది కూడా రవీందర్‌ సింగ్‌ సమాధానం చెప్పాలని గతంలోనే పార్టీ నేతలు ప్రశ్నించారు. అయినా గంగుల కమలాకర్‌ వాటిని పట్టించుకోకుండా అందర్నీ కలుపుకుపోతూనే వున్నారు. కాకపోతే ప్రతి సారి గంగుల కమలాకర్‌ను అప్రదిష్టపాలు చేయడానికి పదే పదే రవీందర్‌ సింగ్‌ అనేక రకాల వ్యూహాలు పన్నుతూనే వున్నారన్నది అందరికీ తెలిసిందే అంటున్నారు. తాజాగా ఓ ప్రాంతంలో ఎలుకలు, పందికొక్కుల పేరు చెప్పి, మంత్రిని అప్రదిష్టపాలు చేయడానికి, మంత్రి ఏం పట్టించుకోవడం లేదని అబాసుపాలు చేయడానికి రవీందర్‌ సింగ్‌ అనుచురులు డ్రైనేజీలు తవ్వడం ఏమిటి? జేసిబిలు తెచ్చి, రాత్రికి రాత్రిరోడ్లు తవ్వేయడం ఏమిటి? తిరిగి వాటిని వెంటనే పూర్తి చేయాలని కమీషనర్‌ను బెదిరించడం ఏమిటి? కలెక్టర్‌కు పిర్యాధు చేస్తామని కమీషనర్‌కు చెప్పడమేమటి? ఏకంగా మంత్రి పరవు తీయాలని గణేష్‌ నిమజ్జనం తర్వాత కలెక్టరేట్‌ ముందు ధర్నాలు చేస్తామని చెప్పడమేమిటి? ఇదేనా సొంత పార్టీ నేతలు చేయాల్సిన పని? ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన నాయకులే , ప్రభుత్వాన్ని,మంత్రిని ఇబ్బందులకు గురిచేసి, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా చేయడమేమిటి? గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రవీందర్‌ సింగ్‌ చేసిన హడావుడి..హంగామా అంతా ఇంతా కాదు…

ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ను సైతం రవీందర్‌ సింగ్‌ ఎలా వ్యాఖ్యానించారో ప్రజలందరికీ తెలుసు. ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇచ్చిన మాట మీద నిలబడడు అంటూ, అందరికీ ఆశ చూపి, వంచిస్తాడన్న మాటలు కూడా మాట్లాడాడు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తానే గెలిచి, పార్టీకి బుద్ది చెబుతాన్నారు. అంతంత మాటలు మాట్లాడినా కేవలం ఉద్యమ సమయంలో కలిసి పనిచేశాడన్న కారణంతోనే రవీందర్‌ సింగ్‌ను పార్టీలో కొనసాగనిచ్చారు. టిఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌గా వుంటూనే, బిజేపిలో చేరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇది పార్టీ నియమావళికి విరుద్దం. అయినా పార్టీ ఆయనను క్షమించింది. ఓ దశలో తాను మేయర్‌గా పనిచేసి, మళ్లీ కార్పోరేటర్‌గా పోటీ చేయడం నామోషీగా ఫీలైన నాయకుడు రవీందర్‌ సింగ్‌…..మహారాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్రఫడ్నవీస్‌, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. అంతే కాని రవీందర్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఎంత అహాంకారపూరితమైనవో చెప్పకకనే చెప్పొచ్చు. అంతే కాదు గతంలో నిజామాబాద్‌ ఎంపిగా కల్వకుంట్ల కవిత ఓడిపోయిన కొద్ది కాలానికే మళ్లీ ఎమ్మెల్సీ అయ్యింది. ఆమెకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? అని అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వ్యక్తి రవీందర్‌ సింగ్‌. ఇక ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ మీద కూడా ఆయన అనేక సార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పదవి పోయి పట్టుమని మూడు నెలలు కూడా వినోద్‌ కుమార్‌ వుండలేకపోయాడంటూ రవీందర్‌ సింగ్‌ విమర్శించాడు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడడం మూలంగానే ఎంపిటిసీలకు నిధులొచ్చాయని కూడా చెప్పుకున్నాడు. ప్రభుత్వం ఎన్ని వందలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా, హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఏం జరిగిందని ప్రశ్నించారు. పరోక్షంగా ఈటెల రాజేందర్‌కు ప్రచారం చేశారన్న అపవాదును ఎదుర్కొన్నారు. అసలు టిఆర్‌ఎస్‌లో వుండి, టిఆర్‌ఎస్‌ అభ్యర్ధికి సపోర్టు చేయకుండా, పార్టీ నుంచి బైటకు పంపించబడ్డ ఈటెల రాజేందర్‌ గెలుపును పదే పదే గుర్తు చేస్తూ, అనేక సార్లు పార్టీని కించపర్చిన ఘనత రవీందర్‌ సింగ్‌ది. అయినా ఆయన అనేక సార్లు క్షమించి వదిలేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా అవన్నీ కడుపులో పెట్టుకొని వదిలేశాడు. తాజాగా ముఖ్యమంత్రి డల్లీ, బీహార్‌, పంజాబ్‌ పర్యటనలో ఆయనను వెంట బెట్టుకొని వెళ్లారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. పార్టీకి నష్టం చేకూర్చే పనులు మానుకోలేదుని పార్టీ నాయకులే అంటున్నారు. ఇదిలా వుంటే ఆయన అనుచరులు మంత్రి గంగుల కమలాకర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన ఆడియో బైటకు రావడంతో తనకు ఏమీ తెలియదన్నట్లు, బిజేపి ఎంపి. బండి సంజయ్‌కుమార్‌ మీద ప్రెస్‌ మీట్‌ పెట్టినంత మాత్రాన చేసిన తప్పులు మాఫ్‌ అయిపోతాయనుకుంటున్నాడు. 

నానాటికీ రవీందర్‌ సింగ్‌ ఆగడాలు శృతి మించిపోతున్నాయని గ్రహించిన టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్పోరేటర్లు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు కల్వకుంట్ల తారకరామారావు, కరీంగనగర్‌ జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌కు పిర్యాధులు చేశారు. పార్టీ నుంచి రవీందర్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయాలని కోరారు. అంతేకాదు రవీందర్‌ వ్యహార శైలిని వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయిన పల్లి వినోద్‌కుమార్‌కు కూడా పార్టీ నాయకులు పిర్యాధు చేశారు. ఇక రోడ్డును తవ్వి, కార్పోరేషన్‌కు నష్టం కల్గించిన వారిపై పోలీసు కేసు కూడా నమోదైంది. మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారుల పిర్యాధు మేరకు రోడ్డు, డ్రైనేజీని తవ్వి, మంత్రిని అప్రదిష్టపాలు చేయడానికి చూసిన వారిపై కూడా పోలీసు కేసు నమోదైంది. రవీందర్‌ సింగ్‌, ఆయన అనుచరుల ఆగడాల మూలంగా పార్టీకీ తీరని నష్టం కల్గుతోందని, వెంటనే ఆయనను పార్టీనుంచి సస్పెండ్‌ చేయాలని పార్టీ శ్రేణులు పెద్దఎత్తున డిమాండ్‌ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!