నేతన్నల జీవితాలలో వెలుగు నింపింది సీఎం కేసీఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో భాగంగా టేకుమాట్ల మండలం ఆసిరెడ్డిపల్లె గ్రామం అమ్మ గార్డెన్స్ లో జిల్లా జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత దినోత్సవ సంబరాలల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ
గత ప్రభుత్వాలకు బిన్నముగా మొట్ట మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 16% (గత ప్రభుత్వాలు వారి వాటా గా కేవలం 4% మాత్రమే ఇచ్చియున్నారు) పెంచి “నేతన్నకు చేయూత పథకము” ద్వారా చేనేత కార్మికుల ఖాతాలలో జమచేయుచున్నారు.తెలంగాణ రాకముందు ఆప్కో ఆదాయం 100 కోట్లు ఉండే
ప్రస్తుతం 750కోట్లకు చేరింది.గతంలో ఏ విధమైన అవసరాలు ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసే పరిస్థితి ఉండే
మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టితో రాష్ట్రంలో ఉన్న చేతన్నలకు అవకాశం కల్పించడం జరిగింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేతన్నలకు గౌరవ వేతనాన్ని రూ.700 నుంచే 1200 లకు పెంచిన ఘనత మన ప్రభుత్వానికే ఉంటుంది.చేతన్న ఉరి చావుల నుంచి వారి కుటుంబాలలో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి చేతన్నల తరపున ప్రత్యేక ధన్యవాదాలు వ్యవసాయం చేసుకునే రైతుకు ప్రభుత్వం అందిస్తున్న రైతు బీమా పథకాన్ని చేనేత కార్మికులకు అందించిన ప్రభుత్వం.చేనేత రంగం పై పలు రంగాల్లో వ్యాసాలు, స్పీచ్ లలో ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులను అభినందించి, సన్మానించారు.చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని అందరితో కలిసి ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లారెడ్డి జెడ్పిటిసి తిరుపతిరెడ్డి సర్పంచ్ల ఫోరం మండలం అధ్యక్షుడు గురిగంట మహేందర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి స్ధానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *