– ఎఫ్ ఎల్ ఎం లో భాగంగా అమలు
– ప్రాథమిక స్థాయి విద్యార్ధుల అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం
-తెలంగాణ లోనే మొట్ట మొదటి సారిగా జిల్లాలో అమలు
-బాల మిత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
రాజన్న సిరిసిల్లజిల్లా, నేటిధాత్రి:
తెలంగాణ లోనే ప్రాథమిక స్థాయి విద్యార్ధుల అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు మొట్ట మొదటి సారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో శ్రీకారం చుట్టిన కార్యక్రమం బాలమిత్ర వారాంతపు శిక్షణ కార్యక్రమం.ఎఫ్ ఎల్ ఎం కార్యక్రమంలో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా 9 వ తరగతి విద్యార్థుల చే బ్యాచింగ్- మ్యాచింగ్ విధానంలో ప్రతి శనివారం మధ్యాహ్నం పూట 1-5 వ తరగతి విద్యార్థులకు మెంటార్ లుగా వ్యవహరిస్తూ వారి అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తారు.
కాగా శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ తో కలిసి బాలమిత్ర పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆవిష్కరించారు.
కార్యక్రమ అమలుకు సంబంధించి విద్యా శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.