నేటి ధాత్రి అక్షరసత్యాలు, వీగిపోయిన అవిశ్వాసం, హస్తం ఖాతాలో ఎంపీపీ.

నేటి ధాత్రి అక్షరసత్యాలు, వీగిపోయిన అవిశ్వాసం, హస్తం ఖాతాలో ఎంపీపీ.

బల నిరూపణకు ఎవరు హాజరు కాలేదు, ఎంపీపీ కొనసాగింపు ఆర్డిఓ ప్రకటన.

కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు శ్రీ పదవి విగ్రహానికి పూలమాల శ్రీధర్ బాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు.

ఒక వైపు సంబరాలు మరోవైపు అసంతృప్తి ప్రస్తుత కాంగ్రెస్ శ్రేణుల్లో కనబడుతున్న తీరు.!

హైకోర్టు తీర్పు మేరకే ఓటింగ్కు హాజరు కాలేకపోయాం, మరోసారి అవిశ్వాసం ప్రవేశపెట్టి అర్హతను కూలిపోతాం, అందుకే హాజరు కాలేదు బి అర్ ఎస్ ఎంపీటీసీ.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

నేడు మహాదేవపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అవిశ్వాస బల నిరూపణ ఓటింగ్ కొరకు కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి ఎంపీటీసీలు ఎవరు కూడా హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్న రాణి బాయ్ తన పదవిలో కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి భూపాలపల్లి ఆర్డీవో మాధవి తెలపడం జరిగింది. గత నెల ఆరవ తేదీ నుండి ఉమ్మడి రెండు జిల్లాల్లో ప్రత్యేకంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇతర మండలాల కు సంబంధించిన మండల పరిషత్ అధ్యక్షులు సైతం సొంత పార్టీలోని విభేదాల కారణంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా తోపాటు ప్రత్యేకంగా భారత రాష్ట్ర సమితికి చెందిన మహాదేవపూర్ మండల పరిషత్ అధ్యక్షురాలుపై సొంత పార్టీ ఎంపీటీసీలే హస్తం పార్టీ ఎంపీటీసీ లతో కలిసి అవిశ్వాసం పెట్టడం సంచలనం రేపింది. ఈ వ్యవహారాన్ని రాజకీయ ప్రలాభాలకు పలు అధిష్టానాలు వాడుకుంటున్నారని ఎంపీపీ పై అవిశ్వాసం లో అనేక మలుపులు తిరుగుతాయని ప్రత్యేకంగా ప్రస్తుతం మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్న ఎంపీపీ గత నెలలో కాంగ్రెస్ అధిష్టానం వద్దకు వెళ్లడం జరిగిందని నేటి ధాత్రి ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. చివరికి నేటి ధాత్రి చెప్పిందే వాస్తవాలని నేడు రుజువైంది మహదేవ్పూర్ ఎంపీపీ బన్సోడ రాణి భాయ్ అవిశ్వాసం వీగిపోవడం తో ఎంపీపీ పగ్గాలను తిరిగి దక్కించుకొని హస్తం పార్టీకి జై కొట్టారు.

 

 

 *నేటి ధాత్రి అక్షరసత్యాలు, వీగిపోయిన అవిశ్వాసం, హస్తం ఖాతాలో ఎంపీపీ.* 

 

మహాదేవపూర్ మండల పరిషత్ అధ్యక్షురాలుపై గత నెల ఆరవ తేదీన కాంగ్రెస్ పార్టీ కు సంబంధించినటువంటి ముగ్గురు ఎంపీటీసీలతో పాటు భారత రాష్ట్ర సమితి కు చెందినటువంటి ఐదుగురు ఎంపీటీసీలు కలిసి ఆర్డీవో కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిన విషయం తెలిసింది. యొక్క అవిశ్వాసం వెనుక అనేక కుట్రలు రాజకీయ ప్రవోభాలు ఉన్నాయని కేవలం పదవులను కాపాడుకొనుటకే అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృశ్య యొక్క అవిశ్వాసాన్ని పెట్టడం జరిగిందని, ప్రస్తుత ఎంపీపీ హస్తం పార్టీలోకి వెళ్లడం కొరకే ఈ యొక్క అవిశ్వాసమని మండల స్థాయి నేతలు పన్నిన పన్నాగమని ఎంపీపీ రాణి బాయ్ హస్తం గూటిలోకి వెళ్తే తిరిగి ఎంపీపీగా కొనసాగుతుందని ఇప్పటికే పలుమార్లు అధిష్టానం వద్దకు చెక్కర్లు కొట్టడం జరిగిందని నీటి ధాత్రి స్పష్టంగా గత నెల 13వ తేదీ ఈరోజు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. నేడు జరిగిన పరిణామం వీటి రాత్రి ముందే పసిగట్టి చెప్పింది వాస్తవం కాదా అంటే సాక్షాలు ఈరోజు వీగిన అవిశ్వాసం మే ప్రజల ముందు ఉన్న ఒక సాక్ష్యం. బుధవారం రోజు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అవిశ్వాసం ప్రవేశపెట్టిన ఎంపిటిసిలు మండల పరిషత్ కార్యాలయంలో హాజరు కావాలని గత నెల నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది కానీ బుధవారం రోజు ఓటింగ్ కొరకు కాంగ్రెస్ టిఆర్ఎస్ అవిశ్వాసం ప్రవేశపెట్టిన ఎంపిటిసిలు ఎవరు కూడా ఓటింగ్కు హాజరు కాలేదు రిటర్నింగ్ అధికారి భూపాలపల్లి ఆర్డీవో 11 గంటల సమయం అనంతరం మరో గంట సుమారు 12 గంటల వరకు వేచి ఉన్నప్పటికీ ఎవరు కూడా రాకపోవడంతో అవిశ్వాసం వీగి పోయిందని నిర్ధారించి ఎంపీపీ రాణి బాయ్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారని స్పష్టం చేయడం జరిగింది. ఐదుగురు బిఆర్ఎస్ ఎంపీటీసీలతో పాటు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు అధిష్టానం క్యాంపులో కొనసాగడం ఓటింగ్ కు హాజరు కాకపోవడంతో రాణి బాయ్ తిరిగి తమ పదవిలో కొనసాగుటకు అనుకూలంగా మారింది దీంతో ఎంపీపీ రాణి హస్తం పార్టీకి జై అన్నారు.

 

 

 *బల నిరూపణకు ఎవరు హాజరు కాలేదు, ఎంపీపీ కొనసాగింపు ఆర్డిఓ ప్రకటన.* 

 

పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2018 సెక్షన్ 2631 చట్టం ఐదు ప్రకారం గత నెల అవిశ్వాసం ప్రవేశపెట్టడంతో అవిశ్వాసం ప్రవేశపెట్టిన ఎంపీటీసీలకు ఈనెల రెండవ తేదీ బుధవారం రోజు ఓటింగ్కు హాజరు కావాలని రిటర్నింగ్ అధికారి భూపాలపల్లి ఆర్డీవో ఆధ్వర్యంలో ఓటింగ్ నిర్వహించడం జరుగుతుందని నోటీసులను జారీ చేయడం జరిగింది. ఎంపిటిసి లకు నోటీసులు అందినప్పటికీ కూడా నిర్ణయించిన తేదీ బుధవారం రోజు భూపాలపల్లి ఆర్డీవో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తూ మండల పరిషత్ కార్యాలయంలో హాజరు కావడం జరిగింది నోటీసులు ఇచ్చిన సమయం ప్రకారం 11 గంటల నుండి రమాదేవి 12 గంటల వరకు వేచి ఉన్నప్పటికీ ఓటింగ్ కొరకు కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీకి చెందిన అవిశ్వాసం ప్రవేశపెట్టిన ఎంపీటీసీలు హాజరు కాకపోవడంతో ఆర్డీవో రమాదేవి అధికారికంగా పంచాయతీరాజ్ చట్టంలో అనుసరిస్తూ అవిశ్వాసం వీగిపోయిందని స్పష్టం చేస్తూ ఎంపీపీ రాణి బాయ్ తన పదవిలో కొనసాగుతారని రిటర్నింగ్ అధికారి ఆర్డిఓ రమాదేవి స్పష్టం చేయడం జరిగింది.

 

 

 *కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు శ్రీ పదవి విగ్రహానికి పూలమాల శ్రీధర్ బాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు.* 

 

 

ఇక మహదేవ్పూర్ ఎంపీపీ అవిశ్వాసం వీగి పోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సంబరాలు జరుపుకోవాలని కాస్త వింత గాని అనిపించింది. ఎంపీపీ రాణి బాయ్ గా కొనసాగింపు తారని ఆడియో ప్రకటన అనంతరం ఎక్కడ చూసిన టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎంపీపీ రాణి బాయ్ తో మండలం నుంచి అనేక గ్రామాలుగా తరలివచ్చిన కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. రాణి భాయ్ పదవి ఇక ధూకాలేదు అని తేలిన అనంతరం ఎంపీపీ రాణి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్త్రీలతో కలిసి పెద్ద మొత్తంలో ర్యాలీని నిర్వహించారు మండల ప్రధాన కూడలి వద్ద ఉన్నటువంటి స్వర్గీయ శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి వారిని నివాళులు అర్పించడం టిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ ప్రస్తుత ఎంఎల్ఏ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి తండ్రి ఆనాటి కాంగ్రెస్ దిగ్గజం గా ఉమ్మడి రాష్ట్రంలో పేరు సంపాదించినటువంటి శ్రీపతి రావు విగ్రహానికి పూలమాల వేయడం ఇటుచూసిన మారుమూల ప్రాంతాలకు నుండి ఎంపీపీ రాణి వారితో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొనడం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మరోవైపు కార్యకర్తల్లో ఒక రకమైన జోష్ కనిపిస్తూ శ్రీధర్ బాబు నాయకత్వం వర్ధిల్లాలని మీరు నినాదాలతో ప్రధాన కూడలిరు దద్దరిల్లిపోయాయి. ఇక ప్రజలకు అర్థమైంది ఏమిటంటే కాంగ్రెస్ ఎంపీటీసీల చల్ల రమకు మద్దతు ఉపసంహరణ ఓటింగ్కు హాజరు కాకపోవడంతో తిరిగి ఎంపిపి పీఠాన్ని దక్కించుకున్న రాణి బాయ్ తిరిగి “ఘర్ వాప్సి” అయ్యారని అంటున్నారు.

 

 

 *ఒక వైపు సంబరాలు మరోవైపు అసంతృప్తి ప్రస్తుత కాంగ్రెస్ శ్రేణుల్లో కనబడుతున్న తీరు.!* 

 

 

ఇక రాని బాయ్ అవిశ్వాసం వీగిపోవడంతో తిరిగి ఎంపీపీ పదవిని దక్కించుకున్న అనంతరం పెద్ద మొత్తంలో కాంగ్రెస్ సీన్లు వచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలపడం సంబరాలు బాణాసంచారాలు పేల్చి నినాదాలు చేస్తూ ర్యాలీలు చేపట్టడం స్వర్గీయ శ్రీపతిరావు గారి విగ్రహానికి పూలమాలవేయడం శ్రీధర్ బాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేపట్టడం ఒకవైపు సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న క్రమంలో సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో అనేక సీనియర్ పార్టీని ప్రేమించే నాయకులు కూడా లేక తప్పలేదు. అనేక సంవత్సరాలుగా పార్టీ విలువలను పార్టీ హందత్వన్ని కాపాడుతూ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను కూడా దృష్టిలో పెట్టుకొని అధిష్టానాన్ని కూడా పలు సూచనలు సలహాలు ఇచ్చేలాంటి నాయకులు కూడా లేకపోలేదు. అలాంటి నాయకులు ఉన్న సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీ రాక అసంతృప్తిని కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మరికొందరు నాయకులు అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుపడుతూ అధిష్టాన నిర్ణయంపై అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నట్లు విశ్వనీయ సమాచారం. ఏదిఏమైనాప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల విషయంలో జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ మేధావులు అనుకుంటున్నారు.

 

 

 *హైకోర్టు తీర్పు మేరకే ఓటింగ్కు హాజరు కాలేకపోయాం,* *మరోసారి అవిశ్వాసం ప్రవేశపెట్టి అర్హతను కూలిపోతాం, అందుకే హాజరు కాలేదు బి అర్ ఎస్ ఎంపీటీసీ.* 

 

 

ఉమ్మడి జిల్లాలో గీసుకొండ మండల అధ్యక్ష అవిశ్వాస తీర్మానంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు కారణంతో తాము ఓటింగ్ కు హాజరు కాలేదని పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఆర్డిఓకు అవిశ్వాసం ఇచ్చే అధికారం ఉంది కానీ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 20018 లో పాత చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని నూతన విధానం రూపొందించబడలేదని కొత్త చట్టం 2018 ప్రకారం ఫామ్ V,ని చేయడానికి రెవెన్యూ అధికారికి నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయో లేవో ఇంకా స్పష్టత లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడిన నేపథ్యంలో తాము హాజరు కాలేదని. గత నెలలో హైకోర్టు విప్ జారీ చేసినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని హాజరు కాలేదని ఒకవేళ హాజరైతే తిరిగి అవిశ్వాసం పెట్టే అర్హతను కూలిపోతామని తిరిగి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తో పాటు ప్రభుత్వ స్పష్టత మైన ఆదేశాలు వచ్చిన అనంతరం అవిశ్వాస తీర్మానానికి వెళ్తామని డి ఆర్ ఎస్ ఎంపీ టీసీలు సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!