
పెద్దపెల్లి జిల్లా ఓదెల నేటిధాత్రి:-
ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో శుక్రవారం రోజున నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భవాని సహిత మహా లింగేశ్వర ఆలయం,ద్వార బంధనం,(గడప)వేద మంత్రాలతో ప్రతిష్టించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పూజారి మల్లోజుల శ్రీనివాస శర్మ, గ్రామ సర్పంచ్ ఆళ్ల రాజిరెడ్డి,పుల్లూరి రాంబాబు,తాడూరి భాను ప్రకాష్ , శనిగరపు రమేష్,తోకల తిరుపతిరెడ్డి,పుల్లురి చంద్రమోహన్ దంపతులు మరియు వార్డు సభ్యులు ఆళ్ళ శివారెడ్డి మాజీ ఎంపిటిసి అంబాల కొమురయ్య మాచర్ల సాయిలు,వంగ మహేష్ యాదవ్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
