`తెలంగాణ ప్రగతిపై సినీ నటుడు మురళీ మోహన్ లాంటి వాళ్లకు వున్న అవగాహన తెలంగాణ ప్రతిపక్షాలకు లేదాయే!
`ఒక్కసారి గతంలో తెలంగాణ గురించి పాలకులు ఏం మాట్లాడేవారో వాళ్లనడిగి తెలుసుకోండి.
` అసాధ్యం అనుకున్నవి అనేకం సుసాధ్యం చేసిన నాయకుడు కేసిఆర్.
` తెలంగాణ రాదన్నారు…వచ్చింది.
` తెలంగాణ ఇక ఎడారే అన్నారు…
` ప్రాజెక్టుల నిర్మాణం కష్టమన్నారు.
` రిజర్వాయర్లు దండగన్నారు…
`అసలు రిజర్వాయర్ల నిర్మాణం సాధ్యం కాదన్నారు.
` ప్రాజెక్టుల మాట కల అన్నారు.
`నాయకులు ఆ ఊసే ఎత్తొద్దన్నారు…
` కానీ తెలంగాణ రాష్ట్ర సిద్దించడంతో అవన్నీ సాధ్యమయ్యాయి.
` ముఖ్యమంత్రి కేసిఆర్ మనసు పెట్టి చేయడం వల్లనే నెరవేరాయి.
` ఒకనాడు తెలంగాణలో భూములున్నా పేదలే…
`నేడు ఐదెకరాలుంటే చాలు కోటీశ్వరుడే.
` తెలంగాణ ఒక నాటి గోస అందరికీ తెలుసు.
` ఇప్పుడు మాట్లాడున్న వారిలో ఒక్కరూ ఆ నాడు కొట్లాడిన వాళ్లు కాదు.
` జై తెలంగాణ అనడానికే భయపడిన వాళ్లు..
`పదవులు రావేమో అని నోరు కుట్టేసుకున్నారు.
` తెలంగాణకు నిధులు కూడా తేవాలన్న సోయి లేని వాళ్లు.
` పరాయి పాలనలో నోరు లేవని వాళ్లు.
`గొంతు పెద్దది చేసుకొని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
చరిత్రలో కొన్ని సంఘటనలు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. తరతరాలు ఆ జ్ఞాపకాలు పదిలంగా వుంటాయి. ఎన్ని వేల సంవత్సరాలైనా జనం నోట్లలో నానుతూనే వుంటాయి. వారి చరిత్ర నిత్యం గుర్తు చేస్తూనే వుంటాయి. భవిష్యత్తు తరాలకు పాఠాలుగాను, ఆదర్శాలుగా వుంటాయి. అలాంటి చరిత్రే తెలంగాణది. తెలంగాణ అంటేనే ఒక పోరాటం. తెలంగాణ అంటేనే ఒక ఉద్యమం. కొన్నేళ్లపాటు అస్తిత్వం కోసం ఆరాటపడి, పోరాడి ఆత్మాభిమానం నింపుకున్నది. స్వరాష్టమై ఒక సారి మోసపోయింది. రెండోసారి తన ఉనికిని నిలబెట్టుకున్నది. కేసిఆర్ రూపంలో సంకెళ్లు తెంచుకున్నది. తన అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటింది. స్వరాష్టమై విలసిల్లింది. అదీ తెలంగాణ అంటే…ఆ తెలంగాణ తలరాత మార్చిన నాయకుడు కేసిఆర్. ఇది చరిత్రకు సజీవ సాక్ష్యం. రేపటి తెలంగాణ తరానికి బంగారు భవితవ్యం. తెలంగాణ సాధన అసాధ్యమని అందరూ అన్నారు. తెలంగాణ ప్రజలు కూడా అనుకున్నారు. అందుకు తెలంగాణకే వెన్నుపోటు పొడిచిన వాళ్లు అంతకు ముందు తరం నాయకులు. గతంలో తెలంగాణ పేరు చెప్పుకొని పదవులు పొంది, ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకున్న నాయకులు ఎందరో వున్నారు. కేసిఆర్ జై తెలంగాణ అన్న నాడు ఇలాగే చాలా మంది అనుకున్నారు. ఓ వైపు నమ్మకం లేని తెలంగాణ సమాజం. అధిపత్యంతో తెలంగాణ ఉద్యమాన్ని ఉఫ్ మని ఊదేస్తామనే సీమాంధ్ర పాలకుల తెలంగాణ. టిఆర్‌ఎస్ ను తొక్కేస్తామని శఫథాలు పూనారు. కేసిఆర్ మీద రకరకాల ఆరోపణలు చేశారు. అసలు తెలంగాణ ఉద్యమమే లేదన్నారు. కల్పిత ఉద్యమన్నారు. కృత్రిమ ఉద్యమమన్నారు. పుగ్గలో పుట్టి మగలో మాడిపోయేదన్నారు. నిత్యం ఎగతాళి చేశారు. కేసిఆర్ ను చక్రబంధనం చేశారు. తెరాస పార్టీ తరఫున పోటీచేసిన ఎమ్మెల్యేలను లాక్కున్నారు…తెలంగాణ ఉద్యమాన్ని పోలీసుల ఇనుప బూట్లతో అణచివేయాలని చూశారు. ఎంత తొక్కితే తెలంగాణ ఉద్యమం అంతగా ఎగసిపడిరది. కేసిఆర్ రూపంలో రకరకాల రూపాలు సంతరించుకొని, ఉద్యమ స్వరూపాలకే ఒక కొత్త అధ్యాయాన్ని రచించింది. తెలంగాణ ఉద్యమం చారిత్రక ఘట్టంగా కీర్తకెక్కింది. అది కేసిఆర్ మస్తిష్క నుంచి పురుడుపోసుకొని, క్షేత్ర స్థాయికి చేరి, అసలు అంతు చిక్కని సమస్యగా నాటి పాలకులకు ఉక్కిరిబిక్కిరి చేసింది. అదీ తెలంగాణ ఉద్యమ తీవ్రత. అదీ కేసిఆర్ ఉద్యమ రచన. పోరాట ఆచరణ. అలా అసాధ్యం అనుకున్నవి అనేకం సుసాధ్యం చేసిన నాయకుడు కేసిఆర్.
ఒక దశలో ఎంత పోరాటం జరుగుతున్నా కొందరు తెలంగాణ రాదన్నారు…
అటు వెన్నుపోటు దారులు, ఇటు సీమాంధ్ర పాలకులు…డిల్లీ పాలకులకు నిరంతరం అబద్దాలు చేరవేసేవారు. మిలియన్ మార్చలో కనీసం ముప్పై వేల మంది కూడా పాల్గొనలేదని తప్పుడు ప్రచారం చేశారు. తెలంగాణ వస్తే సీమాంధ్రుల జీవితాలు ఆగమౌతాయన్నారు. తెలంగాణ ఉద్యమ ఒక కనికట్టు అంటూ అప్పటి సీమాంధ్ర పాలకులు కేంద్రానికి తప్పుడు అనేక నివేదికలు ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీకి సైతం అసత్యాలు నింపిన లెక్కల చూపించారు. అయినా కేసిఆర్ అంటే తెలంగాణ ప్రజలకు ఒక బలమైన నమ్మకం. ఎలాగైనా తెలంగాణ సాధిస్తాడని విశ్వాసం. తెలంగాణ ప్రజల బలమైన కోరిక. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. 2010 నుంచి తెలంగాణ వచ్చే దాకా పార్లమెంటు సమావేశాలు ఏ రోజు కూడా నడిచిన సందర్భం ఒకటి కూడా లేదు. అంతలా కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ఉద్యమం పని చేసింది. కేసిఆర్ వ్యూహాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. చివరకు ఎవరు ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రావడం ఆగలేదు. ఆఖరు నిమిషం వరకు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలతో కూడా తెలంగాణ బిల్లు ఆపాలని చూశారు. ధర్మం కేసిఆర్ ను గెలిపించింది. తెలంగాణ వచ్చింది.
తెలంగాణ ఇక ఎడారే అన్నారు…
ఒకనాడు తెలంగాణలో ప్రాజెక్ట్ లు కల అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కష్టమన్నారు. రిజర్వాయర్లు దండగన్నారు… అసలు రిజర్వాయర్ల నిర్మాణం సాధ్యం కాదన్నారు. ఎత్తిపోతల కూడా కుదరదన్నారు. విద్యుత్ బిల్లులు భరించలేమన్నారు. తెలంగాణ రైతుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించిన పాపాన పోలేదు. ఉమ్మడి పాలకులు అసలు తెలంగాణ లో ప్రాజెక్ట్ ల ఊసే ఎత్తొద్దని ఈ ప్రాంత నేతల నోరు మూయించారు. పదవులతో వారిని తెలంగాణ ప్రశ్నకు శక్తి లేకుండా చేశారు. తెలంగాణ లో నాయకులకు, నాయకులకు మధ్య తగాదాలు పెడుతూ వచ్చారు. ఇద్దరు తెలంగాణ నేతలు ఒక్కటి కాకుండా చూసుకున్నారు.
ఒక మురళీ మోహన్ కు వున్న సోయి తెలంగాణ నేతలకు లేకుండా పోయింది.
ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ తాను అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఓ ప్రశ్న అడగడం జరిగింది. మొత్తం ప్రాజెక్టులన్నీ ఆంద్రలో చేపడితే తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి వస్తుంది కదా! అన్నాడట. అప్పుడు చంద్రబాబు తెలంగాణ లో ప్రాజెక్టు లు నిర్మాణం సాధ్యమయ్యే పని కాదు. ఎత్తిపోతల పథకాలు ప్రభుత్వానికి మోయలేని భారమౌతుంది. వచ్చే పంటకంటే అందుకు అవసమయ్యే కరంటు బిల్లు ఎక్కువౌతుంది. తెలంగాణలో చెరువులు బాగు చేయలేం. ప్రాజెక్టులు సాధ్యం కావని చంద్రబాబు ఆనాడు చెప్పిన విషయాలు గుర్తు చేశారు. అయితే తెలంగాణ లో ప్రాజెక్టులు సాధ్యం కాదని అన్న వాళ్లు ఆశ్చర్యపోయేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ చేసి చూపించారు. రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. తెలంగాణ అంతా సస్యశ్యామలం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కు దీటుగా వరి పండిస్తున్నారు. దేశంలో వరి అత్యదికంగా పండిరచే రాష్ట్రాలలో తెలంగాణ చేరింది. ఇది అతి కొద్ది కాలంలోనే పూర్తయ్యింది. ఇదంతా ముఖ్యమంత్రి కేసిఆర్ పట్టుదలకు నిదర్శనం. అంతే కాదు ఎత్తిపోతల ఖర్చు ఎంతైనా రైతు సంక్షేమం కేసిఆర్ నిలబడ్డాడు. ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. రైతు బంధు ఇస్తున్నాడు. అసలు ఇదంతా ఎవరూ ఊహించలేదు. తెలంగాణ ఇంత అభివృద్ధి కేసిఆర్ వల్లనే సాధ్యమైందని మురళీమోహన్ అన్నారు. టిఆర్‌ఎస్ నేతలు ఇలాంటి వారి మాటలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతిపక్షాలు తమ ధోరణి మార్చుకోవాలి. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం విషయంలో అనవసరమైన వివాదాలు సృష్టించడం మానుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సిద్దించడంతో అవన్నీ సాధ్యమయ్యాయి. ముఖ్యమంత్రి కేసిఆర్ మనసు పెట్టి చేయడం వల్లనే నెరవేరాయి. ఒకనాడు తెలంగాణలో భూములున్నా పేదలే…నేడు ఐదెకరాలుంటే చాలు కోటీశ్వరుడే. ఒక్కసారి గతంలో తెలంగాణ గురించి పాలకులు ఏం మాట్లాడేవారో వాళ్లనడిగి తెలుసుకోండి.తెలంగాణ ఒక నాటి గోస అందరికీ తెలుసు.ఇప్పుడు మాట్లాడున్న వారిలో ఒక్కరూ ఆ నాడు కొట్లాడిన వాళ్లు కాదు. జై తెలంగాణ అనడానికే భయపడిన వాళ్లు..పదవులు రావేమో అని నోరు కుట్టేసుకున్నారు. తెలంగాణకు నిధులు కూడా తేవాలన్న సోయి లేని వాళ్లు. పరాయి పాలనలో నోరు లేవని వాళ్లు. గొంతు పెద్దది చేసుకొని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు.