రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల నాయాబ్ తహసిల్దార్ గా ఎం. అరుణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన నాయబ్ తహశీల్దార్ ఖజా మోయినొద్దిన్ ఇటీవలే తహశీల్దార్ గా ప్రమోషన్ల లో భాగంగా నిజామాబాద్ వెళ్లగా చొప్పదండి తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ ప్రమోషన్ పై రామడుగు నాయబ్ తహశీల్దార్ గా బుదవారం బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.