నాగుర్ల వెంకన్నను పరకాల నియోజక వర్గం బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాలి.
పరకాల నియోజక వర్గం నుండి వెనుక బడిన సామాజిక వర్గం ఆరె కులానికి అవకాశం ఇవ్వాలి.
తేది: 7-7-2023 రోజున ఉదయం 11.00 గం. పరకాల పట్టణం లోని మయూరి గార్డెన్స్ లో ఆరె కుల సంక్షేమ సంఘం సదస్సు పరకాల మండల ప్రధాన కార్యదర్శి అడగాని జనార్ధన్ అద్యక్షతన జరిగినది. ఈ సదస్సుకు ముఖ్య అతిదులుగా జిల్లా అధ్యక్షులు హింగె శివాజీ, ప్రధాన కార్యదర్శి వజ్ర కిషన్ రావు జిల్లా కమిటి సభ్యులు హాజరైనారు.
అనంతరం జరిగిన పత్రికా సమావేశంలో ఆరె సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు హింగె శివాజీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని ఆరె కులస్తులు ఆర్ధిక,సామాజిక రాజకీయ సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది.ఈ సమస్యలు అన్ని పరిష్కారం కావాలంటే ఆరె కులస్థుల నుండి కొందరు చట్టసభలలో ఉండాలి,అప్పుడు మాత్రమే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆరె కుల ముద్దు బిడ్డ నాగుర్ల వెంకన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి నేటి భారత రాష్ట్ర సమితి రూపాంతరం చెందే వరకు పార్టీకి అధిష్టానానికి విధేయుడుగా ఉంటూ పార్టీ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించడం జరుగుతుంది. పరకాల నియోజక వర్గం లో పుట్టి పెరిగి అన్ని వర్గాల ఆశీర్వాదం పొందుతున్న నాయకుడు సౌమ్యుడు వివాద రహితుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, బడుగు బలహీన వర్గాల గొంతుక నాగుర్ల వెంకన్న. కాబట్టి మా ఆరె కులం నుండి పరకాల నియోజక వర్గం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్దిగా నాగుర్ల వెంకన్న గారికి అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము.
జిల్లా ముఖ్య సలహా దారులు పేర్వాల లింగమూర్తి మాట్లాడుతూ పరకాల నియోజక వర్గం లో ఆరె కుల సామాజిక వర్గం ఓట్లు సుమారు గా 20,000 వరకు ఉంటాయి. ఆరె కులస్థులు తెలంగాణా రాష్ట్రం లోని 20 నియోజక వర్గాలలో గెలుపు, ఓటములను నిర్ణయించే బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. కాబట్టి పరకాలలో నాగుర్ల వెంకన్న గారికి టికెట్ ఇవ్వడం వల్ల 20 నియోజక వర్గాలలో ఉన్న మా అరె కులస్థులు పూర్తిగా బి.ఆర్.ఎస్ వెంట నడుస్తారు. తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో తెలంగాణ సాధిస్తామని ఆశ లేని రోజులలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారు వేసిన అడుగులో అడుగై కేసీఆర్ గారి పిలుపునందుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన అతి ముఖ్య నాయకులలో నాగుర్ల వెంకన్న ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఊరూరా జండా గద్దెలు నిర్మించి తెలంగాణ నినాదాన్ని పల్లె పల్లెకు మోసుకెళ్లిన ఉద్యమకారుడు నాగుర్ల వెంకన్న. పార్టీ ఒడుదుడుకుల సమయంలో కూడా కేసీఆర్ గారి వెన్నంటి ఉన్న నాయకుడు,పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించిన క్రమశిక్షణ కలిగిన నాయకుడు, పార్టీ ఏ అవకాశం ఇచ్చిన ఆ పదవికి వన్నెతెచ్చిన శ్రమజీవి, పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఎన్నో రకాలుగా త్యాగం చేసినటువంటి ఉద్యమకారుడు, మచ్చ లేని నాయకుడు నాగుర్ల వెంకన్న.
నాగుర్ల వెంకన్న గారి సేవలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఈసారి బి.ఆర్.ఎస్ పార్టీ పరకాల నియోజకవర్గం అభ్యర్థిగా నాగుర్ల వెంకన్నను ప్రకటించాలని ఆరె కులం నుండి విజ్ఞప్తి చేస్తున్నాము.
ఈ కార్య క్రమం లో జిల్లా కమిటి సభ్యులు కొల్లూరి కండేరావు, కుడ్లే మనోహర్ రావు,నాగుర్ల రాజేశ్వర్ రావు, హింగే భాస్కర్, వరికెల కిషన్ రావు, కుడ్లే సుధాకర్ రావు, సిరిసె చందర్ రావు, వాడికారి లక్ష్మన్ రావు, తుమ్మనపల్లి శ్రీనివాస్,అవేలి శ్రీనివాస్,
అంబీరు శ్రీనివాస్,
పరకాల మండల కమిటి సభ్యులు వాడికారి శివాజీ,నాగుర్ల శ్రీనివాస్,ఇజ్జిగిరి రాజేందర్,బాదరగాని రాకేష్
నడికూడ మండల అద్యక్షులు లోకటి నగేష్, వాంకే రాజు, గుబిరే సుధాకర్,పేర్వాల రత్నాకర్ వరికెల రాజు, నాగుర్ల రాజీరు, సూరావు కిషన్ రావు, సురావు బాబురావు, సురావు శివరావు,మోకిడే రాజు, లోనె సతీష్ , నాగుర్ల బాబు రావు,సురావు నర్సింగరావు, భూపాల పల్లి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వాడికారి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.