నవాబుపేట్ నూతన మండల తహసిల్దార్ గా మల్లికార్జున రావు.
ఘనంగా సన్మానించిన డిసిసి జనరల్ సెక్రెటరీ బంగ్లా రవి.
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం
నవాబుపేట్ మండల తహసిల్దార్ రాజేందర్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మల్లికార్జునరావు రావడం జరిగింది.ఈ సందర్భంగా బంగ్లా రవి వారికి ఘనంగా సన్మానించడం జరిగింది. మల్లికార్జున్ రావు మాట్లాడుతూ, నవాబుపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు మాకు సహకరించాలని, పార్టీలకు అతీతంగా పనిచేస్తానని అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య , మైనారిటీ జనరల్ సెక్రటరీ షబ్బీర్ అల్లి , రాష్ట్ర ఎస్టీ నాయకులు నిల్య నాయక్ , కిసాన్ సెల్ మండల అధ్యక్షులు రమేష్ గౌడ్ , జంగన్న , నరంజి , రాములు తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.