వెంకటేశ్వర ఆలయంలో నేను శ్రీధర్ బాబుకు సహకరిస్తా మీరు నన్ను సహకరించండి అంతే తప్ప బెర సరాలు కాదు.
మా నాయకుని దృష్టికి తీసుకువెళ్లి సహకరిస్తాం అన్నమే తప్ప హామీ ఇవ్వలేదు.
నేటికీ హస్తం గుర్తుపై కొనసాగుతున్న ఎంపీటీసీ చల్లా రమ తిరుపతి కు శ్రీధర్ బాబు పై విమర్శలు చేసే నైతిక హక్కు లేదు.
నేటి వరకు ఎంపీపీ కు మాకు ఎలాంటి సంబంధం లేదు ఆమె మా పార్టీ సభ్యురాలి కాదు మీ పార్టీ సభ్యురాలు ఇచ్చిన పత్రిక సమావేశం బదులు మా నాయకుడి పై బురద జల్లుతే సహించేది లేదు. హస్తం పార్టీ ఎంపీటీసీలు.
రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు శ్రీధర్ బాబు అభివృద్ధి అంటేనే దుద్దిల్ల చరిత్రను తెలుసుకొని మాట్లాడాలి. జడ్పిటిసి అరుణ.
మహాదేవపూర్- నేటి ధాత్రి:
నర్సరీలో పనిచేసుకున్నటువంటి వ్యక్తికి జిల్లా పరిషత్ సభ్యుడిగా తీర్చిదిద్దిన ఘనత దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకే దక్కుతుందని మహాదేవపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు మంచినీళ్ల దుర్గయ్య, ఆకుతోట సుధాకర్, మడక తిరుమల ప్రతాపరెడ్డి లు అన్నారు. శనివారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీటీసీలు సంయుక్తంగా పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీటీసీలు మాట్లాడుతూ కుదురుపల్లి గ్రామ నికి చెందినటువంటి చల్ల తిరుపతిరెడ్డి నర్సరీలో పని చేసుకుంటున్న వ్యక్తిని దుద్దిళ్ళ వంశం జిల్లా పరిషత్ సభ్యుడి తోపాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవిని కట్టబెట్టడం జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. బి ఆర్ ఎస్ పార్టీ కు చెందిన ఎంపీటీసీలు ఎంఎల్ఏ శ్రీధర్ బాబు పై చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండించారు. తాము కూడా టిఆర్ఎస్ అధిష్టానం పై అనుచిత వ్యాఖ్యలు చేయగలుగుతామని కానీ తమ నాయకుడు అలాంటి సంస్కారం లేని స్వభావాన్ని తమకు అందించలేదని గ్రామ మండల స్థాయి విషయాలకు సంబంధించి స్థానిక నాయకులు బాధ్యత వహిస్తారు కానీ సొంత పార్టీ సర్దుబాటు చేయలేని పరిస్థితిలో బట్ట కాల్చి మీద వేయడం ప్రజా ప్రతినిధులకు సమంజసం కాదని ఈ సందర్భంగా ఎంపిటిసిలు హితవు పలికారు. రెడ్డి గాండ్ల అలాగే మైనారిటీల విషయానికొస్తే శ్రీధర్ బాబు ప్రస్తుత ఎంపీటీసీ మహదేపూర్ మూడు ఏ కులానికి చెందినవారు అని వారు ప్రశ్నించారు. శ్రీధర్ బాబు కేవలం ప్రజలను ప్రేమించడమే తప్ప కులాలుగా విభజించే నైజం కాదని నేడు ఉన్న జిల్లా అధ్యక్షుడు కూడా ఒక రెడ్డి గాండ్ల కులానికి చెందిన వారేనని ఇక మైనారిటీ విషయాలకు వస్తే అనేక పదవులను పార్టీ పరంగా లేక ఇతర నిధుల పరంగా నేటికీ వారికి అండగా నిలిచింది శ్రీధర్ బాబు అన్న విషయం అందరికీ తెలుసని అన్నారు. ఎంపీపీ అవిశ్వాసానికి సంబంధించి వెంకటేశ్వర ఆలయం వద్ద ఉన్నామంటే మేము రావడం జరిగింది తప్ప మేము ఎలాంటి ప్రమాణాలు చేయలేదని చల్ల తిరుపతిరెడ్డి తను స్వయంగా వచ్చే ఎన్నికల్లో దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కు తాను మద్దతు తెలుపుతానని కానీ మీరు ఎంపీపీ అవిశ్వాసం లో తమకు సహకరించాలని కోరడం జరిగిందని ఎంపీటీసీలు అన్నారు. అది కూడా తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అధిష్టానం అంగీకారం వారి నిర్ణయం మేరకు తదుపరి చర్య తీసుకుంటామని చెప్పడం జరిగిందే తప్ప డబ్బులు తీసుకోవడం ఎలాంటి స్పష్టత అయిన హామీ ఇవ్వలేదని ఎంపీటీసీలు ఈ సందర్భంగా తెలిపారు. అవిశ్వాసం వీగిపోయిన అనంతరం తమ నాయకుడు ఎంపీటీసీలను అమ్ముకోవడం జరిగిందని చెప్పడం సిగ్గుచేటని ఎంపీపీ వ్యవహారంలో తమ నాయకునికి ఎలాంటి సమాచారం లేదని అవిశ్వాసానికి కొద్ది రోజుల ముందు చల్ల తిరుపతిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో సహకరిస్తారన్నమాట అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తే తమకేమీ అవసరం లేదని అధిష్టానం తేల్చి చెప్పిందని ఎంపీటీసీలు ఈ సందర్భంగా తెలపడం జరిగింది. అలాగే ప్రస్తుత ఎంపీపీ రాణి బాయ్ కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అధిష్టానం వద్ద అవిశ్వాసం అనంతరం మద్దతు కొరకు అధిష్టానాన్ని కోరితే అధిష్టానం నిరాకరించిందని ఎంపీటీసీలు అన్నారు. ఎంపీపీ రాణి ఏర్పాటు చేసిన పత్రిక సమావేశం ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీపీ ప్రస్తుతం కూడా టిఆర్ఎస్ పార్టీలో కొనసాగడం జరుగుతుందని టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎలాంటి కారణాలు లేకుండా తనపై అవిశ్వాసం ఎందుకు పెట్టిందని వారి అధిష్టానాన్ని బహుజన వాదాన్ని వాడుకుంటుందని ఒక బీసీ బిడ్డనైన నాకు ఎందుకు అన్యాయం చేయుటకు కంకణం కట్టుకుందని సొంత పార్టీ నాయకులకు ప్రశ్నించింది దానికి సమాధానం భారత రాష్ట్ర సమితి అధిష్టానం నాయకులు చెప్పాలి కానీ టిఆర్ఎస్ ఎంపీటీసీలు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తమ నాయకుడైన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఎంపీటీసీలు ప్రశ్నించడం జరిగింది. మా నాయకుడి పై బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని చల్ల తిరుపతిరెడ్డి నేటికి హస్తం గుర్తు బీఫామ్ తోనే ఎంపీటీసీగా కొనసాగుతున్నారన్న విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాలకు ఆ పార్టీ అధిష్టానమే బాధ్యత వహించాలని కానీ తమ నాయకుని పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ధర్నాలు రాస్తారోకలు చేయక తప్పదని ఈ సందర్భంగా ఎంపీటీసీలు హెచ్చరించారు. ఎంపీటీసీలకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై విమర్శలు చేసి అంత స్థాయి లేదని మీ పార్టీ పరిధిలోని అంశాలను మీ అధిష్టానం వద్దకు తీసుకువెళ్లి చర్చించుకోవాలి కానీ మా నాయకుడి పై బురదజల్లే ముందు ప్రజల్లో బలముంటే రాజీనామాలు చేసి తమ ముందు మరోసారి ఎన్నికలకు రావాలని హస్తం ఎంపీటీసీలు సవాల్ విసిరారు. అలాగే మరో పత్రిక సమావేశంలో జిల్లా పరిషత్ సభ్యురాలు గుడాల అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి కేరాఫ్ శ్రీధర్ బాబు అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఒక మహోన్నతమైన గుర్తింపును నాలుగు దశాబ్దాలుగా విజయాన్ని అందించిన ప్రజలకు తెలుసని అలాంటి మచ్చలేని నాయకుని పై రాజకీయ అవగాహన లేక సొంత ఇంటి విషయాన్ని బజారున వేసుకునే విధంగా ఉందని వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉందని కూడా జడ్పిటిసి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి ఎంపీటీసీలు ఎంపీపీల అవిశ్వాసం లో ఎలాంటి సంబంధం ఉంటుందని కనీసం అవగాహన రిత్యగా లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తన ఎంపీటీసీలకు భారత రాష్ట్ర సమితి ఎంపీటీసీల మధ్య అంతర్గత విభేదాలతో ఏర్పడ్డ అవిశ్వాసానికి ఓటింగ్ సమయంలో తమకు సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోకూడదని ఆదేశించడం జరిగింది తప్ప వారి అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీకి మరియు ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం కనీస అవగాహన లేకుండా తమ నాయకుని పై బురదజల్లే విషయం సమంజసం కాదని మండలంతో పాటు యావత్ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రజల నాయకుడు ఎవరూ ఆనేది ప్రజలకు తెలుసని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘన విజయాన్ని సాధించగా తప్పదని జడ్పిటిసి గుడాల అరుణ అన్నారు.