పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలవుతుంది
భద్రాచలం నేటి ధాత్రి
కష్టపడీ చెమట చిందించే కార్మికులకు న్యాయం చేసేందుకే శ్రామిక న్యాయాన్ని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది
మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి
మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ మాజీ గ్రంథాల చైర్మన్ బోగల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గం ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా భోగాల శ్రీనివాస్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ
మోడీ ప్రభుత్వం దేశ సంపదనంతా ఆదాని, అంబానీలకు దోచిపెడుతునడని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని అన్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ ,కేటీఆర్ లు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చే కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పించిందని, కష్టాన్ని నమ్ముకుని జీవించే శ్రామికులకు న్యాయం చేసేందుకే శ్రామిక న్యాయాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచి తగిన విధంగా న్యాయం చేయడానికి ముందుకు వచ్చిందని ఆయన అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ నాలుగు ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ప్రజల సొమ్మును దోచుకోవడంతో కూతురు కవిత జైలుకెళ్ళిందని, వారు కూడా జైలుకెళ్లక తప్పదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ ముందుకు పోతుందని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ లకు ఒక్క సీటు కూడా రాదని తెలిపారు.
ఈ ఎన్నికల ప్రచారంలో
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాస మల్ల రాము, కాంగ్రెస్ నాయకులు అన్నేం రామిరెడ్డి, షాబీర్ భాష, జిల్లా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి, రూపా దేవి, కట్ట కళ్యాణి, పద్మప్రియ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.