`దసరా ముహూర్తం ఫిక్స్
`కొత్త పార్టీ ప్రకటనకు అంతా సిద్ధం
`కలిసి వచ్చే పార్టీలు, నేతలకు పిలుపు
`స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్ అందరికీ ఫోన్లు
`గత కొంత కాలంగా పూర్తి స్థాయి చర్చలు
`దేశం సస్యశ్యామలం చేయడమే లక్ష్యం
`సంక్షేమ రాజ్య నిర్మాణమే కేసిఆర్ విధానం
`రైతు రాజు కావాలన్నదే బలమైన ఆకాంక్ష
`నెరవేర్చి చూపడం కోసమే కేసిఆర్ పట్డుదల
`అన్ని వ్యవస్థలలో ముందడుకు ప్రణాళికలు
`విద్య, వైద్య రంగాలలో విప్లవాలు తేవాలి.
`శాస్త్ర, సాంకేతిక రంగాలలో పురోగమించాలి.
`ప్రాజెక్టుల నిర్మాణం పెరగాలి
`దేశమంతా సాగు నీటి సవ్వడులు చూడాలి.
`అన్ని వర్గాల అభ్యున్నతి అంటే ఏమిటో కొత్త తరం ఆవిష్కరణతో చూపాలి.
`తెలంగాణ మోడల్‌గా దేశమంతా తీర్చిదిద్దబడాలి
`అంకితభావమున్న నేతలతో దేశ భవిష్యత్తు తీర్చిదిద్దాలి.
`జంభూ ద్వీపంలో స్వర్ణ యుగం రావాలి.
`దేశం పెట్టుబడులకు స్వర్గదామం కావాలి.
`సమాఖ్య స్పూర్తి నిండిన మన దేశంలో సిరి సంపదలు వెల్లివిరియాలి.
`అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ది జరగాలి.
`కేసిఆర్ కలల రూపం నుంచి అభినవ భారత నిర్మాణం జరగాలి.
`దేశ కీర్తి పతాక కేసిఆర్ నాయకత్వంలో రెపరెపలాడాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
అప్పుడు ఒక్కడే…ఇప్పుడూ ఒక్కడే…ఆ ఒక్కడు కేసిఆరే… ఆనాడు అంతే… తెలంగాణ ఉద్యమ రచన చేశాడు… తెలంగాణ అంతా ఏకం చేశాడు. లక్షలాది మంది కేసిఆర్‌లను తయారు చేశాడు. తెలంగాణ సాధించి చూపించాడు. తెలంగాణ వస్తే ఎలా బతుకులు మారుతాయో చెప్పాడు. ఇప్పుడు ఆచరణలో చూపించి, దేశమంతా అబ్బురపడేలా అభివృద్ది చేసి చూపించాడు. చీకట్లో మగ్గిన కొడిగట్టిన దీపంలా వుండే తెలంగాణకు వెలుగులు తెచ్చాడు. తెలంగాణ వస్తే ఇక చీకటి బతుకులే అని ఎద్దేవా చేసిన వారికి గుణపాఠం నేర్పారు. వారి అజ్ఞానాన్ని పోగొట్టి కళ్లు తెరిపించాడు. వారి చేతనే తెలంగాణకు జై అనేలా చేశాడు. తెలంగాణను కరంటు వెలుగులతో నింపాడు. కరంటు ఉత్పత్తికి మార్గాలు వేశాడు. నీటి చుక్క పారకం లేని తెలంగాణలో నీటి సిరుల పరవళ్లు చూపించాడు. తెలంగాణలో సాధ్యం కాదని చెప్పిన ప్రాజెక్టులను నిర్మాణం చేశాడు. కాళేశ్వరం లాంటి అధ్భుతమైన నిర్మాణంతో ప్రపంచానికి కొత్త పాఠం నేర్పాడు. నాయకుడికి చిత్త శుద్ది వుంటే ప్రగతి ఎలా పరుగులు పెడుతుందో ఆవిష్కరించాడు. తెలంగాణలో నీటి పారుదలలో గోదారి పరుగులు చూపించాడు. రిజర్వాయర్ల నిర్మాణంతో నీటిని ఒడిసిపట్టే మంత్రం అమలు చేశాడు. చెరువులు బాగు చేసి, ప్రతి ఊరులో వున్న భూగంగాళం నీటితో కళకళలాడేలా చేశాడు. రైతుకు నీటి గోస లేకుండా చేశాడు. పైరుకు నీటి వాడకం లోటు లేకుండా చేశాడు. పంటలు పుష్కలంగా పండేందుకు కొత్త దారులువేశాడు. తొండలు గుడ్డు పెట్టే భూములని ఎగతాతలి చేసి, ఏవగింపు మాటలు మాట్లాడిన వారి కళ్లముదే తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దాడు. అదీ కేసిఆర్ అంటే నిరూపించాడు.ఈనాడు అంతే దేశ రాజకీయ చరిత్ర మార్చబోతున్నాడు. దేశ భవిష్యత్తుకుకొత్త దిశా నిర్ధేశం చేయబోతున్నాడు. దేశానికి కొత్త రాజకీయ శక్తిని ఇవ్వబోతున్నాడు. దేశాన్ని ఏలేందుకు అడుగులు వేస్తున్నాడు. కొత్త రాజకీయ పార్టీ త్వరలో ప్రకటించబోతున్నాడు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు. దేశంలోని అనేక మంది నాయకులకు ఆహ్వానాలు పంపుతున్నాడు. స్వయంగా కేసిఆరేఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. దసరా రోజున తెలంగాణ గడ్డ మీద నుంచి కొత్త రాజకీయ పార్టీ ప్రకటన, కార్యాచరణ ప్రకటించబోతున్నాడు. దేశ రూపు రేఖలు ఎలా మార్చాలన్నదానిని ప్రజలకు వివరించబోతున్నాడు. దేశంలో ఇప్పుడున్న పరిస్ధితులను, భవిష్యత్తులో రావాల్సిన మార్పులు స్పష్టంగా సూచిస్తూ, వివరంగా జనం మదిలోకి సరికొత్త నవభారతాన్ని నింపబోతున్నాడు. తెలంగాణ ఒకనాడు ఎలా వుందో చెబుతాడు. ఎలా గోసపడిరదో కూడా చెబుతాడు. ఆ గోస నుంచి తెలంగాణ ఎలా విముక్తి అయ్యిందో చెబుతాడు.తెలంగాణ ప్రగతిలో ఎలా దూసుకుపోతోందో కూడా చెప్పి, దేశంలో కూడా తెలంగాణ సంక్షేమ, ప్రగతి పాలన రావాలంటే దేశ రాజకీయాల్లో మార్పును గురించి ప్రజలకు బోధ చేస్తాడు.
ప్రజలను గత ప్రభుత్వాలు ఎలా వంచించాయి. ఓట్ల రాజకీయాలు ఎలా చేశాయి. ప్రజలను ఎలా మభ్యపెట్టాయి. ఇంకా ఎలా చూస్తున్నాయి. ప్రజలను ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాడు సమానంగా వున్న డాలర్, రూపాయి విలువ ఇప్పుడెందుకు పతనమౌతుందో కూడా ప్రజలకు అర్ధమయ్యేలా చెబుతాడు. మన దేశ గతిని ఎలా మార్చుకోవాలో కూడా లెక్కలేసి మరీ చెబుతాడు. ఇంత కాలం గత పాలకుల మోసం ఎంత దుర్మార్గమైంతో అంకెలతో సహా చెప్పి కడిగిపారేస్తాడు. మన దేశ ఎకానమీ ఏ దశలో వుందో చెపి, ఏ మార్గంలో పయనిస్తే దేశం దిశ, దశ మారుతుందో చెబుతాడు. తెలంగాణ మోడల్‌గా దేశమెలా ఒక్కొఅడుగు వేయాలో చెప్పి, ఎంత తొందరగా దేశాన్ని ప్రగతి పధంలో పయనింపజేసి చూపిస్తాడు. తెలంగాణ అభివృద్ధి రోల్ మోడల్‌గా దేశ ప్రగతిని నిర్ధేశిస్తాడు. అనేక సంక్షేమ పధకాలు అమలు చేసి, సంక్షేమ రాజ్య నిర్మాణం చేస్తాడు. ఇది కేసిఆర్ మీద సగటు తెలంగాణ వాదికి వున్న బలమైన నమ్మకం. కేసిఆర్ నాయకత్వం మీద విశ్వాసం. ఆయన పట్టుదల మీద వున్న అచంచలమైన సగలు వ్యక్తి ఆత్మవిశ్వాసం. ప్రతి టిఆర్‌ఎస్ కార్యకర్తకే కాదు,తెలంగాణ ప్రజలు కూడా ఎప్పుడెప్పుడా కేసిఆర్ కొత్త పార్టీ ప్రకటన అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కేసిఆర్ ఫ్రధాని అయితే దేశంలో జరగబోయే అభివృద్ధిని ముందే ఊహించుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కళ్లముందు ఆవిష్కరించిన ప్రగతిని దేశం మొత్తం చూపించడానికి కేసిఆర్‌కు ఎంతో కాలం పట్టదు. అదే నమ్మకం దేశంలోని అనేక మంది నాయకులకు కూడా వుంది. అందుకే కేసిఆర్ దేశ రాజకీయాల్లోకి రాక చారిత్రక అవసంర. కొత్త చారిత్రక నిర్మాణం కోసం అడుగులు వేసేందుకు కేసిఆర్ వడివడిగా కసరత్తు చేస్తున్నాడు.దేశం సస్యశ్యామలం చేయడమే కేసిఆర్ లక్ష్యం.నీళ్లు లేని సాగు, పడావు బడ్డ భూములతో రైతులు పడే వేధన తెలిసిన ఏకైక నాయకుడు కేసిఆర్.
ఎందుకంటే కరువు కోరల్లో చిక్కుకొని, వలస సమైక్యపాలకుల నిర్లక్ష్యంలో చిక్కి శల్యమైన తెలంగాణ నేల చుక్క నీటి కోసం ఎంత విలవిలలాడిరదో తెలిసిన నాయకుడు కేసిఆర్. తడారిన తన గొంతులో మంచినీటి చక్క పడితే ఎలా ప్రాణం లేచి వస్తుందో, ఎండిన భూడులో కూడా తడి కనిపిస్తే రైతుకు అంతే సంతోషం వేస్తుంది. తన కష్టం తీరుతుందని కలలు గంటాడు. ఆశలు పెంచుకుంటాడు. చేలో కనిపించేనీటిని కళ్లకద్దుకొని, సంబురపడతాడు. అదే భూమి ఎండితే తన కన్నీటి చుక్కను జారవిడిచి తడి చేస్తాడు. తన కన్నీళ్లతో భూదేవి గొంతు తడుపుతాడు. తడారని భూమని చూసి కుమిలిపోతాడు. తన బాధ దిగమింగు కోలేక, కన్నీటిపర్యంతమౌతాడు. అలాంటి రైతు కంట కన్నీరొలికిన ఏ రాజ్యం బాగుపడదు. అందుకే రైతు సుఖం, సౌఖ్యమే రాజ్య సౌభాగ్యం అని తెలిసిన ఏకైక నాయకుడు కేసిఆర్. అందుకే దేశ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కరించేందుకు సరికొత్త రాజకీయ రచన సాగిస్తున్నాడు. దసరా వేడుకనే వేదిక చేసుకొని ప్రకటన కోసం సర్వం సిద్దం చేస్తున్నాడు. సంక్షేమ రాజ్య నిర్మాణం అంటే ఏమిటో చూపించిన ఏకైక నాయకుడు కేసిఆర్. ఎందుకంటే గతంలో ఏ ఒక్క పధకమో ప్రకటించి ఇదే స్వర్గం, అదే సంబరం, అంతా సంతోషం, ఇంతకన్నా లేదు సంక్షేమం అని గొప్పలు చేప్పుకున్న పాలకులున్నారు. కాని ఏక కాలంలో, తనకు పాలించే అవకాశం ప్రజలు ఇచ్చిన సమయంలో కొన్ని వందల పథకాలు అమలు చేసి చూపించడం అంటే మాటలు కాదు. అందుకు నిరంతరమైన ఆలోచనలే కాదు, అమలుపై కూడా శ్రధ్ద కావాలి. అందుకు ఎంతో చిత్తశుద్ది వుండాలి. అంకితభావంతోనే రచన జరగాలి. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు విరియాలి. సంతోషం వెల్లివిరియాలి. ఇదంతా జరగాంటే నాయకుడికి ఎంతో ఓర్పు కావాలి. సహనం కావాలి. ప్రజల కోసం నిరంతరం మదిని రంగరించే నాయకుడు కావాలి. అది కేసిఆర్ రూపంలో వుండాలి. అందుకే దేశానికి కేసిఆర్ నాయకత్వం కావాలి.
తెలంగాణ ప్రగతిని దేశమంతా విస్తరించాలి. అది కేసిఆర్‌తోనే సాధ్యం. తెలంగాణ అంటే ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్రం. సుధీర్ఘ కాలం పాటు కేసిఆర్ నేతృత్వంలో పోరాటం చేసి, సాధించుకున్న తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందో ?చూద్దామని సవాలు చేసిన వాళ్లు కూడా విస్తుపోయేలా కేసిఆర్ పాలన సాగుతోంది. అంతే కాదు ఇంత తక్కువ సమయంలో ఒక రాష్ట్రం అన్ని రంగాలలో ప్రగతి అన్నది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదు. పాలకుల అంకిత భావం ఎంతో ముఖ్యం. అయితే తెలంగాణ సాధన ఉద్యమ కాలంలోనే తెలంగాణ సాధిస్తామన్న నమ్మకం వున్న నేత కేసిఆర్, వచ్చే తెలంగాణకు ప్రగతి బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నారు. ఇది సామాన్యమైన నేతలకు సాధమయ్యేది కాదు. అలాగే తెలంగాణ అభివృద్దిలోనే ఇన్ని అద్భుతాలు సాధించినప్పుడు దేశ వ్యాప్తంగా ఎందుకు సాధ్యం కాని ఆలోచించి, దేశాన్ని కూడా తీర్చిదిద్దే ప్రయత్నం కేసిఆర్ మొదలు పెడుతున్నారు. తెలంగాణ నినాదం ఎత్తుకున్న నాడు వినిపించిన విరుపులే ఇప్పుడూ వినిపిస్తూనే వున్నాయి. అయినా కేసిఆర్ ఇలాంటి మాటలకు ఆగడు…తన అడుగులు ఆపడు…పయనమే తెసిన బాటసారే దారి కూడా చూపించుకుంటూ వెళ్తాడు. వెనక వచ్చేవారికి మార్గదర్శకుడౌతాడు. దేశానికి దిశా నిర్ధేశకుడౌతాడు. దేశానిభివృద్ధికి దిక్సూచీ అవుతాడు. ఆయననే మూడక్షరాల ప్రభంజనం కేసిఆర్ అంటారు.