గ్రామాల సమగ్రాభివృద్దికే పల్లె ప్రగతి
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఎనిమిది ఏళ్ల పాలన యావత్ దేశానికే ఆదర్శమని… గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్ గారి చేపట్టారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు. గురువారం పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామపంచాయతి కార్యాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి సత్పలితాలిస్తుందని పల్లెలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అద్భుతాలు జరిగాయన్నారు. గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి పట్ల ఆలోచన చేయలేదన్నారు. ఎనిమిదేళ్ల సిఎం కెసిఆర్ గారి పాలనలో ఎన్నో అద్భుత విజయాలు సాధించామని చెప్పారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే సిఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. దేశవ్యాప్తంగా 20 ఆదర్శ గ్రామాలుగా గుర్తిస్తే వాటిలో 19 తెలంగాణకు చెందిన గ్రామాలే ఉండడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనా విధానం, పాలనా దక్షతకు నిదర్శనమన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడంలో కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని తమ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ వాల్వ అనసూర్య రాంరెడ్డి వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి తహశీల్దార్ వరదన్ కుమార్ ఎంపిడిఓ పాషా ఎంపీటీసీ దుర్గం కుమార్ మార్కెట్ కమిటి చైర్మెన్ అల్లం రాజన్న బయ్యపు మనోహర్ రెడ్డి తంగెడ అనిల్ రావు కిరణ్ మాదాసు అరవింద్ విసారపు రమేష్ మదన్ మెహన్ రావు ముత్యం సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు