విజయవాడ, అక్టోబర్, 4:
దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి కానుకలు సమర్పించి, తీర్ద
ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఎంపీ రవిచంద్ర, ఆయన సతీమణి విజయలక్ష్మి, కూతురు గంగా భవాని లను అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలో రాజ రాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎంపీ కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
*కేసీఆర్ కు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి: రవిచంద్ర*
దసరా రోజున సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్న జాతీయ రాజకీయ పార్టీకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని దుర్గా దేవి ని కోరుకున్నట్లు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కేసీఆర్ అవసరం ఎంతో ఉందని.. ఆయన నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకోవడం ఖాయమన్నారు. కేసీఆర్ కు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.