దివ్యాంగుల సొమ్ము దుబారా చేస్తూ..? దర్జాలు వెలగబెడుతూ!?

` అయ్యో! దివ్యాంగుల మొర వినరా? అని రాస్తే నేటిధాత్రికి నోటీసులిస్తారా..!

` ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు?

`ఎంత కాలం మోసం చేస్తుంటారు?

`అవినీతి సొమ్ముతో లాయర్‌ నోటీసులిస్తే సరిపోతుందా?

` ప్రభుత్వ ఆదేశాలు లేకుండా నేటిధాత్రికి నోటీసులిచ్చే అధికారం ఎవరిచ్చారు?

` ఒక ప్రభుత్వ ఉద్యోగి మీడియాకు లాయర్‌ నోటీసు పంపడం నేరమన్నది తెలుసా?

` ఒక ఉద్యోగి మూడేళ్లకు మించి ఒకే చోట పనిచేయరాదు?

` ఒకవేళ అవసరమైతే ప్రతిసారీ ప్రత్యేకంగా ప్రభుత్వం జీవో విడుదల చేయాలి?

`మూడేళ్లకు మించి ఒకే చోట పనిచేస్తే ట్రెజరీ నుంచి జీతం ఆగిపోవాలి?

` అలా అని సర్వీసు రూల్స్‌ పొందుపర్చిన సంగతి తెలియదా?

`దివ్యాంగులు కమీషనర్‌ ను సస్పెండ్‌ చేయాలని ధర్నాలు చేసింది నిజం కాదా?

`దివ్యాంగులు మీడియా ముందు చెప్పిన విషయాలు అబద్దమా?

`అదే నిజమైతే కమీషనర్‌ మీడియా ముందుకు ఎందుకు రాలేదు?

`నేటిధాత్రి కి నోటీసులిస్తే మీడియా భయపడుతుందా?

`నిజాలు దాచేసి, నోటీసులిస్తే సమస్య లు తీరినట్లా?

`దివ్యాంగుల హక్కుల పరిరక్షణలో నేటిధాత్రి వెనుకడుగు వేయదు?

`అవినీతి చేసిన వారిని వదిలిపెట్టదు.

`పరువు నష్టం వ్యక్తిగత జీవితాలకు వర్తిస్తుంది…?

`ఉద్యోగ నిర్వహణలో అవినీతి ,మరకలు పరువు నష్టం కిందకు రావు?

ప్రజలకు జబాబు దారిగా వుండాల్సిన ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధిలు అవినీతి అక్రమాలకు పాల్పడడం అన్నది నేరం. పైసా పైసా పున్నులు చెల్లించి, ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు జీతాలు చెల్లిస్తారు. అటువంటి వారు అవనీతికి పాల్పడడం వాటిని కప్పిపుచ్చుకోవాలని చూడడం మరీ నేరం. వాటిని మీడియా వెలికి తీయొద్దు? ఎవరూ మాట్లాడొద్దు? మాకు అడ్డురావొద్దు? మేం దోచుకునేది దోచుకుంటాం? మీరెవరు ప్రశ్నించేందుకు? వార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తాం? ఇదా తీరు…ఇదేనా ఉద్యోగులుగా ప్రజలకు వారధులు…ప్రజలకు మేలు చేస్తామని,సేవ చేస్తామని అధికారం అనే కుర్చీలో కూర్చొని, అవినీతికి పాల్పడతామంటే చట్టం ఒప్పుకోదు. మీడియా చూస్తూ ఉపేక్షించదు. తన పని తాను చేసుకుంటూపోతుంది. ప్రజల ముందు దోషులగా నిలబెడుతుంది. అది మీడియా కర్తవ్యం. అవినీతికి, అక్రమాలకు పాల్పడేవారు చేసే తప్పులను బైట పెట్టి, వారిని దోషులుగా సమాజం ముందు నిలబెట్టే మీడియా గొంతు నొక్కాలని చూడడం అవివేకం. అతికి నిదర్శనం. అక్రమార్కుల చర్యలు వెలికి తీసి, వార్తలు ప్రచురించే మీడియాను భయభ్రాంతులకు గురిచేస్తాం..వారికి నోటీసులు పంపుతాం..ఆత్మరక్షణలో పడేస్తామని అపోహపడితే అంతకు మించిన అవివేకం మరొకటి వుండదు. మీడియాకు కూడా కొన్ని బాధ్యతలున్నాయి. అవి చట్టంలో కూడా స్పష్టం చేయబడ్డాయి. ప్రెస్‌ కౌన్సిల్‌ అనే వ్యవస్ధ ఒకటుంటుంది. మీడియాకు విధివిధానాలతోపాటు, పరిధులు కూడా నిర్ధేశింబడ్డాయి. ఆర్‌ఎన్‌ఐ అనే వ్యవస్ధలో ఒక పత్రిక రిజిస్ట్రేషన్‌ చేసినప్పుడే, మీడియా కర్తవ్యం గురించి మార్గదర్శకాలుంటాయి. అందులో ప్రతి మీడియా సమాజంలో జరిగే అన్ని రకాల అవినీతి , అక్రమాలను వెలుగులోకి తెవాలని ఓ క్లాస్‌ వుంటుంది. దానికి కంకణ బద్దులైన తర్వాతే మీడియా తన పని మొదలుపెడుతుంది. దాన్ని అడ్డుకోవడం తప్పు… రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్చలో భాగమైన మీడియా స్వేచ్ఛÛ( ఆర్టికలన్‌ 19(ఎ)ను అడ్డుకున్నట్లే. అది చట్టరిత్యా నేరమే…చట్టం ముందు అందరూ సమానామే…నేను ఉద్యోగిని, నేను ప్రజా ప్రతినిధిని అనే ప్రత్యేక తరతమ బేధాలు లేవు. ఎవరూ ఎక్కువ కాదు..ఎవరూ తక్కువ కాదు. ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడడమే తప్పు. దాన్ని వెలికి తీయడం తప్పన్నట్లు , వాళ్లు చేసిందే మంచిదన్నట్లు భ్రమపడేవారు ఎప్పటికైనా దోషులే…శిక్షార్హులే…మేం వ్యవస్ధను కుదేలు చేస్తాం…అవినీతికి పాల్పడతాం..ఎంతకైనా తెగిస్తాం..అందర్నీ మేనేజ్‌ చేస్తాం..వ్యవస్ధను కూడా గుప్పిట్లో పెట్టుకుంటాం…అనుకుంటే చేసిన మీడియా చూస్తూ ఊరుకోదు…ప్రశ్నించకుండా వుండదు…వార్తల రూపంలో ఎండగట్టడం ఆపదు…సమాజం ముందు దోషులుగా నిలబెట్టకుండా ఉపేక్షించదు. ఏ విషయంలో నోటీసులు పంపాలో కూడా తెలియకుండా, లాయర్లు చేతిలో వున్నారు కదా? అని ఓ నోటీసు పంపించి భయపెడదామని చూస్తే మీడియా వ్యవస్ధ ఊరుకుంటుందా? చేతులు ముడుకొని కూర్చుంటుందా? మీడియాను బెదిరించే రీతిలో లాయర్ల ద్వారా నోటీసులు పంపడం కూడా నేరమే! ముందు ఉద్యోగులు ఈ విషయం తెలుసుకోవడం ముఖ్యం. వందలాది మంది దివ్యాంగులు సంబంధిత కమీషనర్‌ కార్యాలయం ముందు రోజుల తరబడి ధర్నాలు చేశారు. దీక్షలు చేశారు. తమకు అన్యాయం జరుగుతోందని గొంతెత్తారు? కమీషనర్‌ను మార్చాలని డిమాండ్‌ చేశారు. తమకు తీరని అన్యాయం చేస్తున్నారని గళమెత్తారు. తమకు న్యాయంగా అందాల్సిన హక్కులను కమీషనర్‌ హరిస్తున్నారని మీడియా ముఖంగా తమ గోడు వెళ్లబోసుకున్నారు.

తమను కనీసం కార్యాలయంలోకి అనుమతివ్వడం లేదని తమ భాధను వెలుబుచ్చారు. కమీషనర్‌ తనను హీనంగా చూస్తున్నారని ఆరోపించారు. తమకు పురుగులను చూసినట్లు చూస్తున్నారని విమర్శించారు. కమీషనర్‌ ఎప్పుడూ అందుబాటులో వుండరని అన్నారు. తమకు సమయం కేటాయించరని చెప్పారు. కమీషనర్‌ కార్యాలయంలో సిసి కెమెరాలు కూడా తీసేయించారని చెప్పారు. దివ్యాంగులు చెప్పిన ఈ విషయాలన్నీ దివ్యాంగులు భహిరంగంగా చెప్పిన అంశాలే…ఇందులో దాపరికమేముంది? అవి నేటిధాత్రిలో ప్రచురణ జరగడం పరువుకు నష్టం కలిగినట్లా? దివ్యాంగులు చెప్పిన మాటలు తప్పైతే వాటి మీద స్పందించాల్సిన అవసరం కమీషనర్‌కు వుంది. అవన్నీ అబద్దాలైతే , వాటిని ఖండిరచే హక్కు కమీషనర్‌కువుంది. కాని అవేవీ చేయకుండా, దివ్యాంగులు సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి అందాల్సిన సౌకర్యాలు అందడం లేదన్న విషయాన్ని ప్రచురించిన నేటిధాత్రికి దినపత్రికకు నోటీసులు పంపిస్తే నిజాలు అబద్దాలౌతాయా? దివ్యాంగుల సమస్యలు తీరుతాయా? నేటిధాత్రిని భయభ్రాంతులకు గురిచేద్దామని చూస్తే, దివ్యాంగులు ప్రశ్నించడం మానేస్తారా? హక్కుల సాధన కోసం ఉద్యమాలు మానుకుంటారా? నిజానికి నేటిధాత్రిలో వచ్చిన విషయాలపై ఆశాఖలో సమగ్రమైన చర్చ జరగాల్సిన అవరసం వుంది. దివ్యాంగులను పిలిచి కమీషనర్‌ మాట్లాడాల్సింది. వారి సమస్యలు తెలుసుకోవాల్సివుంది. కాని అవేవీ జరగలేదు. జరగడం లేదు. మీడియాకు వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ఎక్కడా వుండవు. సమాజంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలనుంచి ఉద్భవించే ప్రశ్నలే పత్రికల్లో అక్షరాలుగా మారుతాయి. జనం గొంతులకలౌతాయి..ప్రశ్నలు సందిస్తాయి. సమాజాన్ని చైతన్యం చేస్తాయి. అంతే తప్ప వ్యక్తిగతంగా నాపై నేటిధాత్రి వార్తలు రాసిందని కమీషనర్‌ నోటీసులు పంపడం అంటేనే తన డొల్ల తనం బైట పెట్టకున్నట్లు. దివ్యాంగులు సంక్షేమ శాఖలో కమీషనర్‌ కుర్చీలో కూర్చొని, అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపైనే మీడియా వార్తలు రాస్తుందే తప్ప, వ్యక్తిగతంగా ఎలాంటి ప్రశ్నలకు తావుండదు. అది తెలిసి కూడా నేటిధాత్రికి నోటీసులు పంపి, ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఎంత కాలం దివ్యాంగులను మోసం చేస్తారు? వ్యవస్ధను ఎంత కాలం తమ గుప్పిట్లో పెట్టుకుంటారు? అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగి మీడియాకు నోటీసులు పంపడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మరి దివ్యాంగుల సంక్షేమ శాఖ కమీషనర్‌ నేటిధాత్రికి నోటీసులు పంపడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకున్నారో కూడా నోటీసుల్లో వెల్లడిరచాల్సిన అవసరం వుంది. అంతే కాదు ఒక ఉద్యోగి తాను మూడేళ్ల కంటే ఎక్కువ కాలం అదే పోస్టులో, ఒకే దగ్గర పనిచేయడం అంటే కూడా అధికార దుర్వినియోగమే అవుతుంది. సర్వీసురూల్స్‌ ప్రకారం అఫిడవిట్‌ ధాఖలు చేసిన తర్వాతే ఏ ఉద్యోగి అయినా విధుల్లో చేరుతారు. అలాంటిది దివ్యాంగుల సంక్షేమ శాఖ కమీషనర్‌ ఇంత కాలం ఎలా అదే సీట్లో కొనసాగుతున్నారన్నది కూడా తెలియజేయాలి. మూడు సంవత్సరాల తర్వాత అదే ఉద్యోగి అదే స్ధానంలో కొనసాగాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా జీవో పొందాలి.

అలాంటి జీవో కమీషనర్‌కు ప్రభుత్వం ఇచ్చిందా? అన్నది కూడా చెప్పాలి. అంతే కాకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగి మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్నట్లు ట్రెజరీకి సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా సంబంధిత శాఖపైనే వుంటుంది. ఆ శాఖ అధిపతి కర్తవ్యం కూడా. ఒక ఉద్యోగి ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి జీవో జారీ కాకుండా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఒకే చోట విధులు నిర్వర్తిస్తుంటే ట్రెజరరీకి జీతం ఆపే హక్కు కూడా వుంటుంది. మరి ఇన్ని తప్పులు చేస్తూ,నేటిధాత్రి వార్తలు రాయడం తప్పని నోటీసులు పంపడం నేరం కాదా? అయినా దివ్యాంగులు తమ గోడును నేటిధాత్రికి వెల్లబోసుకున్నాయి. సమాజంలో ఏ వ్యవస్తైనా సరే ముందు మీడియాను ఆశ్రయించడం అన్నది రివాజు. అందులో భాగంగా దివ్యాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతిని గురించి వారు వెల్లడిరచారు. నేటిధాత్రి ప్రచురించింది. అందులో ఏవైనా లోపాలుంటే సూచిస్తే సరిదిద్దుకునేందుకు ఏ మీడియా అయినా క్షణం వెనుకాడదు. అంతే కాని నిజాలను రాయడమే తప్పన్నట్లు నోటీసులు పంపిస్తే మీడియా వెనుకడుగు వేస్తుందా? నేటిధాత్రి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కమీషనర్‌కు వుంది. నిధులు గోల్‌ మాల్‌పై వివరణిచ్చుకోవాల్సిన అవసరం కూడా వుంది. ఒక వేళ నిధులు దుర్వినియోగం కాలేదనే చెప్పదల్చుకుంటే, వాటి వివరాలు మీడియాకు అందజేస్తే సరిపోతుంది. దివ్యాంగులు కూడా తమ ఆందోళను విరమించే అవకాశం వుంటుంది. అప్పుడు కమీషనర్‌ నిజాయితీగానే వున్నారన్నది వ్యవస్ధకు తెలిస్తుంది. అంతే కాని చేసిన తప్పులు, జరిగిన అవినీతి అక్రమాలు బైట పడవు అనుకుంటే ఆగతుందా? మీడియాకు నోటీసులు పంపిస్తే జరిగిన తప్పులు ఒప్పులౌతాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!