దింపుడు కల్లం ఆశల్లో కమల, హస్తాలు?

కమల, హస్తాలు విలవిల!

-బిఆర్‌ఎస్‌ కళకళ.

-కాంగ్రెస్‌ ఊపులన్నీ ఉత్తవే…

-కమల బలాలన్నీ భ్రమలే…

-కాంగీయులవి పగటి కలలే..

– కమలానికి ఉలికిపాటే..

-పోటీకే దిక్కులేదులే…

-బిఆర్‌ఎస్‌ నుంచి ఎవరొస్తారా? అని ఎదురుచూపులే.

-వాషింగ్‌ పౌడర్ల కోసం వెతుకులాటే.

– హస్తమంతా అస్తవ్యస్తంమే…

– కమలంలో అన్నీ కలహాలే.

-ఐక్యతకు ఆ పార్టీలలో తావే లేదు?

-బిఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ చూస్తారు.-కారు వంద స్పీడ్‌ గ్యారెంటీ.

-ప్రతిపక్షాలకు పట్టుమని పది వస్తే ఎక్కువ..

– హస్తం లుకలుక…కమలం వెలవెల.

 

హైదరబాద్‌,నేటిధాత్రి:                                         

రాష్ట్ర రాజకీయాల్లో ఈసారి కూడా మళ్లీ బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించే వాతావరణమే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కారు స్పీడు వంద దాటే అవకాశాలున్నాయంటున్నారు. ప్రతిపక్షాలకు మళ్లీ భంగపాటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. పైన పటారం లోన, లొటారంలా వున్న ప్రతిపక్ష పార్టీలు ఊపును కొద్ది కాలం చూపించుకోకపోతే కష్టమన్న ఆలోచనకు వచ్చి, తాము బలంగానే వున్నామని చెప్పుకోకపోతే కష్టంగా మారుతుందని ఆలోచన చేస్తున్నట్లున్నాయి. అందుకే అసలు ప్రతిపక్షాల పరిస్ధితి క్షేత్రస్ధాయిలో ఎలా వుందనేదానిని గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలోని ఏ గ్రామంలో చూసుకున్నా పట్టుమని పది మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌, బిజేపిలకు లేరు. ఇది వాస్తవం అన్నది కాంగ్రెస్‌కు తెలుసు. బిజేపికి ఆ మాత్రం కూడా లేరని ఆ పార్టీకి తెలుసు. కాకపోతే కొద్ది కాలం వాళ్లు తమకు బలం వుందని చూపించుకుందామనుకున్నారు. అందులోనూ వాషింగ్‌ పౌడర్‌ నిర్మాలైనా దిక్కౌతాయని అనుకున్నాయి. కాని అవి కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. సహజంగా పదేళ్ల తర్వాత ఏ పార్టీలోనైనా అంతో ఇంతో అసంతృప్తి సహజం. ఎక్కడో అక్కడ అలాంటి వాళ్లు బైటపడుతుంటారు. తమకు పదేళ్ల తర్వాత కూడా అవకాశం దక్కకపోతే ఎలా? అనుకునే నాయకులు కొందరు నాయకులు సహజంగా పక్క చూపులు చూడడం సహజం. అదే అదునుగా బిఆర్‌ఎస్‌ నుంచి ఎవరైనా రాకపోతారా? వాళ్లు మన పార్టీకి దిక్కు కాకపోతారా? అన్నంత ఆశగా గత మూడేళ్లుగా ఎదరుచూస్తునే వున్నాయి. ఇదిగో వచ్చే…ఇదిగో వచ్చే అంటూ కాలయాపన తప్ప ప్రతిపక్షాలు స్వతహాగా ఎలా బలపడాలన్నదానిపై దృష్టిపెట్టలేదు. పుణ్య కాలంకూడా అయిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పార్టీలు ఇంకా దింపుడు కళ్లెం ఆశతోనే కాలం వెల్లదీస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ నుంచి నాయకులు ఎవరైనా వెళ్లిపోయేవారు వుంటే, ఇప్పటికే వెళ్లిపోయేవారు. కాని ఇప్పుడు వెళ్తారనుకోవడం, వాళ్లు వచ్చి మా పార్టీలో చేరుతారని ప్రతిపక్షాలు ఆశపడడం ఆశ్యర్యంగా వుంది. సహజంగా ఈ పదేళ్ల కాలంలో ఎంతో కొంత కాలం పదవులు అనుభవించిన వాళ్లు పార్టీ మారితే ప్రజలే వారికి తగిన బుద్ది చెబుతారు. బిఆర్‌ఎస్‌ నుంచి బిజేపి వెళ్లిన వాళ్లలో దాసోజు, స్వామీ గౌడ్‌ లాంటి వారు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. బిజేపి నుంచి చాలా మందే కప్పదాటుడుకు సిద్దంగా వున్నారని తెలుస్తోంది. అంతే కాని బిఆర్‌ఎస్‌ నుంచి వెళ్లేందుకు ఎవరూ సిద్దంగా లేరు. ఈ పదేళ్లలో ఎలాంటి పదవులు దక్కని వారు వెళ్లేందుకు పెద్దగా సిద్దంగా లేదు. ప్రతిపక్షాలు బలపడినట్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. మబ్బులను చూసి ముంత ఒలకబోసుకునేంత అమాయకులు కాదు మన నాయకులు. ఇక ప్రతిపక్షాలలో కూడా పదేళ్ల కాలంగా అదికారం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు వున్నారు. వాళ్లను కాదని పదవులు కొత్త వారికి ఇవ్వడం అన్నది కష్టమైన పని. అందుకే అధికార బిఆర్‌ఎస్‌ను వదిలి వెళ్లడం అంటే రెంటికీ చెడిన రేవడి కావడమే అవుతుంది. అందువల్ల అలాంటి ఆశలు కూడా ప్రతిపక్షాలకు తీరవనే తెలుస్తోంది. ఇక ప్రతిపక్షాలలో కాంగ్రెస్‌ పార్టీ అనుకున్నంతగా కాని, ప్రచారం చేసుకుంటున్నంత గాని ప్రజల్లో లేదు.

 ఇప్పటికీ ఆ పార్టీకి పట్టుమని పది మంది గట్టి నాయకులు, కార్యకర్తలు లేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేని ఎంతో మంది కాంగ్రెస్‌ నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో, కాంగ్రెస్‌లో వున్న నాయకులు ఆ పార్టీకి క్యూ కట్టారు. దాంతో వారి అనుచరులంతా బిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడం, బిఆర్‌ఎస్‌కు ఊహించని మెజార్టీ సీట్లు రావడంతో ఇక కాంగ్రెస్‌ పని అయిపోయినట్లే అనుకున్నవాళ్లంతా బిఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యే స్దాయి నేతలంతా ఎప్పుడో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ను ఆకర్షించలేకపోయింది. తెలంగాణలో అమలౌతున్న అనేక సంక్షేమ పథకాలు దాదాపు ప్రజలందరికీ అందుతున్నాయి. ప్రతి కుటుంబానికి ఏదో రకంగా ఏదో ఒక పథకం అందే వుంది. పైగా ప్రతి కుటుంబానికి రైతు బంధు వస్తోంది. సాగుకు 24 గంటల కరంటు అందుతోంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో బిఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా నిలిపింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం ప్రతి గడప, గడపకూ చేరింది. ఆయన నాయకత్వం మీద ప్రజలందరికీ నమ్మకం మరింత పెరిగింది. తెలంగాణలో ఆసరా పించన్లు పెద్దఎత్తున అమలౌతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా పించన్లు అందిస్తున్నారు. అటు వృద్యాప్త పించన్లు, ఇటు ఒంటరి మహిళల పింఛన్లు, వికలాంగుల పించన్లు, బీడి కార్మికుల పించన్లు అందుతున్నాయి. వాటికి తోడు నేతలన్నలకు, గీతన్నకలకు కూడా పించన్లు అందుతున్నాయి. దాంతో తెలంగాణలోని ప్రతి ఇంటికి ఏదో రకమైన పథకం అందుతోంది. ఇలాంటి సమయంలో ఏ ఒక్కరిని కదిలించినా చెప్పే మాట ఒకటే..మళ్లీ మా సిఎం. కేసిఆరే అని..! ఈ విషయాలు కాంగ్రెస్‌కు తెలుసు. బిజేపికి తెలుసు. అయినా రాజకీయ పార్టీ అన్న తర్వాత యుద్ధం చేయాలంటే , నిలబడాలి. తలపడడం తర్వాత…వున్నామన్న ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్‌, బిజేపిలు సాగుతున్నాయి. అంతే తప్ప ప్రజల్లో బలముందనో…గెలుస్తామన్న ఆశ మాత్రం ఆ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి లేకపోవడం గమనార్హం. 

 ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. 

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న రాజకీయ విన్యాసం వల్ల కాంగ్రెస్‌పార్టీకి మొదటికే మోసం వచ్చే పరిస్ధితి వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లో కనీసం గుర్తింపు లేని నాయకులను తెరమీదకు తెచ్చి, నాలుగురైదుగురికి ఆశ చూపి, టిక్కెట్‌ నీకే అంటూ మభ్యపెడుతున్నాడని సమాచారం. తెలంగాణ యాసలో చెప్పాలంటే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్లు చేస్తున్నాడనేది కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన వాదన. దీనికి తోడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసిన పొన్నం ప్రభాకర్‌ లాంటి వారిని పక్కన పెట్టే ప్రయత్నం చేయడం అంటేనే ఆ పార్టీని రేవంత్‌రెడ్డి నిండా ముంచేందుకే కంకణం కట్టుకున్నాడనేది సుస్పష్టమౌతున్న అంశం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక నియోజకవర్గాలలో ఇలాంటి పరిస్థితులే సృష్టించి ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను గంగలో కలిపే పన్నాగం రేవంత్‌రెడ్డి బాగానే పన్నుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే బిజేపి పరిస్ధితి అంతకన్నా అద్వాహ్నంగా వుంది. బండి సంజయ్‌ అధ్యక్షుడుగా వున్నప్పుడు కనీసం ఊపైనా కనిపించింది. ఇప్పుడు అది కూడా లేకుండాపోయింది. పార్టీ శ్రేణుల్లో నిస్తేజం ఆవహించింది. కనీసం కార్యకర్తలకు వున్న అవగాహన కూడా నాయకులకు లేకుండాపోయింది. పార్టీ ఏ పరిస్దితుల్లో వుందో కూడా వారు అర్ధం చేసుకునే స్దితిలో లేరు. అందుకే హడావుడిగా అధ్యక్షుడిని మార్చుకున్నారు. పూడ్చుకోలేని తప్పు చేశారు. ఇప్పుడు లబోదిబో అంటున్నారు. కాని బైటకు వినిపించకుండా ఏడుస్తున్నారు. వున్న బలం పోయింది. కొత్త బలం రాదని తెలిసింది. వలస పక్షులను నమ్ముకొని ఇప్పటికే మునిగిన కలమం, మరింత వాడిపోయేందుకు సిద్దంగా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!