దారి వెతుక్కునే పనిలో దానం!?

`ఈసారి దానంకు టికెట్‌ కట్‌ అని ముందే చెప్పిన నేటిధాత్రి.

`అదే వార్తను అన్ని మీడియా సంస్థలు ఇప్పుడు చెబుతున్నాయి.

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌ వైపు చూస్తున్నట్లు స్పష్టం!

`బిజేపి వైపు కూడా చూస్తారేమో! అనుకుంటున్న జనం.

`ఇప్పటికే అన్ని పార్టీలు చుట్టేసిన రాజకీయం!

`ఉద్యమ నేపథ్యం లేకున్నా ఆదరించినా మారని దానం?

`తన సొంత ఎజెండాతో ఉద్యమ కారులకు దూరం?

`వివాదాలతోనే నిత్యం ఆధిపత్యం!

`భూ కబ్జా ఆరోపణలు నిత్యకృత్యం!

`ప్రజా సేవకు చాలని సమయం?

`ప్రచారం, ఆర్భాటం మాత్రమే ఇష్టం!

 హైదరబాద్‌,నేటిధాత్రి:                         

రాజకీయాలో అదృష్టం, దురద్రుష్టం రెండూ కొన్ని సార్లు కలిసే వస్తుంటాయి. అలాంటి అనుభవాలు వున్న నాయకుల్లో ఖైతరాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఒకరు. ప్రజలు పదవి ఇచ్చినా కాపాడుకోలేదు. పార్టీలు ఆదరించినా నిలుపుకోలేడు. ఇది గతంలోనూ నిజమైన సందర్భం వుంది. ఇప్పుడూ అదే జరుగనున్నది. స్వతహాగా ఆయన ఎవరినీ నమ్మడు. ఆయనను ఎవరూ నమ్మకుండా చేసుకుంటాడని ఆయన సన్నిహితులే చెబుతుంటారు. ఇదంతా ఆయన చేసుకునే స్వయంకృతాపరాధమే..అయినా కొన్ని సార్లు కలిసి వస్తుంది. వచ్చింది కూడా…అయినా నిలుపుకోలేని తనం మాత్రం ఆయన సొంతం. అందుకే ఆయన ఇప్పటికే పార్టీలన్నీ చుట్టివచ్చారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు కల్పించిన నాయకులకు నమ్మకమైన వ్యక్తి కాలేదు. ఆయనను నమ్మిన వారిని పెద్దగా ఉపయోగపడిరది లేదు. ఆదరించిన పార్టీల కోసం ఆయన పనిచేసింది లేదు. ఎంత సేపు ఆయన రాజకీయం..ఆయన ఎదుగుదల..తప్ప మరో ఆలోచన ఆయనకు లేదన్నది గత మూడు దశాబ్ధాల దానం రాజకీయ చరిత్ర చూస్తేనే అర్ధమౌతుంది. కాలం మారినా ఆయనలో మార్పు రాకపోవడంతో బిఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఆసారి ఆయనను మార్చేందుకే సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గతంలోనే నేటిధాత్రి చెప్పింది. దానం నాగేందర్‌కు ఈసారి టికెట్‌ కట్‌ అన్న విషయాన్ని ముందే వెల్లడిరచింది. ఆది నుంచి ఆయన వ్యవహార శైలి ఎలా వుంటుందంటే ఈ పార్టీ కాకుంటే మరో పార్టీ అన్నదే అనుసరించే ధోరణి. అందుకే ఏ పార్టీకి ఆయన పెద్దగా దగ్గరైంది లేదు. అవసరమున్నంత కాలం అందరికీ దగ్గరే అన్నట్లు వుంటాడు. వారి అవసరం లేదనుకున్నప్పుడు వారికి దూరంగా వుంటాడు. ఇదీ ఆయన రాజకీయం. ఇప్పుడు కూడా బిఆర్‌ఎస్‌లో టికెట్‌ రాదన్న సంగతి ఆయనకు తెలిసిపోయింది. అందుకే ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు కూడా సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతో, ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు విహెచ్‌తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయనైతేనే పార్టీలోకి తీసుకోవాలని చెబుతాడు. పైగా పార్టీ కూడా గర్‌ వాపసీ కూడా అనుకూలంగా మారుతుందని ఆశించాడు. ఇది దానంకు అనుకూలంగా మారే అవకాశాలు కొంత వున్నప్పటికీ కాంగ్రెస్‌ లో మాత్రం ఆయనకు టికెట్‌ వస్తుందన్న నమ్మకం అక్కడా లేదు. ఇప్పటికే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పుడు దానం వచ్చి సీటు కావాలంటే అక్కడ కూడా ఇచ్చే పరిసి ్దతి కనిపించడం లేదు. పోతే ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన (ఆసిఫ్‌ నగర్‌ )ప్రస్తుతం నాంపల్లి నుంచి అవకాశం ఇస్తే పోటీ చేస్తానని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. కాని దానం వస్తే ఎట్టిపరిస్ధితుల్లో తాము సహకరించమని నాంపల్లికి చెందిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఖరాఖండిగా చెప్పినట్లు కూడ పార్టీ ముఖ్యులు చెబుతున్న మాట. పార్టీ కష్టంలో వున్నప్పుడు వదిలేసి, ఇంత కాలం పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని ఎవరికీ ఇచ్చే పరిస్ధితి కాంగ్రెస్‌లో కూడా కనిపించడం లేదంటున్నారు. . గతంలో ఆయనను నమ్మి పార్టీ ఆసిఫ్‌ నగర్‌ నుంచి మూడు సార్లు గెలిపిస్తే పార్టీని, నాయకులను నట్టెల్లో ముంచి వెళ్లిపోయారు. అలాంటి నేతను మళ్లీ మా భుజాల మీద మోయలేమని కూడా కాంగ్రెస్‌ నేతలు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆసిఫ్‌ నగర్‌ నియోజకవర్గం డీ లిమిటేషన్‌లో నాంపల్లిగా మారిపోయింది. ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ అంత బలంగా లేదు. వున్నా అక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చే పరిస్ధితి కనిపించడం లేదు. ఒక వేళ మళ్లీ ఖైరతాబాద్‌ టిక్కెట్‌ కోసం ఎంత ఒత్తిడి తెచ్చినా కాంగ్రెస్‌ పార్టీని ఇంత కాలం కాపాడుకుంటూ వచ్చిన వారు అంగీకరించే పరిస్ధితి లేదు. ఆదరించిన కాంగ్రెస్‌ను ఆనాడు వదిలేశాడు. అయినా నమ్మినందుకు బిఆర్‌ఎస్‌కు దానం ఒరగబెట్టిందేమీ లేదు. 

రాజకీయ బిక్ష పెట్టిన పి. జనార్ధన్‌ రెడ్డి కుటుంబ రాజకీయాన్ని చిన్నా భిన్నం చేసిన చేసిన నాయకుడిగా ఆయనకు హైదరాబాద్‌ కాంగ్రెస్‌ నేతల్లో దానంపై ఆగ్రహం వుంది. 

గతంలో ఆసిఫ్‌ నగర్‌ టికెట్‌ దక్కడానికి కారణమైన పిజేఆర్‌ను కాదని దానం వైఎస్‌. రాజశేఖరరెడ్డి పంచన చేరాడు. 1994లో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినంత పనైంది. అప్పటి కాంగ్రెస్‌ ఉద్దండ నాయకులుగా గుర్తింపు వున్న నేతలంతా ఓడిపోయారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ 26 సీట్లు మాత్రమే సాధించింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడంలో అప్పటి హైదరాబాద్‌ బ్రదర్స్‌గా పిలువబడిన పి. జనార్ధన్‌రెడ్డి, ఏ. కోదండరెడ్డిలు ఎంతో కృషి చేశారు. అయితే 1999 ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్‌. రాజశేఖరరెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. గెలిచారు. కాని పి. జనార్ధన్‌రెడ్డి ఆ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి ఓడిపోయారు. అందుకు ఆ సమయంలో అటు వైఎస్‌, ఇటు చంద్రబాబు ఇద్దరూ కలిసి ఓడగించారని చెప్పుకునేవారు. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలంతా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన విజయరామారావుకు మద్దతు పలికేలా వైఎస్‌ రాజకీయం నెరిపారన్నది పెద్ద చర్చ. అయితే ఆ ఎన్నికల్లో దానం నాగేందర్‌ ఆసిఫ్‌ నగర్‌నుంచి గెలుపొందారు. అప్పుడు వైఎస్‌. పంచన చేరి రాజకీయం నెరిపాడు. కాని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దానం వ్యవహరశైలి నచ్చక టికెట్‌ ఇవ్వలేదు. ఈ సమయంలో వైఎస్‌. కూడా దానంకు టిక్కెట్‌ ఇప్పించలేకపోయాడు. 1999 ఎన్నికల్లో టికెట్‌ ఇప్పించిన పిజేఆర్‌ను కాదని, వైఎస్‌ను నమ్ముకున్న దానంకు టికెట్‌ దక్కలేదు. వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లి కాల్లావేళ్లా పడి రాత్రికి రాత్రి టిక్కెట్‌ తెచ్చుకున్నాడు. దానంకు కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందని ప్రజలు కూడా సానుభూతితో గెలిపించారు. అయినా దానం ఆశ అక్కడితో ఆగలేదు. తన అతివిశ్వాసం కొంప ముంచింది. వైఎస్‌ను నమ్మి నిండా మునిగాడు. 2004 ఎన్నికల్లో ఆసిఫ్‌ నగర్‌ నుంచి గెలిచిన రోజునే రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు కారణమయ్యాడు. దాంతో ఆసిఫ్‌ నగర్‌ ప్రజలు తగిన శాస్తి చేశారు. పార్టీమారినా గెలిపించిన ప్రజలు ఉప ఎన్నికలకు వెళ్లిన దానంను ఓడిరచారు. ఉన్న పదవి పోగొట్టుకొని, నమ్మకం లేని నాయకులను నమ్ముకొని ఎటూ కాకుండాపోయారు. అయితే వైఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రసన్నం కోసం చేసిన హడావుడిలో ఆనాటి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే, దానం రాజకీయ గురువైన పిజేఆర్‌ కు గుండెపోటుతో పడిపోయినా పట్టించుకోలేదన్న అపవాదును ఎదుర్కొన్నాడు. 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి అయ్యాడు. తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అణచివేయంలో సీమాంధ్రుల కొమ్ము కాశాడు. తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ పట్టుకొని బెదిరించాడు. అప్పటి శ్రీకృష్ణ కమిటికి తెలంగాణను దేశానికి రెండో రాజధాని చేయమని, లేకుంటే (యునైటెడ్‌ టెరిటరీ, (యూటి) కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లెటర్‌ రాశాడు. ఇలా తెలంగాణ ఉద్యమానికి కూడా తీరని అన్యాయం చేశాడు. 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి ఓడిపోయి, బిఆర్‌ఎస్‌లో చేరాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ను దుర్భాషలాడాడు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ మనసులో పెట్టుకోకుండా ఆదరించాడు. కాని ఇప్పుడు కూడా దానం తన పాత వ్యవహరశైలినే ప్రదర్శించాడని నాయకులు అంటున్నారు. 

 దానం ఏ పార్టీలో వున్నా తాను తప్ప మరో నాయకుడును ఎదగనివ్వరు. ద్వితీయ శ్రేణి నేతలను కూడ ఎదగనివ్వరు. 

ఆయనకు రాజకీయం, ప్రచారం, ఆర్భాటం మాత్రమే ఇష్టం. అందుకే ఆయన ఎక్కడా పార్టీ కోసం పనిచేసినట్లు కనిపించదు. కరోనా సమయంలో ఆయన ప్రజలను పట్టించుకోలేదు. బిఆర్‌ఎస్‌ కార్యకర్తలను అసలే పట్టించుకోలేదు. అందుకే ఆయనంటే ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్‌ నేతలు ఈసారి దానంకు టికెట్‌ ఇవ్వొద్దంటూ పార్టీ పెద్దలకు గట్టిగానే చెబుతూ వచ్చారు. అందుకే ఆసారి పార్టీ టికెట్‌ ఇవ్వడం లేదన్న సంకేతాలు దానంకు పంపడం జరిగిందనే దానం దారి వెతుక్కుంటున్నాడని విశ్వసనీయ సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!