దానం దుక్నం బంద్‌?

`టిక్కెట్‌ రాదని తెలిసిపోయింది?

`మంత్రి తలసానిని ఓడిస్తే భవిష్యత్తులో తానే మంత్రిని అని కలలు?

`టికెట్‌ దక్కేలా లేదని ఆందోళన?

`అయినా తన ప్రయత్నం ఆపనని సన్నిహితుల వద్ద ప్రస్తావన?

`అంబేద్కర్‌ జయంతి రోజు హంగామాతో మళ్ళీ అధినేత ఆశీస్సులు పొందాలని తాపత్రయం?

`బిఆర్‌ఎస్‌ డిల్లీ కార్యాలయం ప్రారంభానికి దూరం?

`అప్పటికే ఇతర పార్టీలతో సంప్రదింపులు?

`ఎక్కడా టికెట్‌ దక్కే అవకాశం కనిపించలేదు?

` కాంగ్రెస్‌ కాదన్నది?

`బిజేపి వద్దన్నది?

`బిఆర్‌ఎస్‌ లో కూడా అంతే సంగతులు అని తేలిపోయింది?

`ఏదైనా కొత్త కుంపటిలో దూరడమే అంటున్నారు?

`దానంను దూరం పెడుతున్నారని తెలిసి బిఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో సంబరాలు?

`మా ఉసురు తగిలిందని గ్రూపులలో వాట్సన్‌ సందేశాలు?

హైదరబాద్‌,నేటిధాత్రి:

రాజకీయాల్లో అన్ని రోజులు మనవి కాదు. ఎప్పుడూ మనకే అనుకూలంగా వుండవు. ఎత్తు పల్లాలు సహజం. కని అవాంతరాలు సహజంగా వచ్చేవే అయితే సరే..కాని నాయకులే సృష్టించుకుంటే..అహానికి పోయి తనే సర్వస్వం అనుకుంటే కాలం కూడా ఎదురుతిరుగుతుంది. అందుకే రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ చెడగొట్టరు. వాళ్లకు వాళ్లే తమ రాజకీయ జీవితంలో అలజడులు సృష్టించుకుంటారు. నిలకడలేని నాయకత్వం చేసేవారిలోనే ఇలాంటి సంఘటనలు, సందర్భాలు చూస్తుంటాం. అయినా వారిలో మార్పు రాదు. ఇలాంటి రాజకీయాలు చేసినా కొన్ని అవకాశాలు మళ్లీ తలుపుతడతాయి. అయినా వాటిని నిలుపుకోరు. అలాంటివారిలో దానం నాగేందర్‌ ఒకరు. ఆయనకు అనేక సందర్భాలలో అవకాశాలు కలిసొచ్చినా, కావాలని ఆయన చేజేతులా చేసుకున్న నిర్ణయాలే రాజకీయ అవకాశాలు తలకిందులు చేశాయి. పడుతూ లేస్తున్నట్టు కనిపించినా, అవకాశాలను దుర్వినియోగం చేసుకోవడమే కాదు, నమ్మిన వాళ్లను కూడా నట్టేట ముంచే రాజకీయాలు చేయడమే అవుతుంది. ఇప్పుడు కూడా అదే చేసే కుయుక్తులు పన్నడమే కాకుండా, నమ్మి గెలిపించిన ప్రజల కోసం పనిచేయడం లేదని, పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఆది నుంచీ వున్నవే. సహజంగా ఎవరినీ లెక్కచేయిన మనస్తత్వం దానం నాగేందర్‌ది అంటారు. గత ఎన్నికల మందు బిఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌కు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఖైరతాబాద్‌ టిక్కెట్టు ఇచ్చారు. 

కాని ఆయన పార్టీ కోసం పెద్దగా పనిచేసినట్లు కనిపించదు. పార్టీ నేతలను కలుపుకుపోతున్నట్లు వుండదు. సహజంగా తాను హైదరాబాద్‌ బాద్‌షా అన్నంతగా మాట్లాడే దానం నాగేందర్‌ గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పెద్దగా పాత్ర పోషించలేదన్న వాదనలు వున్నాయి. గతంలో కాంగ్రెస్‌లో వున్న సమయంలో ఆయన ఆ పార్టీ కోసం పనిచేసినంతగా ఇప్పుడు బిఆర్‌ఎస్‌ కోసం పనిచేయడం లేదన్నది చాలా మంది చెబుతున్న మాట. ఎందుకంటే గతంలో కాంగ్రెస్‌ పార్టీ విషయంలో అటు బిజేపిపైగాని, ఉద్యమ సమయంలో బిఆర్‌ఎస్‌ పార్టీలంటే ఒంటి కాలు మీద లేచేవారు. నిత్యం వార్తల్లో వుంటూ వుండేవారు. దూకుడు ప్రదర్శిస్తూ వుండేవారు. అనేక సార్లు ఉద్యమ పార్టీ బిఆర్‌ఎస్‌ను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ వుండేవారు. ఇక అసెంబ్లీలో అయితే దానం తనదైన శైలిలో బిఆర్‌ఎస్‌ను , ఉద్యమ నాయకులైన ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతుండేవారు.కాని ఇప్పుడు బిఆర్‌ఎస్‌లోవున్నారు. బిజేపి పార్టీని పల్లెత్తు మాట అనడం లేదు. ఇటీవల బిజేపి చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడం లేదు. కల్వకుంట్ల కవిత విషయంలో బిజేపి అనుసరిస్తు తీరును ఆక్షేపించడం లేదు. ఎక్కడా దానం ఆ విషయాల గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఇలా పార్టీలోనే వుంటూ పార్టీకి అంటీ ముట్టనట్లు వుంటున్నాడు. బిఆర్‌ఎస్‌కు అండగా వుండడం లేదు. ఇదీ పార్టీ శ్రేణులు చెబుతున్న మాట. అంతే కాకుండా దానం ఉద్యమ నాయకుడు కాదు. ఉద్యమ సయమంలో కాంగ్రెస్‌లో వున్నా, ఉద్యమానికి ఏనాడు సహకరించింది లేదు. అప్పటి కాంగ్రెస్‌ ఎంపిలు, కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రుల ఉద్యమానికి పరోక్ష మద్దతు తెలిపినా, దానం మాత్రం పూర్తి విరుద్దంగా వ్యవహరించారు. దానంకు ఆది నుంచి తెలంగాణ కోసం కాంగ్రెస్‌ ప్రకటన చేయడమే నచ్చలేదు. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమం ఇష్టం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఇష్టం లేదు. తెలంగాణ ఉద్యమ తీవ్రత, ముఖ్యమంత్రి కేసిఆర్‌ దీక్షకు తలొగ్గి, యూపిఏ తెలంగాణ ప్రకటన చేసింది.

అర్దరాత్రి స్వతంత్రంలాగా తెలంగాణకు స్వాత్యంత్య్రం వచ్చింది. కాని సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి అన్ని పార్టీలు ఏకమై, చంద్రబాబు నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేశారు. దాంతో తెలంగాణ ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకొని శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది. 

ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రులు చాలా మంది రాజీనామా చేశారు.కాని దానం నాగేందర్‌ రాజీనామా చేయలేదు.

 ఎందుకంటే ఆయనకు తెలంగాణ రావడం ఇష్టం లేదు. ఒకనాడు వైఎస్‌. రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు రాసిన ఉత్తరంలో సంతకం చేసిన దానం నాగేందర్‌, అదే సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల పక్కన చేరి తెలంగాణను అడ్డుకున్నాడు. అందుకే ఆయన ప్రతి సందర్భంలోనూ తెలంగాణను వ్యతిరేకించారు. పైగా శ్రీకృష్ణ కమిటికీ దానం నాగేందర్‌ ప్రత్యేక నివేదిక ఇచ్చారు. తెలంగాణ వద్దన్నారు. ఒక వేళ తెలంగాణ ఇవ్వాల్సి వస్తే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటూ మొకాలడ్డిన నేత దానం నాగేందర్‌. అయితే సమైక్యాంద్ర ప్రదేశ్‌ వుండాలి. లేకుంటే మా హైదరాబాద్‌ మాకే అన్న నినాదంతో ఉద్యమం కూడా చేస్తానని అనేక సార్లు తెలంగాణ వాదులకు హెచ్చరికలు కూడా జారీ చేశాడు. ఆంధ్ర నాయకులు చెప్పినట్టు వింటూ, వారు ఆడిరచినట్లు ఆడిన దానం నాగేందర్‌ బద్ద తెలంగాణ వ్యతిరేకి. బిఆర్‌ఎస్‌లో చేరినా ఆయనకు ఇంకా తెలంగాణ మీద మమకారం పెరిగినట్లు లేదని అంటున్నారు. అందుకే బిఆర్‌ఎస్‌లో చేరినా, ఆది నుంచి ఆయనతో కొనసాగుతున్న అనుచర గణానికి ఇచ్చిన ప్రాదాన్యత ఉద్యమ కారులైన కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యతనివ్వడం లేదన్నది ప్రధాన ఆరోపణ. 

అడుగడుగునా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్న దానం నాగేందర్‌ ఉద్యమకారులైన నాయకులతో సఖ్యతగా వుంటాడని అనుకోవడం కూడా భ్రమే అవుతుంది. 

తిట్టే నోరు..నడిచేకాలు ఊరుకోదని ఆనాడు తెలంగాణ వాదులను తిట్టి, తిట్టీ రాజకీయాలు చేసిన దానం నాగేందర్‌ బిఆర్‌ఎస్‌లో వున్నా ఆ పార్టీ మీద పెద్ద మమకారం లేదు. ఎందుకంటే ఇటీవల డిల్లీలో బిఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభానికి తెలంగాణ ఎమ్మెల్యేలంతా వెళ్లారు. కాని దానం నాగేందర్‌ మాత్రం డిల్లీ వెళ్లలేదు. కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదన్నది నాయకులకు చెబుతున్న మాట. ఇదిలా వుంటే అటు ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని నాయకులతో సఖ్యత లేని దానం నాగేందర్‌ ఎలాగైనా ఈసారి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను ఓడిరచాలన్న స్చెచ్‌ వేస్తూ వస్తున్నాడని పార్టీ గుర్తించిందని సమాచారం. దాంతో దానం నాగేందర్‌ రాజకీయాన్ని పసిగట్టిన తలసాని తన రాజకీయ ఎత్తుగడలకు పదును పెట్టినట్లు కూడా తెలుస్తోంది. నగర ఎమ్మెల్యేగా మంత్రి తలసానితో సఖ్యతలో వుండాల్సిన సమయంలో ఆయనతో వైరం కొని తెచ్చుకోవడం దానంకు చెక్‌ పెట్టేదాకా వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఎలాగైనా ఈసారి దానంకు టిక్కెట్టు ఇచ్చేందుకు పార్టీ పెద్దలు కూడా నిర్ణయం తీసుకున్నట్లే ప్రగతిభవన్‌ వర్గాల అంటున్నాయని పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. అందుకే తన ప్లాన్‌ బెడిసికొట్టేలా వుందన్న సంగతి తెలిసిన దానం ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరాలని అనుకున్నారట. కాని అక్కడ ద్వారాలు మూయబడ్డాయన్న సమాచారం అందడంతో అటు వైపు చూడకుండా, బిజేపి వైపు చూడాలని ప్రయత్నం చేశాడట. కాని అక్కడ కూడా చోటు లేదని తేల్చి చెప్పడంతో ఇక బిఆర్‌ఎస్‌లోనే వుండడమా? లేక తెలంగాణలో వచ్చే కొత్త కుంపటి ఏదైనా సరే అందులో చేరడమా? అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!