దళిత బందు ఇవ్వకుంటే ఎమ్మెల్యే,ఎంపి కార్యాలయాలను ముట్టడిస్తాం

 

కేసముద్రం(మహబూబాబాద్),నేటిధాత్రి:

ఆర్హలైన తమకు దళిత బంధు ఇవ్వాలంటూ కేసముద్రం మండలం తాళ్ళుపూసపల్లి గ్రామంలో శుక్రవారం ప్రధాన రహదారి పై దళిత కుటుంబాలు రాస్తారోకో నిర్వహించారు.అర్హలైన మాకు దళిత బంధు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,మూడు ఎకరాలు భూమి ఇవ్వాలంటూ అందోళన కార్యక్రమం చేపట్టారు.సీఎం డౌన్ డౌన్ అంటూ ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దళిత బంధు ఇవ్వకపోతే ఎమ్మెల్యే,ఎంపీ ఆఫీస్ లను ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.దళితులకు ఎన్నికల ముందు ఎన్నో హామీలను ఇచ్చి అవసరం తీరాక మొఖం చాటేసారని దుయ్యబుట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!