ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు కల్లెపేల్లి సురేష్
#నెక్కొండ, నేటి దాత్రి: మండలంలోని బంజరుపల్లి గ్రామంలో దళితుల సమావేశాన్ని ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఈదునూరి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు .ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు కల్లెపెళ్ళీ సురేష్ హాజరయ్యారు. అనంతరం కల్లే పెళ్లి సురేష్ మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేకమైన ఆశీస్సులతో రెండవసారి శాసన సభ్యులుగా ఎన్నికల బరిలో మన ముందుకు వస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దళిత వర్గాలు అంత పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారని దళితుల ఆర్ధిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటే మేమంతా ఉంటాము అంటు గ్రామ గ్రామాన దళితులంతా ఏకమవుతున్నారని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు దళితులను కేవలం ఓటు బ్యాంక్ లాగ చుసారే తప్ప మమ్మల్ని ఏనాడు గౌరవంగా చూడలేదని కెసిఆర్ మాత్రం రాష్ట్రంలోని దళితులను తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ప్రతి ఒక్క దళిత వాడలను ధనవంతుల వాడలుగా తీర్చిదిద్ది దళితులను ధనవంతులుగా అభివృద్ధి చేయుటకు ఒక మహోత్తరమైన దళిత బంధు పథకాన్ని రూపొందించి ప్రతి గ్రామంలో ప్రవేశపెట్టి క్షేత్ర స్థాయిలో యూనిట్లను అమలు పరుస్తూ మా దళిత బిడ్డలు ఆర్ధికంగ,వ్యాపారపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కేసిఆర్,పెద్ది సుదర్శన్ రెడ్డిలకు ఈ సందర్భంగా దళిత జాతి పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా సురేష్ తెలిపారు. అంతేకాక ముఖ్యంగా దళిత బంధు పథకం పైన అవకులు పేవాకులు పెలుతు, అసత్య ఆరోపణలు చేస్తున్న కొన్ని జాతీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో మా ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పుతామని ఎకపక్షంగా మా దళితులంత పెద్ది సుదర్శన్ రెడ్డి బారి మెజారిటీతో విజయం సాధించాలానే దిశగా కారు గుర్తుకు ఓటు వేసి మా ఋణం తీర్చుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ క్లస్టర్ ఇంచార్జ్ కట్కురి నరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ భాదావత్ స్వరూప రావు, ఉప సర్పంచ్ నరిశెట్టి రాజశేఖర్, గ్రామ పార్టీ అధ్యక్షులు పొన్నాల కుమారస్వామి, ఎస్సీ సెల్ డివిజన్ నాయకులు కోట డేవిడ్, టీ.ఎం.అర్.పి.ఎస్ రాష్ట్ర,జిల్లా,మండలం నాయకులు అరేపెళ్లి బాబు, మైసి శోభన్, తడుగుల జనార్దన్, అంబేత్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఈదునూరి వెంకటేశ్వర్లు, బి.అర్.ఎస్. మండల నాయకులు ఈదునూరి వెంకన్న, మాజీ ఉప సర్పంచ్ రాజారాం, సీనియర్ నాయకులు సంగని సతీష్, పొనకంటి రాంచందర్, గజ్జల సంపత్, తడుగుల వీరస్వామి, గాలి రమేష్, మంద రాజు, మంకాల సూరయ్య, తాళ్ల మొగలి, గజ్జల అనిల్, మంద రాజ్ కుమార్, తడుగుల సదానందం, చింత సాంబయ్య మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.