
పోస్ట్ ఆఫీస్ సేవలు వినియోగించుకోవాలి తాసిల్దార్ రాజేష్.
నల్లబెల్లి, నేటి ధాత్రి: ఆగస్టు 15 పర్వదినాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరణ దిశగా పోస్టల్ వ్యవస్థ ద్వారా అనుసంధానం చేస్తూ ఒక్కొక్క త్రివర్ణ పతాకానికి 25రూపాయల చెల్లించి త్రివర్ణ పథకాన్ని విక్రయించాలని తాసిల్దార్ రాజేష్ పేర్కొన్నారు మంగళవారం పోస్ట్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగిరే విధంగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మండలప్రజలందరూ సంతోషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే మండల పరిధిలోని ఆయా పోస్ట్ ఆఫీస్ లో జాతీయ జెండాలను రుసుము చెల్లించి తీసుకోవాలని ఆయన అన్నారు కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది ఎస్ బి ఎం జె కుమారస్వామి, బిపిఎంలో ఈ బాబు, మల్లేశం, చేరాలు, సురేష్, వెంకట్, అజయ్, తరుణ్, బిక్షపతి, కృష్ణ తేజ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.