త్రిబుల్ కె వర్సెస్ సింగిల్ ఆర్
మిస్టర్ కూల్ లైఫ్…
గెలుపు నాడు పొంగిపోలేదు.
టిక్కెట్టు రాకపోతే కుంగిపోలేదు
నమ్మిన సిద్దాంతం కోసం సాగుతున్నారు..
వివాదాలకు దూరంగా వున్నా… విమర్శలను ఎదుర్కొన్నారు…
పార్టీలో ఇబ్బందులూ ఎదురైనా..అయినా చిరునవ్వుతోనే సాగతించారు.
ఆ ఓపికే నేడు ఎంతో పనికొచ్చింది..
పార్టీకి జిల్లాలో ఆయన పెద్ద దిక్కుగా కనిపిస్తోంది….
కొట్టుకున్నా, తిట్టుకున్నా రాజకీయంగా తొక్కుకున్నా, కమ్మలంతా ఒక్కటే అని తెలుగు రాజకీయాల్లో వున్న రాజీ నానుడి. అది ఖమ్మంలోనూ వుందంటారు. అలాంటి ఖమ్మంలో సై అంటే సై అంటూ త్రిబుల్ కెలను ఎదుర్కొని నిలిచిన సింగిల్ ఆర్ ….పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బ్రాండ్ కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన, చెప్పగలిగిన ఏకైక నాయకుడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అవకాశాలు కలిసొచ్చినా కొన్ని సార్లు అదృష్టం కూడా కలిసి రావాలి. అదృష్టం కలిసొచ్చినా అవకాశాలన్నీ కళ్ల ముందు వాలాలి. ఈ రెండిరటిలో ఏది ఒక సెకన్ ఆలస్యమైనా ఇబ్బందే. ఎంచుకోవడంలో ఒక్క నిమిషం తొందర పడినా చిందర వందరే…! అన్నీ వున్నా కొన్ని సార్లు ఏదీ కనిపించదు. ఏదీ లేకపోయినా అన్నీ ఒక్కసారిగా కళ్లముందు మెదులుతాయి. వీటికి సరిగ్గా సరిపోయే నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఎంపిగా గెలిచినప్పుడు ఆయన ముందు ఏదీ కనిపించలేదు. గెలిచిన పార్టీ వైసిపికి తెలంగాణలో చోటు లేదు. ఆ తర్వాత ఆయన టిఆర్‌ఎస్ చేరినా, పార్టీ అధికారంలో వున్నా ఆయనకు ఏ పదవి లేదు. ఇలాంటి విచిత్రమైన చరిత్రలో ఎదుర్కొన్న నాయకుడు ఒక్క శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కావొచ్చు. ఖమ్మం ఎంపిగా గెలిచేదాకా ఆయన ఎవరో చాలా మందికి తెలియదు. తను అడుగు పెట్టిన రంగంలో విజయాలు తప్ప అపజయాలు లేకుండా అప్రతిహాతంగా శ్రీనివాస్ రెడ్డి సాగిపోతున్నారు. ఎన్టీఆర్ కాలంలో చిన్నగా ప్రభుత్వ కాంట్రాక్టులు మొదలు పెట్టి, ఇంతింతై వటుడిరతై అన్నట్లు అనేక రాష్ట్రాల్లో కొన్ని వేల కోట్ల రూపాయల పనులు నిర్వహిస్తున్నారు. అనుకోకుండా ఎంపి అయ్యే అవకాశం వచ్చింది. ప్రజల దీవించారు. ఎవరూ ఊహించని విధంగా ఖమ్మం నుంచి వైసిపి పార్టీ తరుపున గెలిచారు. కాని ఆ పార్టీ తెలంగాణలో ఖమ్మం మూలలో తప్ప, మరోచోట లేకుండాపోయింది. దాంతో శ్రీనివాస్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ అవకాశం కలిసొచ్చింది. కాని అదృష్టమే కొంత కొంటెచూపు చూసింది. ఇక టిఆర్‌ఎస్‌లో చేరే అదృష్టం ఎదురైంది. కాని తర్వాత ఎన్నికల్లో టిక్కెట్‌రాకుండా పోయింది. అదృష్టం,అవకాశం రెండూ ఒకేసారి పొంగులేటిని వరించకపోవడంతో రాజకీయ జీవితం మళ్లీ మొదటికొచ్చింది. అయినా ఎన్ని వార్తలు నిత్యం చక్కర్లు కొడుతున్నా గుబాబీకి తోడుగా, కారుకు అండగా పొంగులేటి సాగుతున్నారు. ఎలాంటి విభేదాలు పొడసూపకుండా చూసుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా రాజకీయాలు ప్రస్తుత పరిస్ధితుల్లో హాట్ టాపిక్. గత ఏడాది కాలంగా ఆ జిల్లాలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవి పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి మీద ప్రభావం చూపేలా వుంటున్నాయి. అవి అనుకోకుండా జరిగినా, జరగాల్సి వచ్చి జరిగినా నాయకుల స్వయం కృతాపరాధం మూలంగానే జరిగాయన్నది మాత్రం వాస్తవం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కాని ఇన్ని జరగుతున్నా జిల్లాలో మిస్టర్ కూల్‌గా వున్న ఏకైక నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితికి బలమైన నాయకుడు. ఎమ్మల్యే వనమా నాగేశ్వరరావు కొడుకు వ్యవహారం, తాజాగా మంత్రి అజయ్ మూలంగా పార్టీకి జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. అయినా పార్టీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వున్నాడన్న నమ్మకం కార్యకర్తలో ధైర్యాన్ని నింపుతోందని చెప్పడంలో సందేహం లేదు. భవిష్యత్తు ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆయన చుట్టే పరిభ్రమిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. పదవి వున్నా, లేకున్నా, ప్రజల కోసం, ప్రజల మధ్యే వుండే నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. అదే టిఆర్‌ఎస్‌కు బలమౌతుందని చెప్పడంలో సందేహం లేదు. రాష్ట్ర స్ధాయి నుంచి జిల్లాకు ఎన్ని రకాల మంచి పనులు అందించినా, క్షేత్ర స్దాయిలో నాయకుల వ్యవహార శైలి కూడా పార్టీని ఇబ్బందుల పాలు చేస్తుంది. నమ్మి పార్టీ ఎంతో చేస్తే ఖమ్మం జిల్లాలో ఇద్దరు నాయకుల మూలంగా పార్టీకి తలనొప్పులు వచ్చాయి. వాటిని అధిగమించాలంటే మళ్లీ పార్టీకి కనిపిస్తున్న ఏకైక నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. తమ స్వార్ధ రాజకీయాల కోసం శ్రీనివాస్ రెడ్డిని ప్రజాక్షేత్రానికి దూరం చేసే ఎత్తుగడలు చాలా మంది వేశారు. కాని వాళ్లే దూరయ్యే పరిస్ధితి వచ్చింది.
మనిషిగా సాత్వికం. పట్టుదలలో కొండంత బలం. ఒక సామాన్యమైన రైతు కుటుంబం. ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం సామ్రాజ్యం. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ, మధ్య ప్రదేశ్, చత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాల్లో కూడా వ్యాపారాలున్నాయి. అయినా ఆయన ప్రజా సేవలో వున్నారు. ప్రజలకు సేవ చేయడంలోనే తరిస్తున్నారు. పేదలంటే ప్రేమిస్తారు. వారిని అక్కున చేర్చుకుంటారు. వారి కోసం ఆయన సంపాదనలో చాలా వరకు ఖర్చు చేస్తుంటారు. కాని ఎక్కడా తన సామాజిక సేవా కార్యక్రమాల గురించి చెప్పుకోరు. ఉత్తుంగ తరంగం లాగా రాజకీయ యవనిక మీదకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో జత కట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో వైపిసి తీర్ధం పుచ్చుకున్నారు. రాష్ట్రం విడిపోయినా వైసిపితోనే వున్నారు. ఆ పార్టీనుంచి ఖమ్మం నుంచి పోటీ చేశారు. ప్రస్తుత టిఆర్‌ఎస్ ఎపి. నామా నాగేశ్వరరావు మీద 2014లో 11వేల ఓట్లతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు ఆయన వైపు చూసేలా చేసుకున్నారు. అప్పటి వారకు ఆయన ఖమ్మం జిల్లాకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత రాష్ట్రంలోని కొత్త తరం రాజకీయ నాయకులకు ఐకాన్‌గా నిలిచారు. ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదు. తను నిర్మించుకున్న గ్రౌండ్‌తో మాత్రమే తనను తాను నిరూపించుకున్నారు. సక్సెస్‌కు తనే చిరునామా అని నిరూపించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వైసిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆహ్వానం మేరకు ఒకే ఒక్క మాటతో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరారు. తలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో నీ సీటు నీదే అన్న ఒకే ఒక్క మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర సమితిలో పొంగులేటి చేరారు. నిజానికి ఓ ఎంపిగా, ఆయనకు వున్న పేరుకు ప్రతిష్టలకు, మరో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వుంటూ మరో పార్టీలో చేరరు. మరో నాయకుడైతే ఆ రూటు మరోలా వుండేది. కాని ఒక కమిట్ మెంటు అన్న దానిని ఆధారం చేసుకొని శ్రీనివాస్ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. అయినా గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు రాలేదు. విధి విచిత్రమైంది. 2014 ఎన్నికల్లో ఏ నాయకుడినైతే ఓడిరచారో, అదే నాయకుడి గెలుపు కోసం పొంగులేటి శ్రమించాల్సివచ్చింది. బాధ్యతలు తీసుకోవాల్సివచ్చింది. దగ్గరుండి గెలిపించాల్సివచ్చింది. అయినా చిరునువ్వుతోనే అన్నీ స్వీకరించారు. గత ఎన్నికల సమయంలో పార్టీలో పదవులు పొందికలో తప్పకుండా పార్టీ సరైన సమయంలో సరైన గుర్తింపునిస్తుందన్న మాటను కట్టుబడి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పిన మాటకు, ఇచ్చిన హామీ కోసమే ఎదురుచూస్తున్నారు. ఎంత ఆజాశత్రువైనా రాజకీయాలల్లో చేరితే శత్రువులు తయారౌతారని అంటారు. అదే జరిగింది. ఏ పార్టీ కోసమైతే ఆయన శ్రమించారో ఆ పార్టీలో కూడా తోటి నాయకుల స్వార్ధం మూలంగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆఖరుకు ఖమ్మం రావాలంటే పాస్ పోర్టు తెచ్చుకోవాలా? అని ప్రశ్నించేంత ఇబ్బంది పడ్డారు. అయినా ఎక్కడా ఆయన పార్టీని గాని, పార్టీ నాయకులపై భహిరంగంగా విమర్శలు చేయలేదు. అదేంటో కొన్ని రాజకీయాల్లో విచిత్రమైన అనుభవాలు ఎదురౌతుంటాయి. ఒక వ్యాపార వేత్తగా అనేక ఎత్తు పల్లాలు చూసిన శ్రీనివాస్ రెడ్డి, రాజకీయాల్లో తొలిగెలుపును చూశారు. ఓటమి తెలియని నాయకుడుగా నిలిచారు. అందుకే ఆయన ఎప్పుడూ మిస్టర్ కూల్‌గానే వుంటారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆయన వివాదాలు ఎదుర్కొన్నారు. మాజీ మంత్రి తుమ్మల ఓటమికి కారణమయ్యాడన్న అపవాదులు ఎదుర్కొన్నాడు. కాని లోతుగా అధ్యయనం చేస్తే 2014లోనే తుమ్మల ఓడిపోయారు. అప్పుడు శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. తుమ్మల వల్ల ఆయన రాజకీయాల్లోకి రాలేదు. తుమ్మల వల్ల రాజకీయంగా నష్టపోలేదు. కాని కొన్ని వివాదాలు మాత్రం ముసురుకున్నాయి. అయినా ఎక్కడా తొనకని మనస్తత్వంతో ముందుకు సాగుతున్నారు. త్యాగశీలి నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. భవిష్యత్తు ఖమ్మం జిల్లా టిఆర్‌ఎస్ రాజకీయాలకు పెద్ద దిక్కుగా వున్నారు.