రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతినిధి నేటిధాత్రి
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…
తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన ఆదర్శప్రాయుడు కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని చెప్పారు. తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ద్వారా తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడుగా అభివర్ణించారు. వారి రచనల స్ఫూర్తి తెలంగాణ సాధించడానికి మరింత దోహదం చేసిందని తెలిపారు భారత దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సన్మానింప బడిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు.కాళోజీ రచనలతోనే యువతను తెలంగాణ ఉద్యమం వైపు నడిపించాయని తన రచనల ద్వారా పెత్తందారీ వ్యవస్థ అన్యాయాలను ఎదిరించాడని. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాళోజీ రచనలు యువతలో స్ఫూర్తిని రగిలించినాయని, సామాజిక సమస్యలపై పోరాడిన మహనీయుడు కాళోజి అని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమములో అదనపు ఎస్పీ చంద్రయ్య, అడ్మినిస్ట్రేషన్ అధికారి హమ్మదుల్లా ఖాన్,సి.ఐ ఉపేందర్,కార్యాలయ సూపరిండెంట్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు..