తెలంగాణ సాగుకు చంద్రబాబు జేజేలు!

https://epaper.netidhatri.com/

` కలలో కూడా ఊహించని నారాబాబు.

` ప్రశంసలో కూడా ఏదో వెలితి!

`ఆంధ్రాను మించిపోవడంపై ఆసక్తి!

`అధికారంలో వున్నప్పుడు తెలంగాణ ఎండబెట్టాడు!

https://epaper.netidhatri.com/

`తెలంగాణలో సాగు సాధ్యమే కాదన్నాడు!

`తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం అసాధ్యమన్నాడు.

` ఎంత మొత్తుకున్న చుక్క నీటి కోసం చెక్‌ డ్యాంలు కూడా ఇవ్వలేదు.

https://epaper.netidhatri.com/

`ఇప్పుడు తెలంగాణలో జరిగిన అద్భుతం చూసి ఆశ్చర్యపోతున్నాడు.

`తన మనసులో మాటలు చెప్పక తప్పలేదు.

`అన్యాయం చేశామని ఒప్పుకోక తప్పడం లేదు.

`తెలంగాణలో మేధావులకు మాత్రం ఇవేవీ కనిపించడం లేదు.

`కరంటు వాడుకుంటూనే వృధా అంటున్నారు.

`రైతుబంధు తీసుకుంటూనే ఎందుకంటున్నారు.

`సాగు చేసుకుంటూనే నీళ్లేవి అంటున్నారు.

`కళ్లుండి చూడలేని వారికన్నా, కంటగింపు నేతలే నిజం చెబుతున్నారు!

`తెలంగాణ అభివృద్ధిని పొగడలేక వుండలేకపోతున్నారు.

`తమ రాష్ట్రం వెనుకబడిపోతోందని మధనపడుతున్నారు.

`కేసిఆర్‌ ను కీర్తించక తప్పదని అర్థం చేసుకున్న చంద్రబాబు.

https://epaper.netidhatri.com/

హైదరబాద్‌,నేటిధాత్రి:                    

ఎప్పుడూ గిచ్చి కయ్యం పెట్టుకునే పాలి వాడు ఐన వాడైనంతగా ఆలింగనం చేసుకుంటే ఆ ఆనందమే వేరు. అయినా ఇద్దరికీ ఎక్కడో ఏదో అనుమానం వుండనే వుంటుంది? మన వాడు కాని వాడు, మనల్ని ఎప్పుడూ శత్రువులా చూసిన వాడు తప్పని పరిస్దితుల్లో పొగిడే పరిస్దితి వస్తే ఎంత సంతోషంగా వుంటుందో మాటల్లో చెప్పలేనిది. అందులోనూ చంద్రబాబు లాంటి నాయకుడు తెలంగాణ గురించి గొప్పగా చెప్పాల్సిన పరిస్దితి వచ్చింది. అంటే అది తెలంగాణ మీద ప్రేమతో చేసిన వ్యాఖ్యలేమీ కావు. కాకపోతే తప్పని పరిస్దితుల్లో చెప్పాల్సిన అవసరం వచ్చి చెప్పిన మాటలు. 2014 నుంచి 2019 వరకు తాను అధికారంలో వున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సాగు బాగానే సాగింది. కాని 2019లో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక సాగు దిగుబడి గణనీయంగా పడిపోయింది. అదే సందర్భంలో సాగులో ఎంతో వెనుకబడి వుండే తెలంగాణ ఎంతో దూసుకుపోయింది. వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను మించి మూడు, నాలుగు రెట్లు అధికంగా దిగుబడులు సాధిస్తోంది. ఇదీ చంద్రబాబు ఆవేదనలో నుంచి వచ్చిన మాటలు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలో ఒక ఎకరం అమ్మినా, తెలంగాణలో ఎక్కడైనా కొన్ని ఎకరాల భూమి వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎకరం అమ్మితే, సీమాంద్రలో వంద నుంచి నూటాయాభై ఎకరాల స్ధలం కొనుగోలు చేయేచ్చు. అంటూ చంద్రబాబు కితాబిచ్చారు. ఇందులో ఆయన తెలంగాణ గొప్పతనాన్ని చెప్పాలన్న ఉద్దేశ్యంల లేదు. కాకపోతే ఆంధ్రప్రేదేశ్‌లో ఇప్పుడున్న జగన్‌ ప్రభుత్వం మూలంగా ఆంధ్రప్రదేశ్‌లో భూముల రేట్లు విపరీంతగా పడిపోయాయని చెప్పారు. చంద్రబాబు ఎలా చెప్పినా, ఎందుకు చెప్పినా? నిజాలు చెప్పాడు. తెలంగాణపై నిత్యం ఏడుస్తూ వుండే రాజకీయ పార్టీలకు గుణపాఠం నేర్పాడు. తెలంగాణ అభివృద్దిపై జేజేలు పలికిన చంద్రబాబుకు వున్న సోయి, రాష్ట్రంలో వున్న ప్రతిపక్షాలకు లేకుండా పోయింది. 

ఇదే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. కాని ఏనాడు ఆయన తెలంగాణ ప్రయోజనాల గురించి పట్టించుకోలేదు. ఈ మధ్యే నటుడు మురళీ మోహన్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడిరచారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన సమయంలో మురళీమోహన్‌ లాంటి వారు తెలంగాణలో కూడా ఎంతో కొంత వ్యవసాయ రంగానికి నీటి పారుదల సౌకర్యాలు కల్పిస్తే మేలు జరుగుతుంది కదా! అని చెప్పి చూశారట. కాని చంద్రబాబు ఆనాడు మురళీమోహన్‌ సూచనను నిర్ద్వందంగా తోసిపుచ్చారట. తెలంగాణలో సాగునీటి కల్పన అనేది అసాధ్యమని తేల్చిచెప్పాడట. నిపుణులందరూ ఇదే చెబుతున్నారని అన్నాడట. ఒక వేళ తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులే కట్టాల్సివస్తే అవన్నీ ఎత్తిపోతల పథకాలే అవుతాయి. వాటిని తెల్ల ఎనుగులా మేపడం వృధా? అంటూ కొత్త భాష్యం చెప్పాడట. అంటే తెలంగాణ ప్రాంత రైతులకు మేలు చేయడం అంటే ప్రభుత్వం భారంగా భావించిందన్నది తేలిపోయింది. అంతకు ముందు ముఖ్యమంత్రులు ఇదే చేశారు. తెలంగాణకు సాగునీటి వనరులు కల్పించేందుకు వారికి మనసు రాలేదు. తెలంగాణలో కనీసం చెరువుల అభివృద్దైనా చేయమని అప్పటి నాయకులు, రైతు సంఘాలు ఎంత విజ్ఞప్తి చేసినా, చంద్రబాబుగాని, అంతకుముందు ముఖ్యమంత్రులు కాని కనికరించలేదు. దాంతో తెలంగాణకు ప్రధాన నీటి వనరులైన చెరువులు నిరాదరణకు గురయ్యాయి. కరువులు పరిస్ధితులు ఎదురై చెదిరిపోయాయి. ఆక్రమణలనకు గురయ్యాయి. మొత్తంగా ఆనవాలు తప్ప, నీటి చుక్కలు లేని చెరువులు మోడులుగా మిగిలిపోయాయి. అయినా ఆనాటి పాలకులకు తెలంగాణ కష్టాలు తీర్చాలన్న ఆలోచన రాలేదు. తెలంగాణ రైతుల గోస తీర్చాలన్న మనసు రాలేదు. కొండలు గుట్టలున్న ప్రాంతాల్లో నైనా కనీసం నీటి నిల్వలు చేసుకునేందుకు, వాగుల్లో నీరంతావృధాగా పోకుండా వుండేందుకు చెక్‌డ్యాంల కోసమైనా నిధులు కేటాయించాలని కోరారు. అయినా ఏనాడు ఉమ్మడి పాలకులు తెలంగాణ సాగుకు సాయం చేసింది లేదు. తెలంగాణ ఎడారిగా మారుతున్నా పట్టించుకోలేదు. 

అదే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేసిన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల విషయంలో కూడా తీవ్ర అన్యాయం చేశారు.

శ్రీశైలం ప్రాజెక్టును పూర్తిగా జలవిద్యుత్‌ కోసమే అంటూ నమ్మించారు. కుడి, ఎడమ కాలువల ద్వారా విద్యుత్‌శక్తి తయారు చేస్తామని చెప్పారు. కాని కుడికాలువ నుంచి పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు, ఆఖరకు మద్రాసుకు కూడా మంచినీళ్లు ఇచ్చేందుకు తరలించుకపోయారు. తెలంగాణలో ఒక్క నల్లగొండ జిల్లాకు మాత్రమే అందేలా చేశారు. అందులోనూ తెలంగాణకు కేవలం 91 టిఎంసిల నీరు కూడా వరద జలాలను మాత్రమే కేటాయింపులు చేసేవారు. కరువు సమయాల్లో అవి కూడా లేకుండా చేసేవారు. అదే రాయలసీమకు నికర జలాలు తరలించేవారు. దామాషా ప్రకారం వాటలో సుమారు 200 టిఎంసిలు నీరు వాడుకుంటూ వచ్చారు. తెలంగాణను ఎండబెట్టారు. ఇక నాగార్జున సాగర్‌ విషయంలోనూ అదే చేశారు. తెలంగాణలో నిర్మాణం కావాల్సిన ప్రాజెక్టును, నంది కొండకు తరలించుకొని వెళ్లి, ఆంధ్రప్రాంతానికి ఎక్కువ న్యాయం జరిగేలా చేశారు. తెలంగాణకు నీటిని సరఫరా చేసే లాల్‌బహదూర్‌ కాలువ(ఎడమ కాలువ) నుంచి కూడా విజయవాడకు నీటిని తరలించే కాలువగా మార్చేశారు. ఇలా అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తూనే వచ్చారు. ఆఖరుకు పులిచింతల నిర్మాణం చేపట్టొద్దని, తెలంగాణకు అన్యాయం చేయొద్దని చెప్పినా, తెలంగాణ గ్రామాలు ముంచి, గుంటూరుకు నీళ్లు తరలించుకొనిపోయారు. ఇలా అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తూ వెళ్లారు. 

2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి( ప్రస్తుత భారత రాష్ట్ర సమితి)తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం మొదలుపెట్టారు.  

 లెక్కల్లో తెలంగాణకు పెద్దవాటా అంటూ తెలంగాణ ప్రజలను మరోసారి తీవ్ర అన్యాయానికి గురి చేశారు. జలయజ్ఞంలో భాగంగా నిర్మాణమైన జంరaావతి వంటి రబ్బరు డ్యామ్‌ ప్రాజెక్టులు శ్రీకాకుళం జిల్లాలో పూర్తి చేశారు. రాయలసీమలో అనేక ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేశారు. కాని తెలంగాణలో కాలువలు తవ్వుతున్నామని నమ్మించి మోసం చేశారు. కాలువలు తవ్వింది లేదు. ప్రాజెక్టులు కట్టింది లేదు. తెలంగాణ పేరు చెప్పి ప్రచారం చేసుకుంటూ, ఆంధ్రా ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు. ఆ కసితో మరింత తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి, తెలంగాణ సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కింది. ఏ నోటితో తెలంగాణ సాగుకు యోగ్యం కాదని చెప్పారో…అదే నేతలు తెలంగాణ సాగును చూసి అబ్బురపడిపోయేలా చేశాడు. తెలంగాణ చెరువులకు పూర్వవైభవం తెచ్చాడు. తెలంగాణలో మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి, అవరైఏళ్లుగా పడుతున్న గోసను తీర్చిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. తెలంగాణ వస్తే ఏమౌతుంది? తెలంగాణ వస్తే ఆ ప్రాంతానికే నష్టం. తెలంగాణలో తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాలి చేసిన నాయకులు బంగారు పంటలు పండుతుంటే ముక్కున వేలేసుకుంటున్నారు. సీమాంధ్రను మించి సాగులో దూసుకుపోతుంటే ఆశ్చర్యపోతున్నారు. ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్టులు నిర్మాణం చేయడం ఏమిటి? అవిపూర్తయి ఫలాలు అందించడమేమిటి? అనుకుంటున్నారు. గతంలో ఉమ్మడి పాలకుల చేత నిర్మాణాలు జరిగిన ప్రాజెక్టులు దశాబ్ధాలు పట్టేవి. అంతదాక ఎందుకు తెలంగాణలో కాళేశ్వరం కంటే ముందు మొదలైన పోలవరం అక్కడే ఆగిపోయింది. కాళేశ్వరం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ సస్యశ్యామలం చేస్తోంది. తెలంగాణను బంగారు భూమి చేసింది. అన్న పూర్ణగా మార్చి దేశానికి అన్నం పెడుతోంది. తెలంగాణ రైతును రాజను చేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను తెలంగాణ కోసం అవతరించిన దేవుడిని చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!