
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చెర్మెన్ మధుయాష్కీ గౌడ్ ని కలిసి సత్కరించిన సాయిని రవి. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, నా యొక్క నియామకానికి సహకరించిన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ కార్గే, తెలంగాణ తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్రావు ఠాక్రే, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యనిర్వాహక సభ్యునిగా నాపై నమ్మకం వుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడంలో నా వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు.