తెలంగాణలో పల్లె పల్లెకు ఆర్టీసీ సేవలు అమోఘం!
వేములవాడ నేటి దాత్రి
తెలంగాణ స్వరాష్ట్రం కోసం చేసిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమ స్ఫూర్తి మరువలేనిది! ఆర్టీసీ కార్మికుల ను ప్రభుత్వం లో విలీనం చేసిన సందర్భంగా
గురువారం రోజు సంగీత నిలయంలో శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ను ఆర్టీసీ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయడమనేది చాలా సంతోషకరమైన విషయమని మొదట ఉద్యోగులందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కీలకపాత్ర పోషించి రాష్ట్రాన్ని సాదించుకున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం లోనే మన వేములవాడ డిపో చాలా లాభదాయకంగా ఉన్నదని లక్షలాది భక్తులను రాజన్న చెంతకు చేరుస్తున్నారని ఎందుకంటే మన రాజన్న పేదల దేవుడు రాజన్న దగ్గరకు వచ్చే భక్తులు స్వంత వాహనంలో వచ్చే స్తోమత లేని వారు, వారందరూ ఆర్టీసీ బస్సులలో మన రాజన్న దర్శనానికి వస్తున్నారని భక్తులందరికి అద్భుతమైన సేవలు అందిస్తున్న ఆర్టీసీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. శివరాత్రి సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో మంచి సేవలు ఆర్టీసీ వారు అందిస్తున్నారని ఉచిత బస్సులు నిర్వహించడం అలాగే ఆదివారం, సోమవారం లలో ఉచితంగా బస్టాండ్ నుండి దేవాలయం వరకు భక్తులకు రవాణా సౌకర్యం అందిస్తున్నారని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.