సీఎం నివేదికలో అసలు విషయాలు వెలుగులోకి…
తూర్పులో కారుకు ఎదురులేకుండా చేసిన కేసిఆర్…
అది గమనించలేక రాజకీయం చేస్తున్న గులాబీ నేతలు…
విపక్ష నేతల చేరిక ఘట్టం ఒక వ్యూహం….
ప్రతిపక్షాల నిర్వీర్యం ఏనాడో పరిసమాప్తం…
మళ్ళీ విపక్షపు విషభీజాలు నాటుతున్నదెవరు?
కేసిఆర్ పన్నిన పద్మవ్యూహం చెడగొడుతున్న వాళ్లెవరు?
తూర్పులో కలకలం రేపుతున్నదెవరు?
విపక్షానికి ఓటు లేని చోట స్వపక్షంలో చిచ్చుకు కారకులెవరు?
తూర్పు మీద కన్నుతో మేఘాలు కమ్ముతున్నదెవరు?
తూర్పు లో ఏం జరుగుతుందో అంతా గమనిస్తున్న కేసిఆర్!
తూర్పులో కాకరేపుతున్న కలకలంపై ఎక్స్ క్లూజివ్…
ఒకరు పేర్చుకుంటే పోతే, ఎవడో ఒకడు కూల్చాలని చూస్తాడని సామెత. అలాంటి సంఘటనలు తెలంగాణలోని పలు నియోజకవర్గాలలో కనిపిస్తున్నట్లు తేటతెల్లమౌతోంది. గత ఇరవై రెండు సంవత్సరాలుగా పార్టీకి ఒక్కో ఇటుక పేర్చుతూ తిరుగులేని శక్తిగా, నియోజకవర్గాలలో ఎదరులేని శక్తిగా బలమైన పునాదుల మీద టిఆర్‌ఎస్‌ను ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్మితం చేసుకుంటూ వస్తున్నారు. ఒకనాడు ఏ జిల్లాలో ఏ మూలనో అని ఎద్దేవా చేసిన వాళ్లు ఇప్పుడు ఏ మూల వెత్తుక్కోవాలో అర్ధం కాని పరిస్ధితుల్లో ప్రతిపక్షాలున్నాయి. గతంలో టిఆర్‌ఎస్ గెలుస్తూ వచ్చిన నియోకజవర్గాలతోపాటు, గత ఎన్నికల్లో గెలిచిన టిఆఆర్‌ఎస్ ఇలాకాల్లో ప్రతిపక్షాలన్న మాటకు చోటు లేకుండాపోయింది. అలా పార్టీ నిర్మాణం చేయడం అన్నది బృహత్తర కార్యక్రమం. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ చేసిన రాజకీయ చాణక్యం, పన్నిన పద్మవ్యూహాలు అర్ధం కాక ఇప్పటికీ ప్రతిపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా ప్రతిపక్షాలకు ఎక్కడా చోటు లేకుండా, ఓటు వేసేవారు లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. అలాంటి నియోజకవర్గాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తూర్పు వరంగల్ స్ధానం ఒకటి. ఆ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చేసిన రాజకీయయంత్రాంగ మంత్రాగంలో వీరిసిన పాచికలు ఆశామాషీ కాదు. అసలు తూర్పు నియోజకవర్గంలో ప్రతిపక్షానికి స్ధానమేలేదు. అలా చాలా నియోజకవర్గాలను కారుకు కంచుకోట చేశారు. ఆ కంచుకోటలో తూరు నియోజకవర్గం కూడా వుంది. కాని ఇటీవల ఆ తూర్పు నియోజకవర్గంలో తుఫాను రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసి ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన తాను వేసిన పద్మవ్యూహం ప్రతిపక్షాలు చేధించకుండా తీర్చిదిద్దితే, స్వపక్షంలోనే కొందరు విపక్షానికి దారులు తెరవడాన్ని గ్రహించారు. తూర్పులో దూళి కణం కూడా పక్కకు కదలకుండా చేయాలన్న లక్ష్యంతో కేసిఆర్ పక్కా ప్రణాళిక ఏనాడో రచించారు. అది అర్ధంకాని కొందరు జిత్తులు వేయాలని చూస్తున్నట్లు కూడా వెలుగులోకి వస్తోంది.
అసలు కేసిఆర్ ఆదినుంచి వేసిన ప్లాన్ ఎంతో ఆసక్తికరం. వరంగల్ తూర్పు అన్నది ఉమ్మడి వరంగల్‌కు ఒక సెంటిమెంటు. తెలంగాణ ఉద్యమానికి వరంగల్ ఒక పెద్ద దిక్కు. అలాంటి వరంగల్‌లో కారుకు తప్ప మరో పార్టీకి చోటు దక్కడం దుర్లభం. తూర్పులో కారుకు భవిష్యత్తులో ఎలాంటి ఎదరు లేకుండా ముఖ్యమంత్రి కేసిఆర్ చేశారు. ఇది చాలా మంది గులాబీ నేతలకు ఎందుకు అర్ధం కావడం లేదో తెలియడం లేదు. ఒక వేళ తెలిసినా కూడా పార్టీలో వుంటూ ఎదురు తిరగలేక, పక్కవారిని ఎదగోసే రాజకీయాలు చేస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా తూర్పును పూర్తి స్ధాయి గులాబీ మయం చేయడానికి సిఎంసి కేసిఆర్ నాటి విపక్ష నేతలందరినీ కారులోకి చేర్చుకున్నారు. వారికి తగిన ప్రాదాన్యత కూడా కల్పించారు. విపక్ష నేతలను గులాబీ గూటికి చేర్చడం అన్నది ఒక ఘట్టంగా కనిపించినా, అదొక రాజకీయ వ్యూహం. ఈ వ్యూహాం చేధించడం అన్నది ఎవరి తరం కాదు. నాటి ప్రతిపక్షాల నిర్వీర్యంతో అక్కడ వారికి మళ్లీ చిరురు తొడకుండా చూసుకుంటూ వస్తున్నారు. కాని కేసిఆర్ పన్నిన పద్మవ్యూహం చేధించలేక చెడగొట్టే ప్రయత్నాలు కొందరు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. తూర్పులో కలకలం రేపి రాజకీయం తన వైపు తిప్పుకుందామని కొందరు చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది. విపక్షానికే చోటు లేని చోట స్వపక్షంలోనే కొందరు చిచ్చు రేపి చలికాచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు సమచారం. ఈ విషయాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసిఆర్ వరంగల్ తూర్పు నియోకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టిపెట్టారు. ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గ పరిధి రాజకీయాలను తెలుసుకుంటున్నారు. అందుకోసం ప్రభుత్వ ఇంటలిజెన్స్ వ్యవస్ధను పూర్తిగా నమ్మకుండా, కొంత మంది వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు రహస్యాలు తెలుసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ఇంటలిజెన్స్ అన్నది ఆ నియోజకవర్గంలోని సొంత నాయకుల ఆలోచనలు పూర్తిగా పసిగట్టకోవచ్చు. లేకుంటే మంత్రుల స్ధాయి వివరాలు బైటకు పూర్తిగా చెప్పలేకపోవచ్చు. అందువల్ల ప్రత్యేకమైన నిఘా వ్యవస్ధతో వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు? అన్న విషయాలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తున్నాయి. ఎమ్మెల్యే నన్నపనేనిని ఎవరు డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారో వారి వివరాలు కూడా ఎప్పటికప్పుడు సిఎంకు చేరుతున్నాయి.
తూర్పు నుంచి గతంలో గెలుస్తూ వచ్చిన బస్వరాజు సారయ్య లాంటి వారిని ఓడిరచేందుకు 2014 ఎన్నికల్లో కొండా సురేఖకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత బస్వరాజు సారయ్య టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే భవిష్యత్తులో ఆయనకు టిక్కెట్ లేదనే అర్ధం. ఇక గత ఎన్నికల్లో అనూహ్యంగా తెరమీదకు వచ్చి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి మంచి ఓట్లు సాధించిన వద్దిరాజు రవిచంద్ర కారెక్కారు. ఆయన నాయకత్వ పటిమ, ప్రజల్లో ఆయనకు వున్న పేరు, వ్యాపారవేత్తగా వున్న గుర్తింపు, వితరణశీలిగా ప్రజల్లో వున్న గౌరవంతో ఆయనను ముఖ్యమంత్రి కేసిఆర్ టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. పార్టీలో చేర్చుకున్నారు. ఇటీవల ఆయనకు రాజ్యసభ కూడా ఇచ్చారు. వద్దిరాజు రవిచంద్రకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు, ఖమ్మంలోనూ ఆయనకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. ఇటు వ్యక్తిగతంగా, ఇటు సామాజిక పరంగా కూడా ఆయనకు మంచి గుర్తింపు వుంది. తెలంగాణ కాపు సామాజిక వర్గ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఉత్తర తెలంగానలో బలమైన నాయకుడుగా కూడా ఆయన పార్టీ తయారు చేయాలని చూస్తోంది. వద్దిరాజు రవిచంద్రను పార్టీలోకి తీసుకున్నప్పుడు అందరూ తూర్పు వరంగల్ వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధి అనుకున్నారు. కాని ఏదో ఒక నియోజకవర్గానికి వద్దిరాజును పరిమితం చేయడమే అవుతుంది. టిఆర్‌ఎస్‌లో ఇంత కాలం బిసిలకు ప్రతినిధిగా ప్రచారం జరిగిన ఈటెల రాజేందర్ స్ధానాన్ని వద్దిరాజు రవిచంద్రతో భర్తీ చేయాలన్నది ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన. ఆయనను ఉత్తర తెలంగాణలోని బిసిలందరికీ ప్రతినిధిగా వుండడమే ఆయనకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత అన్న ఆలోచనతో తాజాగా రాజ్యసభకు పంపడం జరిగింది. అలా ఆయన తూర్పు నియోకరవర్గంతోపాటు, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నాయకత్వం పనికొస్తుంది. వద్దిరాజు రవిచంద్ర మూలంగా తెలంగాణలోని అనేక నియోజకవర్గాలలో కారుకు మరింత బలం చేకూరే అవకాశం వుంది. ఇలా నాయకులకు సరైన గుర్తింపు నిస్తూ, వారి సేవలను వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకొని హాట్రిక్ సాధించి, తెరాసకు తిరుగులేదని మరోసారి నిరూపణ కాబోతున్న తరుణమిది.
ఇలా బలమైన నేతలు కూడా తూర్పులో వుండడం కారుకు ఎదురు లేకుండా వుంటుందనేది ఇంత కాలం అనుకుంటున్న మాట. కాని ఇటీవలే కొంత మంది నేతలు కూడా తూర్పు టిక్కెట్టు ఆశిస్తూ నియోజకవర్గంలో కొంత ఇబ్బందికరమైన పరిస్ధితులు సృష్టించాలని చూస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర స్ధాయిలో కీలక భూమిక పోషించిన ఆ నాయకుడు కారెక్కడంతో గతంలోనే కీలకమైన గుర్తింపు, స్ధానం కల్పించారు. కాకపోతే హవా సాగిన చోటే, ఏ హవా లేకుండా పోవడం ఆ నాయకుడికి సుతారం నచ్చడం లేదట…పైగా తమ ముందు ఎదిగి ఎమ్మెల్యేగా నన్నపనేని కనిపించడం కూడా ఆ నాయకుడికి అసలే నచ్చడం లేదట…ఒక రకంగా చెప్పాలంటే మళ్లీ నన్నపనేని గెలవడం ఆయనకు ఇష్టం లేదట…అందుకు స్వపక్షంలోనే విపక్షాన్ని సృష్టించి, ఎగదోసే కుట్రకు తెరతీసినట్లు తెలుస్తోంది…ఎవరా నేత…ఏమిటా కథ! రేపటి సంచికలో…