నర్సంపేట,నేటిధాత్రి :
తమ న్యాయమైన హక్కులను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన నిరవదిక సమ్మెలో భాగంగా నర్సంపేట పోస్ట్ ఆఫీసులోని జిడియస్ ఉద్యోగులు సమ్మెను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏఐజీడిఎస్యు మాజీ అధ్యక్షుడు ఎండీ శాబుద్దిన్ మాట్లాడుతూ జిడియస్ ఉద్యోగులకు సివిల్ సర్వంట్ హోదా కల్పించాలని, సీనియర్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని కోరారు. గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షలకు పెంచాలని, కుటుంబ సభ్యులతో సహా వైద్య సదుపాయం కల్పించాలని,ఇన్సెంటివ్ పద్దతి రద్దుచేయాలని అని అన్నారు.టార్గెట్ రూపంలో వేదింపులు ఆపివేయాలని, కమలేష్ చంద్ర కమిటీ సిపార్స్ చేసిన బంచింగ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిడియస్ సెలవులో ఉన్నపుడు సబ్స్టిట్యూట్ నీ అనుమతించాలని ఆయన కోరారు. ఈ సమ్మె లో తపాలా ఉద్యోగులు సంపత్ కుమార్,లక్ష్మయ్య,కృష్ణమూర్తి,శ్రీనివాస్,యాదగరి,రవి,కల్పన,
రవళి,అనూష,శ్రీకాంత్,పవన్,కృష్ణ కిషోర్ ప్రనేష్,నాగేందర్, కల్పన తదితరులు పాల్గొన్నారు.