ఢీ అంటే ఢీ

 

దేశంలో బిజేపి కి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్.

జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ.

దేశమంతా ఇక బిఆర్ఎస్ మానియా.

రైతు నేతలే ఊతం…

రైతులే కదిలితే బిఆర్ఎస్ ప్రభంజనం.

వేగంగా అడుగులు

ఒక దఫా జాతీయ కార్యవర్గం ప్రకటన

రైతు నాయకులదే కీలక బాధ్యత.

తెలంగాణ సాగు విధానాల ప్రచారం అన్ని రాష్ట్రాలలో మొదలు.

కేసిఆర్ కు ఛాలెంజ్ లు ఎప్పుడూ కొత్తే!

తొలి సారి సిద్ధిపేట నుంచి పోటీ ఒక సాహసమే!

మలి దశలో తెలంగాణ వాదం ఎత్తుకోవడం సాహసోపేత నిర్ణయమే.

ఎక్కడా తల వంచింది లేదు..

ఎప్పుడూ ఓడింది లేదు…

నమ్మిన సిద్ధాంతం కోసం వెనుకడు వేసింది లేదు.

విజయాలే తప్ప అపజయాలకు చోటు లేదు.

ఇప్పుడు కూడా కేసిఆర్ కు తిరుగులేదు.

ఢీ అంటే ఢీ. ఇది కేసిఆర్ కు మొదటి నుంచీ అలవాటు. వ్యక్తిగా ఆయన ఏది ఎంచుకున్న సక్సెస్ అవుతూనే వచ్చారు. నాయకుడిగా ప్రజలకు ఏం కావాలో అవి నెరవేరస్తూ వచ్చారు. ఇలా తాను తలపెట్టిన ప్రతి పనిని విజయవంతం చేయకుండా వదిలేయలేదు. ఆయన చేపట్టిన ప్రతి పని ఒక గెలుపే. ఒక ఆదర్శమే. ఆచరణీయమే. అనుసరణీయమే. దేశ రాజకీయాలలో సమూలమైన మార్పులు తీసుకురావాలని చూస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ మొదటి నుంచి ఏం చేశారన్నది కూడా తెలియాలి. ఒకప్పటి తెలంగాణ ఉద్యమ నేత మదన్ మోహన్ శిష్యరికంలో రాజకీయాలలో ఓనమాలు దిద్ది, ఇప్పుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నాడు.‌ తెలంగాణ సాధించాక తెలంగాణ మొత్తం అమలు చేసిన కార్యక్రమాలలో కొన్ని సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎప్పుడో చేసి చూపించారు. ఆ విషయాలు, వివరాలు ఈ తరానికి, యావత్ దేశానికి తెలియాల్సివుంది. దేశంలో అనేక రాష్ట్రాలలో బిజేపి యేతర పార్టీలు పరిపాలన సాగిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలతో పాటు బిజేపి పాలిత రాష్ట్రాల ప్రజలకు కేసిఆర్ నాయకత్వ లక్షణాలు తెలియాల్సిన అవసరం వుంది. కేసిఆర్ తొలుత ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోనే ఆయన స్వగ్రామం వుంది.‌ దాదాపు మొత్తం నియోజకవర్గం నీటి కరువుతో అల్లాడుతూ వుండేది.‌ సిద్దిపేట పట్టణం లో కూడా మంచినీటి కోసం ప్రజలు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఉమ్మడి పాలకుల చిన్న చూపుతో సిద్దిపేట మరింత వెనుకబాటుకు గురైంది. సిద్దిపేట కు సమీపంలో వుండే తడ్కపల్లి అనే గ్రామానికి ఆడపిల్లనియ్యకపోయేవారు. అంటే నీటి కష్టం ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎండాకాలం వచ్చిందంటే పశువులకు కూడా మంచినీళ్లు దొరికేవి కాదు. పైగా ఎక్కడ చూసినా ఎడారిని తలపించేలా చెట్టు నీడ కనిపించనంత దుర్భరమైన పరిస్థితులు. ‌అటు నీళ్లు లేక‌ పంటలులేవు.‌ ఇటు తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు.‌ ప్రకృతి అసమతుల్యత. ఏక కాలంలో ఆనాడే ఈ సమస్యలు తీర్చిన ఏకైక నాయకుడు కేసిఆర్. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ మొత్తం ఆ పనులు పూర్తి చేసి, బీడులను పొలం మడులుగా మార్చి బంగారు సిరులు పండించాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నాడు. సిద్దిపేట నియోజకవర్గం మొత్తానికి అవసరమైన మంచి నీళ్ల కోసం కరీంనగర్ నుంచి ప్రత్యేకమైన పైపు లైన్ ద్వారా నీటిని తరలించాడు. ఊరూరుకు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాడు. ఇంటింటికి ఆనాడే మంచినీళ్లు అందించాడు. పాతాళ గంగను పైకి తెచ్చి సిద్దిపేటకు నీళ్లిచ్చాడు. ఒకనాడు నీటి గోస అనుభవించిన సిద్దిపేటకు నిత్యం మంచినీటి సరఫరా చేయించాడు. అది తర్వాత కాలంలో తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ అయ్యింది. తాగు నీటి సమస్య తీరింది.‌ ఇక సాగు నీటి సమస్య తీరాలి. అప్పటి పాలకులు తెలంగాణలో సాగునీటి కోసం రూపాయి ఖర్చు చేసే పరిస్థితి లేదు.‌ కనీసం చెరువులైనా బాగు చేయమని అడిగినా నిధులు లేవని చెప్పి, చేతులు దులుపుకున్న సందర్భం. దాంతో శ్రమదానం పేరుతో సిద్దిపేట నియోజకవర్గంలోని చెరువులను పునరుద్ధరించిన ఘనత కేసిఆర్ ది.‌ అలా వరుసగా ప్రతి ఏడాది వేసవి కాలంలో శ్రమదానం నిర్వహించి చెరువులు బాగుచేసుకున్నారు. కొంత నీటి నిల్వలు పెంచుకున్నారు. ‌ఇదే తెలంగాణ వచ్చాక మిషన్ కాకతీయ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 46 వేలకు పైగా చెరువుల పునరుద్ధరణ జరిగింది. ఇప్పుడు ఆ కాలం, ఈ కాలం అని తేడా లేకుండా ఎండా కాలంలో కూడా మత్తళ్లు దుంకే చెరువులు ఒక్క తెలంగాణ లోనే వున్నాయి.‌ ఇక పచ్చదనం- పరిశుభ్రం‌ పేరుతో సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి చెట్ల పెంపకం చేపట్టారు. అనతి కాలంలోనే సిద్దిపేట నియోజకవర్గ‌ పరిధిలో ఎక్కడిక్కడ పచ్చదనం వెల్లివిరిసింది. ఎండాకాలంలో పశువులకు నీడ కల్పించేంత పచ్చదనం నిండిపోయింది. ఇదే ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఏటా ఒక పండుగగా సాగుతోంది.‌ ప్రతి సంవత్సరం జూలై నెలలో కొన్ని కోట్ల మొక్కలు నాటుతున్నారు. తెలంగాణ మొత్తం పచ్చదనం పురివిప్పి నాట్యమాడుతోంది.‌ ఈ విషయాలు దేశమంతా తెలియాలి. 

 

దేశంలో బిజేపి కి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్. ఇప్పుడు దేశంలో ఎక్కడ వింటున్నా ఇదే మాట. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. బిజేపితో కొట్లాడాలన్న కసి ఆ పార్టీలో కనిపించడం లేదు. దేశంలో అనేక పార్టీలు వున్నా కేంద్రాన్ని నిలదీసే స్థితిలో లేవు. గట్టిగా మాట్లాడలేకపోతున్నాయి. కానీ ఒక్క కేసిఆర్ మాత్రమే బిజేపి మీద నిప్పులు చెరుగుతున్నాడు. ప్రధాని మోడీని తూర్పారపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటున్నాడు.‌ కేంద్ర ప్రభుత్వం పేదలకు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నాడు. ధరలపై గళమెత్తుతున్నాడు. సంపన్నులకు సంపద దోచి పెట్టడాన్ని నిలదీస్తున్నాడు. రైతుల తరుపున మాట్లాడుతున్నారు. రైతు రాజ్యం తెచ్చేందుకు ఏకంగా బిఆర్ఎస్ ఏర్పాటు చేశాడు. ప్రజలు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నాడు. ఒకనాడు తెలంగాణ కోట్లాడేందుకు ఒక్కడుగా ఎలా భయలుదేరాడో, ఇప్పుడు కూడా అలాగే ఒంటరి ప్రయాణం, పోరు మొదలుపెట్టాడు. దేశంలో బిజేపి కి ప్రత్యామ్నాయంగా బిఆర్ఎస్ రూపుదిద్దుతున్నాడు. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి, దేశాన్నేలే సీట్లు సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నాడు. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశమంతా ఇక బిఆర్ఎస్ మానియా కనిపిస్తోంది. కేసిఆర్ నాయకత్వమే కావాలంటోంది. 

 

బిఆర్ఎస్ పార్టీలో కీలక భూమిక రైతుదే. రైతు నేతలే. సరికొత్త రాజకీయమే. దేశానికి కొత్త నేతలే. సరికొత్త పంధాతో ముందుకు సాగుడే. రైతు నేతలే ఊతం…దేశ వ్యాప్తంగా ఏ రాజకీయ అండా లేని అనేక అసంఘటిత రైతు సంఘాలకు, నేతలకు బిఆర్ఎస్ వేధిక కానున్నది. దేశంలోని రైతాంగాన్నంతా కదిలించనున్నది. ఎక్కడిక్కడ రైతు సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 

రైతులే కదిలితే బిఆర్ఎస్ ప్రభంజనం. అందుకే వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే

ఒక దఫా జాతీయ కార్యవర్గం ప్రకటన జరిగింది. బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసిఆర్ నియామక‌‌ పత్రాలపై సంతకాలు చేశారు. బాధ్యతలు అప్పగించారు. రైతు నాయకులదే కీలక బాధ్యత. తెలంగాణ సాగు విధానాల ప్రచారం అన్ని రాష్ట్రాలలో మొదలౌతున్నాయి.‌ కేసిఆర్ కు ఛాలెంజ్ లు కొత్త కాదు…అయినా ప్రతి సందర్భం ఎప్పుడూ కొత్తే! తొలి సారి సిద్ధిపేట నుంచి పోటీ ఒక సాహసమే! మలి దశలో తెలంగాణ వాదం ఎత్తుకోవడం సాహసోపేత నిర్ణయమే.ఎక్కడా తల వంచింది లేదు..ఎప్పుడూ ఓడింది లేదు…

నమ్మిన సిద్ధాంతం కోసం వెనుకడు వేసింది లేదు.విజయాలే తప్ప అపజయాలకు చోటు లేదు.

ఇప్పుడు కూడా కేసిఆర్ కు తిరుగులేదు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!