
జేఏసీ ఛైర్మన్ రామగల్ల పరమేశ్వర్
చేర్యాలలో జేఏసీ విస్తృత స్థాయి సమావేశం..
చేర్యాల నేటిధాత్రి….
ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షైన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అనేది, ఆత్మగౌరవం, ఉనికి, అస్తిత్వంతో ముడిపడి ఉన్నదని చేర్యాల డివిజన్ సాధించి, తిస్కొచ్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ కోరారు. చేర్యాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఇటీవల ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం పట్ల జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి మౌనం పాటించారు. ఈసందర్భంగా జేఏసీ చైర్మన్ పరమేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నుండి నేటి వరకు డివిజన్ సాధించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నా మీరు కాలయాపన చేస్తూ అనేకమంది గ్రామపంచాయతీ సర్పంచులు ఏకగ్రీవ తీర్మానాలు సమర్పించినా నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. పైగా మీ దృష్టిలో ఇది చాలా చిన్న విషయమని మాట్లాడారు. చిన్న విషయమైనప్పుడు, ఇంతకాలం పైగా డివిజన్ తీసుకురావడంలో నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. చేర్యాల కు కోర్ట్ విషయంలో రెండు గంటలలో జీవో తీసుకొచ్చిన అని చెప్పిన మీరు గత నాలుగు సంవత్సరాల నుండి చేర్యాల ప్రాంత న్యాయవాదులు కోర్టు ఏర్పాటు కోసం వినతిపత్రాలు, ఆందోళన కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజలు వివిధ సమస్యలతో కోర్టు వివాదాలలో చిక్కుకొని అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి కోర్టులకు హాజరవుతున్నా ఇంతకాలం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రజలకు, న్యాయవాదులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ డివిజన్ అంశాన్ని చాలా చిన్నదిగా చెబుతున్న మీరు తక్షణమే రెవెన్యూ డివిజన్ జీవోను సాధించుకొచ్చి చూపాలన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చాలని కోరారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యక్రమాల రూపకల్పన జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ కో చైర్మన్ పుర్మ ఆగంరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, మాజీ జెడ్పిటిసి దాసరి కళావతి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఉడుముల భాస్కర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు తడక లింగం, కౌన్సిలర్ సురేష్, కాంగ్రెస్ నాయకులు రాగుల శ్రీనివాస్ రెడ్డి, చేర్యాల మండల కన్వీనర్ బొమ్మగాని అంజయ్య గౌడ్, కొమురవెల్లి కన్వీనర్ పబ్బోజు రాములు చారి, జేఏసీ నియోజకవర్గ నాయకుడు గద్దల మహేందర్, నియోజకవర్గ యూత్ కన్వీనర్ బిజ్జ రాము, సర్పంచ్ లు తాడూరి రవీందర్, ఆలేటి యాదగిరి, మాజీ సర్పంచ్ బాలరాజ్ , బీఎస్పీ నాయకులు బుట్టి బిక్షపతి, సీపీఐ(ఎం) నాయకులు వెంకట్ మావో, పోతుగంటి ప్రసాద్ రాళ్ల బండి నాగరాజ్, కొంగరి వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్ నాయకులు, దర్శనం వెంకన్న, బాలరాజ్, ఎస్ఎఫ్ఐ నాయకులు రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.