`హస్తినలో బిఆర్‌ఎస్ కార్యాలయం నేడు ప్రారంభం.
`రాజశ్యామల యాగం అనుకూలం
` బిఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరణం.
` దేశ రాజకీయాలలో కీలకమౌదాం.
` రైతును రాజును చేద్దాం.
` రైతు సంక్షేమ రాజ్యం నిర్మిద్దాం.
` రైతు సుభిక్షం కోసం పాలన సాగిద్దాం.
`సాగుకు అవసరమైన నీటి వసతులు కల్పిద్దాం
`నీటి కరువు తీరుద్దాం.
` ప్రాజెక్టులు కట్టేద్దాం.
`అన్నపూర్ణగా అన్ని రాష్ట్రాలను మార్చేద్దాం.
`సంప్రదాయ పంటల సృష్టిలో విప్లవం సాధిద్దాం.
`దేశానికి వెన్నెముక రైతుకు అండగా నిలుద్దాం.
`ఆహార సంక్షోభాన్ని నివారిద్దాం.
`బంగారు భారతం నిర్మిద్దాం.
`ప్రపంచ విఫణికి మన పంటలను పరిచయం చేద్దాం
`ప్రపంచానికి అన్నం పెట్టే దిశగా అడుగులేద్దాం.
హైదరబాద్,నేటిధాత్రి:
రాజకీయ పార్టీ అన్న తర్వాత అనేక లక్ష్యాలుంటాయి. అందులో పరిపాలనలోకి రావడం అన్నది ఎంతో ముఖ్యం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే దేశమంతా విస్తరించాలని కోరుకోవడంలో తప్పులేదు. ఎదగాలి కూడా…అప్పుడు చేయాల్సిన సేవ విసృతమౌతుంది. దేశమంతా సేవ చేసే అవకాశం ఏర్పడుతుంది. దేశాన్ని ఏలాలన్నా, దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలన్నా, శాసించాలన్నా డిల్లీ నుంచి గల్లీదాకా పార్టీ బలపాడాలి. మరింత పార్టీ యంత్రాంగం ఏర్పడాలి. జాతీయస్ధాయిలో ఆ పార్టీకి గుర్తింపు రావాలి. అయితే ప్రాంతీయ పార్టీలన్నీ జాతీయ పార్టీలు కాలేవు. అన్ని పార్టీలు జాతీయ స్ధాయి పార్టీలుగా ఎదలేవు. అంతే కాదు జాతీయ స్దాయి పార్టీలు కూడా పరంపరలో పెరుగొచ్చు. తొగ్గొచ్చు. ప్రాంతీయ పార్టీలకన్నా తక్కువ కావొచ్చు. కొన్ని సార్లు కనుమరుగు కావొచ్చు. అలా చరిత్రలో ఎన్నో పార్టీలు వచ్చాయి .ఎదిగాయి. కాల గమనంలో కలిసిపోయాయి. అలా ఎదిగిన పార్టీలో సుధీర్ఘ కాలంగా మిగిలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు రెండు సీట్లతో మొదలైన బిజేపి రాజకీయ ప్రస్ధానం నేడు జాతీయ స్ధాయిలో సంపూర్ణ మెజార్టీతో రెండుసార్లు అధికారం అందుకున్నది. దేశంలో అనేక రాష్ట్రాలలో విస్తరించి, పాలిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభావాన్ని బాగా కోల్పోయింది. ఒకప్పుడు జాతీయ స్ధాయిలో కీలకభూమిక పోషిచిన జనతాదళ్‌లాంటిపార్టీల ప్రభావం పూర్తిగా తగ్గిపోయాయి. జాతీయ స్ధాయిలో ప్రత్నామ్నాయ శక్తులుగా కీలకభూమిక పోషించిన వామపక్షాలు గ్రాఫ్ పూర్తిగా పడిపోతూ వస్తోంది. 1964 వరకు వున్న కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది. అయినా ప్రజల్లో ఉనికిని కాపాడుకుంటూ ఉభయ కమ్యూనిస్టులు పార్టీలు వచ్చాయి. కాని ఇటీవల సిపిఐ జాతీయ స్ధాయి హోదా కోల్పోయింది. జాతీయ స్ధాయిలో కీలక భూమిక పోషించడం అన్నది పార్టీల నాయకత్వాలు, ఆ పార్టీలకు వున్న సైద్దాంతిక విధనాలు ఎంతో ముఖ్యం. అలాంటి సైద్దాంతికతను ఆధారం చేసుకొని జాతీయ స్ధాయిలో కీలకం కానున్న పార్టీ భారత రాష్ట్ర సమితి. తెలంగాణలో ఒకనాడు ఉప ప్రాంతీయ పార్టీగా అవతరించి, తెలంగాణ కోసం పద్నాలుగేళ్ల పాటు నిరంతర పోరాటం చేసిన రాజకీయ పార్టీగా చరిత్ర సృష్టించింది. ఉద్యమాన్ని రాజకీయ కోణంలో ముందుకు సాగించి, తెలంగాణ సాధించిన పార్టీగా చరిత్ర లిఖించింది. అందుకు ఆ పార్టీ సిద్దాంత కర్త కేసిఆర్ విజన్ గొప్పది. ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. ఉదాత్తమైనవి. ఆచరణాత్మకమైనవి. ఎంతో ముందుచూపును కూడుకొని వున్నవి. అందుకే తెలంగాణ వచ్చిన అతి కొద్ది కాలంలోనే తెలంగాణ ఇంతలా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంతోపాటు, ఆయన ఆచరించిన సైద్దాంతిక విధానాలు కారణం. ఓ వైపు తెలంగాణ ఉద్యమాన్ని సాగిస్తూనే, పోరాటంలో నిత్యం పాల్గొంటూనే, మరో వైపు తెలంగాణ ప్రగతి కోసం ఏ చేయాలన్నదానిపై అప్పుడే బ్లూ ప్రింట్ రచించారు. అదే నేడు తెలంగాణ సక్సెస్‌కు కారణమైంది. అదే విధంగా తెలంగాణలో బిఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి ముందే దేశ రాజకీయాలలో సమూల మార్పులు తేవాలంటే ఏం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టిపెట్టారు. దాని రూపమే నేటి బిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు. నేడు డిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టి, ప్రాంరభిస్తున్నారు. అదీ గొప్ప విజన్ వున్న నాయకుడు కేసిఆర్ వేస్తున్న అడుగులు. రాజకీయాలలో దేశ పాలనను ఒక దరి చేర్చేందుకు సరికొత్త పాలనా ఉత్తేజాన్ని నింపుకున్న ఒరవడులు.
దేశం మీద ప్రేమ, ప్రజల మీద మమకారం, సామాజిక చైతన్యం కోసం పరితపించే నాయకుడు కేసిఆర్.
దేశం కోసం మాటలు చెప్పి రాజకీయ పబ్బం గుడపుకుంటూ ఇంత కాలం రాజకీయాలు తప్ప, పరిపాలన మీద గత పాలకులు దృష్టిపెట్టలేదు. కాంగ్రెస్ హయాంలో కొంత పురోగతి జరిగినా, ఇంకా ఎంతో జరగాల్సివుండే. కాని కుదరలేదు. రాజకీయ ఒడిదొడుకులు కూడా అందుకు కారణం. సుస్ధిరమైన ప్రభుత్వాలు ఏర్పడినప్పుడైనా దేశ పాలనలో కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం వుండే. కాని జగలేదు. కారణం నాయకుల ఆలోచనల్లో ముందు చూపు లేకపోవడం, దేశ ప్రగతి మీద వారికి శ్రద్దలేకపోవడం అన్నది ఖచ్చితంగా చెప్పాల్సిందే. అధికారులు చెప్పింది, ప్రజలు కోరిందే కాకుండా, ప్రజలకు ఏం కావాలో తెలిసిన నాయకుడు మాత్రమే ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తాడు. అలాంటి నాయకుడు దేశంలో వున్నది ఒక్కడే ఆయనే కేసిఆర్. ఎందుకుంటే ఇక్కడ కొన్ని విషయాలపై తెలంగాణలోనే కాదు, దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం వుంది. తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భం అందరికీ తెలిసిందే. ముచ్చటగా మూడు ముచ్చట్లే అందులో దాగి వున్నాయి. నీళ్లు, నిధులు,నియాకాలు. ఇందులో మన నీళ్లు మనం వాడుకోవాలి. మన నిధులు మనం వాడుకోవాలి. మన ఉద్యోగాలు మనకే దక్కాలి. కాని ఈ మూడు అంశాలు ఎంతో బరువైన బాధ్యతతో కూడుకున్నది. మన నీళ్లు మనకు అందుబాటులోకి రావాలి. వినియోగించుకోవాలి. అంటే ప్రతి ఎకరాకు నీరందాలి. ప్రాజెక్టులు నిర్మాణం జరగాలి. అది ఎవరైనా చేస్తారే అనుకుందాం? మన ఉద్యోగాల కల్పన మనం చేసుకోవడం పెద్ద కల్పన కాదు. కాని మన నిధులు మనం వినియోగించుకోవడం అంటే ఏమిటి? అన్నది పెద్ద ప్రశ్న. ఇంటిని చక్కదిద్దాల్సిన పెద్దను బట్టి కుటుంబం ఆధారపడి వుంటుంది. అలాగే పాలకుడి సమర్ధత మీద రాష్ట్ర ప్రగతి ఆధారపడి వుంటుంది. అంందుకే తెలంగాణ వచ్చాక తెలంగాణ అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే కేసిఆర్ నాయకత్వమే సరైందని ప్రజలు గుర్తించారు. నమ్మిరెండుసార్లు అధికారం అప్పగించారు. అందుకే ఆయన పాలనలోకొత్త ఒరవడి తీసుకొచ్చారు.
తెలంగాణలో సంక్షేమ రాజ్యం స్ధాపించారు. అన్ని వార్గల సంతోషమే లక్ష్యంగా కేసిఆర్ పాలన సాగిస్తున్నాడు.
ఇదే సమయంలో మనసు పెట్టి పనులు చేస్తే, ఎంతటి అసాధ్యాలైనా సుసాధ్యాలౌతాని నిరూపితమైంది. మరి దేశంలో కూడా తెలంగాణ సాధించిన అభివృద్ది నమూనా అమలు చేస్తే దేశం కూడా అతి తక్కువ కాలంలో ఎంతో ముందుకు వెళ్లేందుకు అవకాశం వుంది. మన దేశం వ్యవసాయక దేశం. దేశ జనాభాలో 65శాతానికి పైగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. దేశ స్వాతంత్య్రం సిద్ధించినకాలంలో 75 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. అయితే రైతుల శాతం తక్కువ. కాని 65శాతం ప్రజలు వ్యవసాయం సాగిస్తున్నా, పెరిగిన కమతాలు ఎక్కువ. ఇప్పుడున్న పరిస్ధితుల్లో పెద్దపెద్ద కార్పోరేట్ వ్యవస్ధలు కూడా వ్యవసాయ రంగంలోకి వస్తున్నాయి. కార్పోరేట్ వ్యవసాయం వచ్చేస్తోంది. ఈ తరుణంలో రైతు జీవితం ఆగం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా దేశంలో రైతు సుభిక్షంగా, సుసంపన్నంగా వుండాలంటే సాగుకు అవసరమైన నీరు అందించే పాలకులు కావాలి. కాని ఇప్పటి వరకు దేశంలో సాగవుతున్న భూమికి అవసరమైన నీటి సౌకర్యాన్ని పాలకులు అందించలేకపోయారు. అందకే వ్యవసాయం ప్రకృతితో జూదమైపోయింది. రైతు బతుకు ఆగమైపోతూ వస్తోంది. అది మారాలి. రైతు సంక్షేమం కాంక్షించే కేసిఆర్ నాయకత్వం దేశానికి అవసరం. అంటే బిఆర్‌ఎస్ దేశమంతా విస్తరించాలి. తెలంగాణ మోడల్ ప్రగతి దేశమంతా కనిపించాలి. అది కేసిఆర్ మాత్రమే ఆచరించి చూపాలి. ఎందుకంటే ఎన్ని సార్లు కేంద్రలో పార్టీలకు పాలించే అవకాశం ఇచ్చినా, ఏ ప్రభుత్వం రైతుకు కంటి తుడుపు చర్యలు చేపడుతూ, వారిని మభ్యపెట్టే రాజకీయాలు చేస్తూ వచ్చింది. కాని వారి కన్నీటిని తుడిచే చర్యలు చేపట్టలేదు. కేసిఆర్ మాత్రమే ఆ పని చేయగలడు. అందుకే బిఆర్‌ఎస్ బలపడాలన్నది ప్రజల కోరిక. అందుకే ఒక ప్రభంజనంలా బిఆర్‌ఎస్ దూసుకెళ్తోంది. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు కేసిఆర్ నాయకత్వంలో ముందడుగు వేస్తోంది.