డబుల్ బెడ్ రూమ్స్ లో డబ్బులే డబ్బులు

> నాణ్యతలేని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.

> మట్టి పోసి మసిపూసిన్రు.

> అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కు.

> నాణ్యత లోపం అధికారులకు కనబడటం లేదా?

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

నిరుపేదల సొంతింటి కల ను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకం
జడ్చర్ల నియోజకవర్గం ప్రాంతంలో చాలావరకు అభివృద్ధి పనులు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయనే ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పక్కనే ఉన్న మహబూబ్ నగర్ నియోజకవర్గం మండలంలో కొంత మేరకు కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయి లబ్ధిదారులకు అందించారు. మరికొన్ని మండల కేంద్రాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయ్యాయి కానీ లబ్ధిదారులకు ఇవ్వలేదు. కానీ నవాబుపేట మండల యన్మన్ గండ్ల గ్రామంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నాణ్యత లోపించిందని లక్షలు ఖర్చు చేసి డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు నిర్మించిన ఫ్లోరింగ్ లో మాత్రం మట్టి పోసి మసిపూసిన్రు అని స్లాప్ పై కూడా ఇసుక పోసి సిమెంట్ కళాయితో నున్నగా చేసినట్లు దర్శనమిస్తున్నాయి. ఈ డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లలో నివసించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. నవాబుపేట కేంద్రంలో మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తికాలేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఆగిపోవడంతో కాంగ్రెస్ , బిజెపి నాయకులు అధికార టిఆర్ఎస్ పార్టీ పై మండిపడుతున్న పరిస్థితి నెలకొంది.
జడ్చర్ల నియోజకవర్గం లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిస్థితిపై జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణ శివారులో నిర్మాణ దశలో ఉండి ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఇది సరైన అనువైన ప్రాంతం కాదని, అయినా కూడా నిర్మాణ దశలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పాటు అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే కాంట్రాక్టర్ నాసిరకమైన పనులు చేయడంతో నిర్మాణ దశలోనే ఉన్న ఇండ్లు కుంగిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. అని అన్నారు.
జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.
ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపెట్టండి.. మేము అక్కడ ఓటు అడగం.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేని ఊరు మేము చూపిస్తాం వచ్చే ఎన్నికల్లో మీరు ఓటు అడగకుండా ఉండండి అంటూ సవాల్ విసిరారు. దశాబ్ద ఉత్సవాల పేరిట సంబరాల కంటే ముందు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పేదలకు అందించే ఆలోచన రాలేదు అంటూ హితవు పలికారు. ఎన్నికల కంటే ముందు డబుల్ బెడ్రూంలు మంజూరు చేస్తామని మీరు ఇచ్చిన హామీ ఏమైంది అంటూ ప్రశ్నించారు. ఇంకా పూర్తికాని పనులు అప్పుడే గుంతలు పడుతున్నాయని, నాసిరకపు నాణ్యతలేని పనులు పేదలపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ఈ డబుల్ బెడ్ రూమ్ కట్టడంలో చూస్తే తెలుస్తుందన్నారు. ఈ పెండింగ్ పనులను పూర్తి చేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ ప్రభుత్వానికి అభివృద్ధి గుర్తుకువస్తుందనీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!