మండల కేద్రంలో బిజెపి మండల స్థాయి సమావేశంలో మండల అధ్యక్షులు ఆబోత్ రాజు యాదవ్ మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టాక్స్ ద్వారా పెట్రోల్, డీజిల్ల ధరలు 5రూ.10రూ.ల చొప్పున తగ్గించినందుకు ప్రధాన మంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ,రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ల పై విధిస్తున్న వ్యాట్ ని తగ్గించి. మి చిత్త శుద్ది నిరూపించుకోవాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీసిల్ పై పన్నులు తగ్గించయని గుర్తు చేశారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం కావున దేశంలోని మిగత రాష్ట్రాల కంటే ఎక్కువ మొత్తంలో పన్నుల బారన్ని తగ్గించాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కావున టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పై వేస్తున్న పన్నుల బారాన్నీ 20 రూపాయల వరకు తగ్గించి,మి చిత్త శుద్ది నిరూపించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి జల్లి మధు,సీనియర్ నాయకులు లింగ బత్తుల యకసాయన్న,మైనారిటీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ ఖాసీం,ఉమా మహేశ్వర రావు,సామ మల్లరెడ్డి,లక్ పతి,భరత్ తదితరులు పాల్గొన్నారు.