డాక్టర్ హలావత్ రామారావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి నిరుద్యోగ యువత చైతన్యం మరియు వారి ఐక్యతను చాటడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ స్వేచ్ఛాయుత ఎన్నికల పరిరక్షణలో భాగం పంచుకోవడంలో కోసం నిరంతరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగుల యువత యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జేఏసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ స్థాయిలలో ఉద్యమకారుడుగా ఎన్నో సమస్యల పైన కీలక పాత్ర వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో నిరంతరం పాటుపడుతున్న విద్యార్థి నాయకుడు డాక్టర్ హలావత్ రామారావు ను తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బోడా వంశనాయక్ నియామకా పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నియామకాన్ని తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కె. చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వలిగొండ. నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థి దశ నుండి ముందంజలో పాల్గొని విద్యార్థి ఉద్యోగ యువతీ యువత సమస్యల పైన అవగాహన ఉన్న వ్యక్తిగా గుర్తించి ఈ పదవి ఇచ్చినటువంటి తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జేఏసీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.