టికెట్ల లెక్కలు ఏ పార్టీలో తేలలే?

https://epaper.netidhatri.com/

ఎన్నికల మీద పార్టీలకంటే మీడియా కే హడావుడి ఎక్కువైంది!

పార్టీ లు అభ్యర్థుల ఖరారు పూర్తయినట్లు వార్తలు.

https://epaper.netidhatri.com/

లిస్టులు చేతిలో అని అబద్దాలు.

అధికార బిఆర్‌ఎస్‌ లోనే లెక్కలు తేలలేదు?

కాంగ్రెస్‌ లో ఇంకా లెక్కే మొదలుకాలేదు?

బిజేపి ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నది?

పార్టీల బాధ పార్టీలది, మీడియా బాధ మీడియా ది?

పోటీ ప్రపంచంలో తీరిక లేకుండా పరుగెత్తుతున్న మీడియా.

పార్టీలకు చేరువయ్యే పనిలో సోషల్‌ మీడియా!

https://epaper.netidhatri.com/

ఎవరికి వారు సొంత కథనాలు?

న్యూస్‌ ఛానళ్లు అదే దారిలో…

పార్టీలు చల్లగా వుండే…మీడియా వేడిమీద వున్నది.

 ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి, ప్రతిపక్షాలు గెలవాలని ఆశిస్తున్నాయి?

క్షేత్ర స్థాయి పరిశీలన కన్నా సొంత ఊహాగానాలే నమ్మించాలని చూస్తున్నాయి?

నయా వ్యాపారంలో సోషల్‌ మీడియా!

హైదరబాద్‌,నేటిధాత్రి:                           

అదిగో పులి అంటే ఇదిగో తోక అనడం మీడియాకు తెలిసిన విద్యే! అంతేకాదు అక్కడ పులి లేకున్నా, సృష్టించగలదు. తోక ఎంత పొడుగుందో చెప్పగలదు. https://epaper.netidhatri.com/మీడియా అంటే అంతే…అదేమంటే…అదే..అదేం చెబితే అదే..అని నమ్మడం..నమ్మకం అంతా సమాజానికి ఒకవరం. అవును..అలా అనుకోలేకపోతే మీడియాకు మనుగడ వుండదు. సమాజానికి నీతులు చెప్పే బాధ్యత మీడియా తన భుజాన వేసుకోదు… అందుకే ఎవరు నమ్మినా? నమ్మకపోయినా? నేనున్నానని మాత్రం మీడియా చెప్పుకుంటూనే వుండాలి. గుర్తు చేస్తూనే వుండాలి. అందుకోసం అప్పుడప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వుండాలి. నిజానికి మీడియా వేరు… దాని బాధ్యత వేరు. మీడియా కర్తవ్యం ఎంతో గొప్పది. కాలం మారింది. అది కూడా హద్దులు చెరిపేసుకున్నది. అందుకే రకరకాల విన్యాసాలు మీడియా కూడా నేర్చుకున్నది. మిగతా సమాజంలోని వ్యవస్ధలలో వచ్చిన మార్పులకు అణుగుణంగానే తాను మారుతోంది. తన ప్రవర్తనలో తాను కొంత భిన్నమనేదే చూపిస్తుంది. ఇదే ఇప్పుడు ప్రపంచమంతా నడుస్తోంది. ప్రపంచమే మీడియాలో ఒక భాగమైపోయింది. సోషల్‌ మీడియా వచ్చాక ప్రపంచమే ఒక మీడియాగా మారిపోయింది. ఇక మనలాంటి దేశంలో మీడియా ప్రభావం చాల వుంటుంది. అందుకే మన సమాజం ఏది కొత్తగా కనిపించినా, వినిపించినా బలంగానే నమ్ముతుంది. ఆ నమ్మకమే మీడియాకు పెట్టుబడి. రాబడి…వార్తల దిగుబడి…అక్షరం క్షణం వెనుకబడి పోవొద్దు…ఎక్కడా ఒక అడుగు వెనక్కి పదొద్దు. ఒక రకంగా చెప్పాలంటే సమాజంపైనే లేని వార్తల దాడి..అబద్దాల ప్రచారానికి అసలైన వారది. ఇదీ ఇప్పడు కనిపించే జర్నలిజం. అంతా కలగాపులగమైపోయింది. ఏ వార్త అయినా సరే ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. అందుకే ఇప్పుడు తరతమ అన్న భేధం లేదు. చిన్నా పెద్దా అన్న మీడియా మధ్య గీత లేదు. హదులు లేవు. సరిహద్దులు అసలే లేవు. ప్రచారంలో దూసుకుపోతుందనుకునే వార్త ఏదైనా వుందంటే చాలు అన్ని రొడ్డ రుద్దడే..అన్ని మీడియా సంస్ధలు అనుసరించుడే..ఇదే ఇప్పుడు ట్రెండ్‌… సెట్టింగ్‌…అదే ట్రెండిరగ్‌…

తాజాగా తెలంగాణలో రాజకీయ పార్టీల అభ్యర్ధుల ప్రకటనలపై వస్తున్న వార్తలు చూస్తుంటే విచిత్రంగా వుంది. 

అసలు లిస్టులన్నీ మీడియా సంస్ధలే తయారు చేసినంత అందగా,నమ్మకంగా చెబుతున్నారు. అసలు ఆయా పార్టీల అధినేతలు మీడియా సంస్ధలను సంప్రదించి, మీరు ఏ పేరు చెబుతారో? అదే నోట్‌ చేసుకుంటామాని చెప్పినట్లే వార్తలుంటాయి. తాజాగా ఏ న్యూస్‌ ఛానల్‌లో చూసినా ఇదే తంతు. అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ లిస్టు మొత్తం తన చేతుల్లోనే వుందంటాయి. అక్కడ పోటీలో వున్న వారందరి గురించి లెక్కలేస్తుంటాయి. లిస్టే రెడీ అంటారు? పోరులో ముగ్గురున్నారు? ఇద్దరున్నారంటూ? పొగ పెడుతుంటారు. అసలు అక్కడ ఆ సమస్య వుందా? లేదా? అన్నది పక్కన పెడితే, మీడియా పరంగా నియోజకవర్గాలలో సమస్య వుంటే చాలదు? పార్టీ పరంగా, ఆ పార్టీల అధినేతల వద్దకు చేరిన పంచాయితీలెన్నీ? నియోజకవర్గంలోనే కనుమరుగయ్యే పంచాయతీలెన్ని? అన్నది మీడియాకు అవసరం లేదు. ఎంత సేపు మేం పెట్టిన పొగ ఎంత విస్తరించిందో…మీడియా తనకుతానే ఊహించుకుంటుంది? అందిరికీ ఊరిరాడడం లేదని కూడా అదే మీడియా భావించి ప్రచారం సాగిస్తుంది. నిజమే అని నమ్మించడానికి చెప్పిందే చెప్పి, రోజంతా జనం చెవికెక్కిస్తుంది. ఇదీ మీడియా చేస్తున్న హడావుడి. నిజానికి ఎన్నికల తరుణం దగ్గరపడుతుందంటే గతంలో పార్టీలు గందరగోళంలో వుండేవి. నాయకులు ఆత్రుతలో వుండేవారు? కాని ఇప్పుడు పార్టీలకంటే, మీడియానే ఎక్కువ హడావుడి చేస్తుంది. అదేదో సినిమాలో చెప్పినట్లు, ఊపే కుహా అన్న సామెతను నిజం చేస్తోంది. నాయకుల కంటే మీడియానే ఎక్కువగా సంబరపడుతుంది. మీడియా కు వార్తలు కావాలి. అవి కొత్తగా వుండాలి. ఇప్పుడున్న అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ వార్తలపై ప్రజలు ఆసిక్తిగా లేదన్నది ముందు వండి వార్చడం అలవాటు చేసుకున్నారు. బిఆర్‌ఎస్‌లో లొల్లి మొదలైందంటారు. కల్వకుంట్ల కుటుంబంలో తర్జన భర్జన అంటారు. మంత్రులు కేటిఆర్‌, హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవితలు ఎవరికి వారు తమ అనుచరలు పేర్లను అధినేత , ముఖ్యమంత్రి కేసిఆర్‌కు అందించినట్లు రాస్తారు? అసలు అది జరుగుతుందా? అందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ వెంటనే ప్రకటిస్తాడా? ఇలాంటి వార్తలు వినడానికి, చదవుకోవడానికి బాగానే వుంటాయి. అబద్దాలను ప్రచారం చేస్తాయి. హైదరబాద్‌లో కూర్చొని, ఆదిలాబాద్‌ అడువుల్లో సమస్యలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. కాని కాలమెంత మారింది? తెలంగాణ ఎంత అభివృ ద్ధి చెందింది..అన్నది వార్త కావడం లేదు. పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా వుంది? ఇప్పుడు ఎంత మారింది? అన్నది మీడియా చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. అదే తెలంగాణకు శాపంగా మారుతోంది. ప్రగతిభవన్‌లోకి చీమ కూడా దూరకుండా కట్టుదిట్టమైన ఏర్పాటున్నాయని చెప్పేది మీడియానే… ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏ ఎమ్మెల్యేను కలవరు? అని చెప్పేది మీడియానే… మంత్రులకే దిక్కులేదు? ఎమ్యెల్యేలకే సక్కిలేదు? మీరెంత అంటూ ప్రతిఫక్షాలను రెచ్చ గొట్టుతుంటార. గత మూడునాలుగు రోజుల క్రితం దివంగత గద్దర్‌ కూర్చున్న ఫోటో ఒకటి వేసి, ప్రగతి భవన్‌ వద్ద మూడు గంటలు నిలబడిన గద్దర్‌ అని ఫోటో ప్రచురించారు. ముందు అప్పాయింటు లేకుండా ఎవరినీ అనుమతించరని తెలిసినప్పుడు? రాజకీయాలకోసం నాయకులు వెళ్తుంటారు? అది రాజకీయాల్లో ఒక భాగం? గోడకు చెవులుంటాయన్నంత సీక్రెట్‌గా జరిగే అభ్యర్ధలు ఎంపిక ప్రక్రియలు మీడియాకు ఎలా తెలిసే? లిస్టులు వారి చెతికెలా వచ్చే? ఓ వైపు నిత్యం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే మీడియాకే ఎలా తెలిసే? అధికార బిఆర్‌ఎస్‌ నాయకులు ఆ మీడియాను నిత్యం తిడుతూనే వుంటారు. అయినా ఆ సంస్ధలకే అభ్యర్థుల పేర్లు వెళ్తాయంటే మెడమీద తల వున్నవారు నమ్మే వార్తలేనా? 

ఇక కాంగ్రెస్‌లో ఇన్నీ సీట్లు ఖరారయ్యాని , బిజేపి ఇంత లిస్టు రెడీ చేసిందని వార్తలు కూడా వస్తున్నాయి. 

నిజంగా అలా పార్టీలు ఏదో ఒక మీడియాకు లిస్టులు లీక్‌ చేస్తారా? చేసేంత ధైర్యం చేస్తారా? చేసి పదవుల్లో వుంటారా? అసమ్మతిని రాజేసి, ఎన్నికలకు వెళ్తారా? సహజంగా ఏ ప్రతిపక్ష పార్టీలోనైనా అసంతృప్తి ఎక్కువగా వుంటుంది. ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువే వుంటుంది. మరి సమర్ధులైన నాయకులు ఎంత మంది వున్నారన్నది కూడా పార్టీలు చూసుకుంటాయి. ముఖ్యంగా ఎన్నికలు ఖరీదైన ఈ రోజుల్లో ఒక అభ్యర్ధిని ప్రకటించాలంటే పాత కాలం రోజులు కావు…ప్రజల్లో పలుకుబడి ఒక్కటుంటే ఈ రోజుల్లో చాలదు. అందుకు అవసరమైన డబ్బు, దస్కం కూడా వుండాలి. ఎంత పెద్ద పేరున్న నాయకుడైనా కొత్తలు పంపకాలు లేకుండా పోటీ చేయడం అసాధ్యం. మరి అంతగా ఖర్చు చేసుకోగలిగే నాయకులు కాంగ్రెస్‌లోవున్నారా? పోటీ ఎక్కువగా వున్న నియోజకవర్గాలలో ఇప్పుడే పొగ లేపుకుంటారా? ఒక వేళ ఇప్పటినుంచే అభ్యర్ధుల ప్రకటన జరిగితే రాని వారు అసంతృప్తులై పక్క పార్టీలోకి వెళ్తారు? ఎందుకంటే నాకు టిక్కెట్‌రాకపోయినా ఫరావాలేదు? పక్కొడికి టికెట్‌ రావొద్దనే మనస్తత్వాలే ఎక్కువ. నేను గెలవకపోయినా ఫరవాలేదు? పక్కొడు గెలవొద్దు అనునేవారే ఎక్కువ. అందువల్ల పార్టీలు మారి, తనకు టికెట్‌ రాని చోట్ల అభ్యర్థులను ఓడిరచడానికి కూడా సిద్దపడుతుంటారు. ఫలితాలను తారు మారు చేసే స్ధితికి రాజకీయాలు చేర్చుతారు. టికెట్‌ రాని వారి వ్యవహరం అలా వుంటే, టిక్కెట్‌ వచ్చిన వారి సంగతి క్షణక్షణం ఏడిపే మిగులుతుంది. పోలింగ్‌ పూర్తయ్యే నాటికి మొత్తం క్షవరమే అవుతుంది. ఇదే ఇప్పుడున్న మీడియాకు కావాలి. సోషల్‌ మీడియాకు అంతకన్నా ఎక్కువ కావాలి. ఇప్పుడున్న పరిస్ధితుల్లో రాజకీయ పార్టీలకాన్న మీడియానే హడావుడి ఎక్కువ చేయాలి… హడావుడంతా మీడియాదే కనిపించాలి. అభ్యర్ధుల గోల తర్వాత…ముందు మీడియాకు మోకరిల్లాలి…అదంతే! అసలు ఏ పార్టీ ఇప్పటి వరకు టికెట్ల లిస్టు మొదలే పెట్టలే! ఎందుకంటే ఇప్పుడున్న పరిస్దితి రేపు వుండకపోవచ్చు. ఇవ్వాల్టి వార్త రేపు రాసేందుకు మీడియాకు మనసు రాకపోవచ్చు…రాతా తురానాం న మీడియా? న సోషల్‌ మీడియా!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!