ఆరోగ్య తెలంగాణ:
తెలంగాణలో వైద్య విప్లవం…పల్లె పల్లెకు ఆరోగ్యం… బస్తీ దవఖాలతో పేదలకు మరింత అందుబాటులో వైద్యం…ప్రతి జిల్లాకు వైద్య కళాశాలల విస్తరణం…
దళితబంధు:
దళిత సమాజానికి ఆర్థిక చేయూత…సమసమాజ నిర్మాణ ప్రగతి వేధిక.
కాళేశ్వరం:
సాగునీటి రంగంలో కాళేశ్వరం పరవళ్లు- వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందడుగులు.
మిషన్ భగీరథ:
మిషన్ భగీరథ తో సురక్షితమైన మంచినీటి సరఫరా- ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజ నిర్మాణానికి ప్రతీక.
మిషన్ కాకతీయ:
చెరువుల పునరుద్ధరణతో పూర్వ జలకళలు-
సాగునీటి యజ్ఞంలో తెలంగాణ తొలి అడుగులు.
మేలి రకం విత్తనాలు:
సాగుబడిలో కొత్త రకం వంగడాలు- తెలంగాణలో మేలిమిరకం విత్తనాలు.
విత్తన భాండాగారం:
తెలంగాణ విత్తన భాండాగారం-
ఆదర్శవంతమైన సాగు నిర్మాణం.
ఆసరా పథకం:
తెలంగాణ ఆత్మకు ఆవిష్కరణ- ముదిమి వయసు జీవితాలకు నగదు భరోసా.
కళ్యాణ లక్ష్మి:
పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వ కానుక- కళ్యాణ లక్ష్మి పథకంతో ఆ కుటుంబానికి ఆసరా.
కాళేశ్వరం ప్రాజెక్టు:
ప్రపంచంలోనే ఒక అద్భుతం- ఎగువ ప్రాంతాలకు నీటితో జలాభిషేకం.
యాదాద్రి:
మహిమాన్వితమైన యాదాద్రి పునర్ నిర్మాణం-
సుందరశోభిత వైభవం చరిత్రలో చెరగని తెలంగాణ సంతకం.
పారిశ్రామిక ప్రగతి:
తెలంగాణలో పారిశ్రామిక వెలుగులు-
ఐటి రంగ ఎగుమతుల్లో సరికొత్త విజయాలు.
తెలంగాణ నెంబర్ వన్:
సత్వర సర్వతోముఖావృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్-
పరిపూర్ణ వికాసంతో అన్ని రంగాలల దేశానికే ఆదర్శం.
దార్శనికుని పాలన:
దార్శనికుని పాలనలో తెలంగాణ ప్రగతిలో సరి కొత్త అధ్యాయం-అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్దికి సంకేతం.
ఎనమిదేళ్లలో….
ఎనమిదేళ్లలో ఎన్నో రంగాలలో అద్భుత విజయాలు- అన్ని రంగాలలో కళ్ల ముందు కదలాడుతున్న ఆవిష్కరణలు.
ప్రశంసలే..ప్రశంసలు:
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పతకాలు- – అన్ని రాష్ట్రాలనుంచి ప్రశంసలు.
రూపురేఖలు:
ఎనమిదేళ్లలో తెలంగాణ అంతటా మారిన రూపురేఖలు-
దార్శనికుడి పాలనలో అభివృద్ధికి కొత్త తరం ఆవిష్కరణలు.
సామాన్యులకు ఒకటే లక్ష్యం వుంటుంది. అసామాన్యులకు నిరంతరం లక్ష్యసాధన అలవడుతుంది. ఒకనాడు తెలంగాణ సాధిస్తే చాలు అనుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్,నేడు దేశమంతా సుభిక్షంగా వుండాలని అనుకుంటున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం మూలంగా జరిగిన విధ్వంసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఎనిమిదేళ్ళలో పూరించగలిగాడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు అంటే నో అన్నారు. సాధ్యం కాదన్నారు. చెరువుల బాగు పట్టించుకోలేదు. ఇలా అన్ని రంగాలలో తెలంగాణ వెనుకబాటుకు గురిచేశారు. విద్యారంగంలో చిన్న చూపు చూశారు. వైద్యరంగాన్ని కుదేలు చేశారు. తెలంగాణ ప్రజలకు వైద్యం అవసరమైనంత మేర అందుబాటులోకి తేలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడా ఆపలేనన్ని గోసలు పడిరది తెలంగాణ. మరి ఇన్ని గోసలు ఎనమిదేళ్లలో ఎలా తీరాయి? అంటే నాయకుడిలో చిత్తశుద్ధి కావాలి. లక్ష్యశుద్ది కావాలి. అంకిత భావం వుండాలి. నా ప్రజలు అన్న ప్రేమ కావాలి. పదవుల కోసం రాజకీయాలు చేస్తే అభివృద్ధి జరగదు. ప్రజా సేవ కోసం, శ్రేయస్సు కోసం, ప్రగతి కోసం, సమసమాజ నిర్మాణం కోసం నాయకుడు పరితపిస్తే ఏ దేశమైనా బాగుపడుతుంది. అది తెలంగాణ విజయవంతం చేసి నిరూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ ది. అందుకే కేసిఆర్ దేశం కోసం బయలు దేరింది. తాను తెలంగాణ తెచ్చి, అభివృద్ధి అంటే ఇది…నాయకుడు ఇలా వుండాలి. ప్రభుత్వాలు ఇలా పని చేయాలని చూపించారు. ప్రగతి మన కళ్ల ముందు వుంచారు. ప్రజల కన్నీళ్ళు తుడిచారు. సంతోషం నింపారు. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్ గురించి ఒక వ్యక్తిగా నా అభిప్రాయం వ్యక్తం చేయడం నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అయినా ఒక ప్రభుత్వ అధికారిగా జరిగిన అభివృద్ధిని చెప్పడం కూడా నా కర్తవ్యంలో కూడా భాగమే…నేను జరిగిన ప్రగతిని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను.
నిన్నటి గోసను ఈ తరానికి వివరిస్తున్నాను. మన తరానికి గుర్తు చేస్తున్నాను. అది తప్పుకాదు. చెడును చెడు అని చెప్పడమే హక్కా? మంచిని చెప్పడం తప్పా?? మంచిని మంచి అని కూడా చెప్పలేకపోతే చేతగాని తనమౌతుంది. అందుకే నేను ఏమనుకుంటున్నానో, నా మనసు స్పందనను, అభిప్రాయం ఒక వ్యక్తిగా వెల్లడిరచండం తప్పు కాదు. అదే తెలంగాణ ధైర్యం…నాకు నేర్పిన కర్తవ్యం. అని అంటున్న గడల శ్రీనివాస్ తో నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు చిట్ చాట్…
ఆరోగ్య తెలంగాణ. ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వ విజయం. దళితబంధు. దళిత సమాజానికి ఆర్థిక చేయూత…సమసమాజ నిర్మాణ ప్రగతి వేధిక. కాళేశ్వరం. సాగునీటి రంగంలో కాళేశ్వరం పరవళ్లు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందడుగులు.మిషన్ భగీరథ సురక్షితమైన మంచినీటి సరఫరా. ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజ నిర్మాణానికి ప్రతీక.మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణతో పూర్వ జలకళలు.
సాగునీటి యజ్ఞంలో తెలంగాణ తొలి అడుగులు. సాగుబడిలో కొత్త రకం వంగడాలు. తెలంగాణలో మేలిమిరకం విత్తనాలు. తెలంగాణ విత్తన భాండాగారం. ఆదర్శవంతమైన సాగు నిర్మాణం. ఆసరా పథకం. తెలంగాణ ఆత్మకు ఆవిష్కరణ. ముదిమి వయసు జీవితాలకు నగదు భరోసా. కళ్యాణ లక్ష్మి. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వ కానుక. కళ్యాణ లక్ష్మి పథకంతో ఆ కుటుంబానికి ఆసరా.కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలోనే ఒక అద్భుతం- ఎగువ ప్రాంతాలకు నీటితో జలాభిషేకం.కాళేశ్వరం. సాగునీటి రంగంలో ఆధునిక దేవాలయం. ప్రాజెక్టుల నిర్మాణంలో తలమానికం. మహిమాన్వితమైన యాదాద్రి పునర్ నిర్మాణం-సుందరశోభిత వైభవం చరిత్రలో చెరగని తెలంగాణ సంతకం. తెలంగాణలో పారిశ్రామిక వెలుగులు.
ఐటి రంగ ఎగుమతుల్లో సరికొత్త విజయాలు. సత్వర సర్వతోముఖావృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్.
పరిపూర్ణ వికాసంతో అన్ని రంగాలల దేశానికే ఆదర్శం. దార్శనికుడు కేసిఆర్ పాలనలో తెలంగాణ ప్రగతిలో సరి కొత్త అధ్యాయం. అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్దికి సంకేతం. ఎనమిదేళ్లలో ఎన్నో రంగాలలో అద్భుత విజయాలు. అన్ని రంగాలలో కళ్ల ముందు కదలాడుతున్న ఆవిష్కరణలు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పతకాలు. అన్ని రాష్ట్రాలనుంచి ప్రశంసలు. ఎనమిదేళ్లలో తెలంగాణ అంతటా మారిన రూపురేఖలు. అభివృద్ధికి కొత్త తరం ఆవిష్కరణలు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ పరుగులు . పవర్ హాలిడే లేని ప్రగతికి బాటలు. స్వీయ పాలనలో సిరుల వెలుగులు,ఎనమిదేళ్ల కేసిఆర్ పాలనలో సాగు, నీటి రంగాలలో పరుగులు. ఆరేళ్లలోనే తెలంగాణ స్వయం సమృద్ధి ఫలాలు, దేశమే ఆశ్చర్యపోయే ఆదర్శాలే సంక్షేమ ఫథకాలు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ. పల్లె వికాసమే దేశ వికాసం. పచ్చదనం నిండి, ప్రకృతి పరవశంతో నా తెలంగాణ సిరులారబోసుకుంటోంది. పసిడి పంటలకు నెలవౌతోంది. పాడి పంటలకు మిలితమైన సాగుతో అలరాలుతోంది. తెలంగాణ రైతన్నలో ధైర్యం నిండిరది. వారి మోములో చిరునవ్వు తొనికిసలాడుతోంది. తొలకరి పులకింతలు సాగు కెంత సంబరమో, పారే నీరు చూస్తే రైతుకంత సంతోషం. ఆ రైతు మేలు కోరే పాలన తెలంగాణ సొంతం. రైతే పాలకుడైతే రైతులకెంతో ఆనందం… ప్రకృతి శోభలో అలరాడుతున్న తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరంటు, పారుతున్న నీళ్లు, పచ్చని చేలు, కళ్ల ముందు ధాన్యపు రాశులు, కొట్టం నిండా పాడితో దేశమే అబ్బురపడుతోంది. తన కన్నీటి పొరలలో నాలుగు దశాబ్దాల పాటు దాచుకొని, తెలంగాణ సాధించి పచ్చని మాగాణ ఆవిష్కరించిన ఏకైక నేత ముఖ్యమంత్రి కేసిఆర్… సంక్షేమాలన్నీ ఏక కాలంలో ప్రజలకు అందిస్తున్న ఏకైక పాలకుడు కేసిఆర్. ప్రగతి దారుల్లో పారిశ్రామిక పరుగులు. తెలంగాణ సాగులో విప్లవాత్మక విజయాలు. ఒక్క తెలంగాణలోనే సాక్ష్యాత్కారాలు… పచ్చని ప్రకృతిలో పుడమి పులకించడం జాతి గర్వానికి నిదర్శనం. ఇది ఇప్పుడు మన తెలంగాణ ముఖచిత్రం. తెలంగాణ సౌభాగ్యం దేశమంతా ఆవిష్కరించాలి. దేశానికి కేసిఆర్ నాయకత్వం కావాలి. తెలంగాణ ప్రగతి దేశ వ్యాప్తం కావాలి. సుభిక్షం మన సొంతం కావాలి. మన దేశం ప్రపంచంతో పోటీ పడాలి. అభివృద్ధి చెందిన భారత్ అని అందరం సగర్వంగా చెప్పుకునే రోజు రావాలి.
విద్యుత్ వెలుగుల విప్లవం- ఉత్పాదిత తెలంగాణలో నవశకం.
చీకటి కాలం నుంచి వెలుగుల లోకంలోకి……అవును తెలంగాణ చీకటిలో మగ్గిన కాలం పోయింది. తెలంగాణ లో నిరంతర వెలుగుల కాలమొచ్చింది…తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే అది సుసాధ్యమైంది…ఇరవై నాలుగు గంటలపాటు కోతలు, వాతలు లేని వెలుగులు తెలంగాణ చూస్తోంది… వెండి వెలుగులలో వెలిగిపోతోంది. పారే నీరు, నిండే చెరువు, పచ్చని పొలాలు, పసిడి పంటలు, పల్లెల్లో ఆకుపచ్చవర్ణ శోభితాలు, గెలిచి నిలిచిన తెలంగాణ ముఖ చిత్రాలు ప్రగతి సాకారాలు. ముఖ్యమంత్రి కేసిఆర్ కలలకు ప్రతిరూపాలు. ఒకనాడు ఎండిన పొలాలు…నేడు నిండైన పంట సిరులు… నిన్న తుమ్మలు మొలిచిన చెరువులు..నేడు నిండైన గంగాళాలు…పెరిగిన భూగర్భ జలాలు… దారి వెంట నీటి పరవళ్ళు… కాలువల నిండా జల సవ్వళ్లు…పల్లెల్లో గోదారి గలగలలు. తెలంగాణ అంతటా సంబురాలు. సంక్షేమ పథకాలు కూడా వెల్లువలా అమలు…అన్నపూర్ణ తో మొదలైన పథకాలు బంగారు తెలంగాణలో నిరంతర వెలుగులు. తెలంగాణ సాధనతో అద్దిన వన్నెలు…ముఖ్యమంత్రి కేసిఆర్ కలల రూపాలకు నిదర్శనాలు. ఎనిమిదేళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎనలేని కీర్తి కిరీటాలు. అద్భుతమైన విజయాలకు తార్కాణాలు. ఆసరా పథకం ఫించన్లు- ముదిమి వయసులో ఆత్మగౌరవ ప్రతీకలు.
పేదింటి ఆడబిడ్డల పెళ్లికి పచ్చని తోరణాలు- కళ్యాణ లక్ష్మి పథకంతో విరబూస్తున్న సప్త వర్ణాల హరివిళ్లు. సమగ్ర సర్వతోముఖావృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం-
అన్ని రంగాలలో పరిపూర్ణ వికాసం దేశానికే ఆదర్శం. అరవైఏళ్ల గోసను అధిగమించి వెండి వెలుగులు – అన్ని రంగాలలో తెలంగాణ ఆవిష్కరణలు
నీటి గోసలు తీరి, తెలంగాణలో పసిడి పంటల సిరి-సాగు నీటి రంగంలో విప్లవాత్మక విజయాల జలరaరి.పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ పరుగులు – చీకట్లను తరిమిన విద్యుత్ వెలుగులు. దార్శనికత కలిగిన కేసిఆర్ నాయకత్వం- తెలంగాణ ప్రగతికి సోపానం. గోసపడ్డ చోట నీటి సవ్వడులు- ఎనమిదేళ్ల స్వపరిపాలనలో అన్ని రంగాలలో పరుగులు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఫలాలు- దేశమంతటా కొనియాడుతున్న సంక్షేమ పథకాలు. ఎనమిదేళ్లలో మారిన తెలంగాణ రూపురేఖలు-
యోధుడి పాలనలో ప్రగతి పథం పరుగులు. మన నీళ్లు,మన నిధులు, మన కొలువులు మనకే-ఎనమిదేళ్ల స్వీయ పాలనలో అరవై ఏళ్ల ప్రగతి కళ్లెదుటే!! స్వయం సమృద్ధిలో అన్నింటా తెలంగాణ ముందంజ- దేశమంతా ఆశ్చర్యంతో చూస్తుండే మన వంక. కాళేశ్వరం సాగునీటి రంగంలో ఒక మహాద్భుతం, ఆధునిక ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ తలమానికం.మహిమాన్విత శోభిత యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం,తరతరాల తెలంగాణ చరిత్రలో సువర్ణాధ్యాయం.పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ పరుగులు,ఐటి రంగంలో విప్లవాత్మక వెలుగులు. ఎనమిదేళ్ల స్వీయ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు,భవిష్యత్తు తరం కనే పసిడి కలలకు ప్రతిరూపాలు.ఎనమిదేళ్లలో మారిన తెలంగాణ రూపురేఖలు-యోధుడి పాలనలో పల్లె, పట్నం ప్రగతి పరుగులు. పల్లెలు దేశ ప్రగతికి పట్టుకొమ్మలు. పల్లె వికాసమే దేశ వికాసమని నాయకులు నమ్మితే చాలు పల్లె సింగారించుకుంటుంది. పచ్చదనంతో సిరులారబోసుకుంటుంది. పసిడి పంటలకు నెలవౌతుంది. పాడి పంటలకు కొదువలేకుండా పోతుంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నలో ధైర్యం కనిపిస్తుంది. వారి మోములో చిరునవ్వు తొనికిసలాడుతుంది. సాగు అనే పేరు వినగానే పులకించేది పల్లెనే…రైతే…ఆ రైతు మేలు కోరిన రాజ్యాలు కళకళలాడాయి. రైతే పాలకుడైతే తెలంగాణ కళ్లముందు ప్రకృతి శోభ, పంటల రాశులు, పారుతున్న నీళ్లు, పచ్చని చేలు, కొట్టం నిండా పాడితో ప్రపంచమే అబ్బురపడుతుంది. ఇదంతా తన కన్నీటి పొరలలో నాలుగు దశాబ్దాల పాటు దాచుకొని ఆవిష్కరించిన ఏకైక నేత ముఖ్యమంత్రి కేసిఆర్… భీడువారిన భూములను పచ్చని మాగాణం చేశాడు. తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన భూములకు కోట్ల ధర పలికేలా చేశాడు. అటు సాగు, ఇటు నీరు, మరోవైపు పారిశ్రమలు, సంక్షేమాలన్నీ ఏక కాలంలో ప్రజలకు అందిస్తున్న ఏకైక పాలకుడు కేసిఆర్. దేశంలో ఎక్కడా లేని ప్రగతి, పారిశ్రామిక పరుగులు, సాగు విప్లవాలు ఒక్క తెలంగాణలోనే సాక్ష్యాత్కారాలు… పచ్చని ప్రకృతిలో పుడమి పులకించడమంటే జాతి తలెత్తుకొని గర్వంగా బతుకుతున్నదని అర్థం. ఇది ఇప్పుడు మన తెలంగాణ ముఖచిత్రం. దేశ సౌభాగ్యంలో కూడా తెలంగాణ ఆవిష్కరణలు కావాలి. రావాలి. అంటే ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం దేశాన్ని ఏలే నాయకుడవ్వాలి. దేశంలో అరవై వేల టిఎంసిల నీరున్నా సాగు సాగలేకపోతోంది. సక్షేమం గతి తప్పుతోంది. అదుపులేని ధరలు, అంతులేని పేదరికంతో కోట్లాది మంది ఆకలికి అలమటిస్తున్నారు. వారి బతుకులు బాగు పడాలన్నా, వారి జీవితాలలో వెలుగులు నిండాలన్నా దేశానికి కేసిఆర్ నాయకత్వం కావాలి. తెలంగాణ ప్రగతి దేశ వ్యాప్తం కావాలి. దేశమంతా సుభిక్షం కావాలి. దేశం ప్రపంచంతో పోటీ పడాలి. అభివృద్ధి లో కళకళలాడాలి. ఒకనాడు ఎటు చూసినా ఏమున్నది నా తెలంగాణ… ఊర్లన్ని వలసపోయి, ఇళ్లన్నీ కూలిపోయి, చేతి వృత్తులు మాయమైపోయి దిక్కులేని బతుకుల కాలమది. ఆ సమయంలో ఏ పొలం చూసినా బీడువారి నోరు తెరిచించే…ఏ చెలక చూసి ఎడారే…చెరువుల ఆనవాలు పోయి, తుమ్మలు మొలిచి నీటి కటకటలే. వానాకాలమొస్తే చెరువన్నా నిండితే, ఊటలు పెరిగి బావులు నిండేది. సమైక్య పాలకుల దాష్టికానికి తెలంగాణ కకావికలమైంది. చెరువులు ఆగమైనవి. కొన్ని ఆనవాలు లేకుండా పోయాయి. భూములు బీడువారాయి. పల్లెలు రూపు చెదిరిపోయాయి. సొంత రాష్ట్రంలో పరాయి బతుకులయ్యాయి. ద్వితీయ శ్రేణి పౌరుల కింద లెక్కలయ్యాయి. విద్య లేదు. ఉపాధి లేదు. కొలువు రాదు. చుక్క నీరు లేదు. పంటలకు దిక్కులేదు…కొట్లాడినా లాభం లేదు…పల్లెల్లో ఎండుటాకుల అలజడి…పట్టణాలలో కానరాని ప్రగతి…! కానీ అదే సీమాంధ్ర నిండా నీటి సవ్వడి…ప్రాజెక్టుల వడివడి…రోడ్లు రువ్వడి…సగటు తెలంగాణ వాది కడుపు రగిలినా, ఆకలి ముందు కోపాన్ని దిగమింగుకొని బతికిన రోజులవి…ఆ రోజులనుంచి తెలంగాణ విముక్తి కాబడిరది. తెలంగాణ సాధనతో విముక్తి కాబడిరది. పారే వాగులో చుక్క నీరు లేక నా కంట కన్నీరు జలజలా రాలుతుంటే ఎత్తుకున్న తెలంగాణ జెండా దించలేదు,…బిగిసిన పిడికిలి విప్పలేదు…పుబ్బ, మగ అని ఎగతాళి చేసిన తెలంగాణ నినాదం విడువలేదు…పట్డిన పట్డు విడువకుండా ఒక్కడుగా మొదలై, కోట్ల మంది తెలంగాణ గొంతుకలై కొట్లాడిన… తెలంగాణ సాధించారు…పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం, నిర్విరామ ఉద్యమ ప్రస్థానం సాగించి తెలంగాణ సాధించారు. రక్తపు చుక్క నేల రాలకుండా తెలంగాణ సాధించి అరవై ఏళ్ల కల నిజం చేశారు…తెలంగాణ వచ్చిన మూడు నెలలో రెప్పపాటు కోత లేని కరంటు ఇచ్చారు..సమైక్య పాలనలో తెలంగాణ పల్లెలు కరెంటు సక్కగ చూసింది లేదు..పగటి పూట దిక్కులేదు…తెల్లందాక సక్కగ వచ్చింది లేదు. ఇక రైతు గోస చెప్పుకుంటే రామాయణం, రాస్తే భారతం.. రైతాంగానికి ఇచ్చే కరంటు అర్థరాత్రి, అపరాత్రి ఎప్పుడు అర్థ గంట ఇచ్చింది లేదు…రైతులంతా రాత్రిళ్లు పొలాల కాడ జాగారం… ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన రోజులు. పాము కాటేస్తదో, తేలు కుడుతదో భయం, భయం బతుకులు…మరి ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని కరంటు వెలుగులతో కళకళలాడుతున్నది తెలంగాణ. సాగుకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా….మిషన్ కాకతీయ తో తెలంగాణ లోని నలభైఆరు వేల చెరువుల పునరుద్ధరణ… మళ్ళీ కాకతీయ కాలం కళ్ల ముందు ఆవిష్కరించారు. చెరువులన్నీ నిండుగ…ఎండా కాలంలో మత్తళ్లు దుంకంగ…వాగులూ, ఒర్రెలు గోదారి జలాలతో పారంగా, తెలంగాణలో నీటి సుడుల సవ్వడి…జలజలగలగలు. కలలో కూడా కల గనని తెలంగాణ కళ్లముందు నిజ ప్రపంచమైంది…సంక్షేమం లో మేటి…ప్రగతిలో లేదు తెలంగాణకు ఏదీ పోటీ…అన్నట్లు పచ్చని పందరిలా పరుచుకున్న తెలంగాణ ఆవిష్కరించారు…కాళేశ్వరంతో తెలంగాణ చరిత్ర పదిలం చేశారు.. మిషన్ భగీరథ తో తెలంగాణ పల్లెలకు గోదావరి నీటి తో గొంతు తడిపిన…ఆడపడుచుల కాళ్లు కడిగారు…సస్యశ్యామల తెలంగాణ లో బంగారు సిరులు పండిరచారు…ఆసరా ఫించన్లతో వయసు మళ్లిన వారి జీవితాలలో వెలుగులు, ఆ కుటుంబం చింతలు తీర్చిన…స్వపరిపాలనలో ఆత్మ గౌరవం వెల్లివిరిసేలా చేశారు…నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించిన వాళ్లు అబ్బురపడేలా తలెత్తుకున్న తెలంగాణ కళ్లముందు ఆవిష్కరించారు….భవిష్యత్తు తరాలకు నీటి గోసలు లేకుండా చేశారు..ఎనమిదేళ్లలో అద్భుతాలు చేసి తెలంగాణకు వన్నెలద్దిన నాయకుడు కేసిఆర్. ఇప్పుడు దేశంలో ప్రగతి విప్లవం కోసం అడుగులు వేస్తున్నాడు…అందరూ ఆయన అడుజాడల్లో నడవాలనుకుంటున్నారు.