జూటా మాటలే!?

https://epaper.netidhatri.com/

`ప్రధానమంత్రికి తెలియకుండానే నిధులొచ్చాయా?

`బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ఎనభై వేల కోట్లు ప్రకటించారు?

`కాళేశ్వరానికి ఎనభై వేల కోట్లా?

https://epaper.netidhatri.com/

`తెలంగాణ కు ఎన్నడైనా రూపాయి ప్రకటించారా?

` ఆ మాటలు నీటి మూటలే!

`నమ్ముకున్న అబద్దాలే బిజేపిని ముంచడం ఖాయమే!

`ఎల్లకాలం మోసం చేయలేరులే?

`ప్రజలు అన్నీ గమనిస్తున్నారులే?

` నమ్మి గెలిపిస్తే బిజేపి ఎవరికి మేలు చేస్తుందో దేశ ప్రజలు చూస్తున్నారు?

` కాళేశ్వరానికి కేంద్రం రూపాయి ఇచ్చిందా?

` బిజేపి నాయకుడు ఎలా ప్రకటిస్తాడు?

` మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లకే పైసా ఇచ్చింది లేదు!

` నీతి ఆయోగ్‌ చెప్పినా వినిపించుకున్నది లేదు!

`తెలంగాణ మొర ఆలకించింది లేదు!

` ప్రధాని మోడీ ఫోటో లేదనే గాయి, గాయి చేసిన ముచ్చట మర్చిపోయారా?

` కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వమని అడిగితే కనీసం విన్నారా?

` ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో వేల కోట్లు ప్రకటిస్తారు?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

బిజేపి పార్టీ నేతలు నిత్యం చెప్పేవన్నీ జూటా మాటలే!? అంటూ ఓ వైపు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా ఆ పార్టీలో మార్పు రావడం లేదు. ప్రజలకు నిజం చెబుదాం, మంచి చేద్దామన్న భావన ఎక్కడా కనిపించడం లేదని ఆరోపణలు అందిస్తూనే వున్నారు. అయినా బిజేపి చలనం లేదు. మేం అబద్దాలే చెబుతాం అన్నట్లు గానే బిజేపి రాజకీయాలు సాగుతుంటాయి. బిజేపి చెప్పే మాటలన్నీ నీటి మూటలే! అన్నది కూడా వాళ్లే రుజువు చేసుకుంటున్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినట్లు ఇటీవల ఓ బిజేపి ఎంపి వ్యాఖ్యానించడాన్ని బిఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిరచింది. ఆ పార్టీ నేత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని బిఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. తెలంగాణ ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు బిజేపి ఎంపి. వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎంపి చెప్పిందంతా అబద్దమని కొట్టిపారేశారు. ఏనాటికైనా అదే అబద్దాలతో బిజేపి మునగడం ఖాయమన్నారు. ఎంతో విజ్ఞులు, విజ్ఞాన వంతులైన తెలంగాణ ప్రజలు బిజేపిని అందుకే నమ్మడం లేదన్నారు. నోరు తెరిస్తే చాలు జాతీయ స్థాయి నుంచి గల్లి స్థాయి లీడర్ల దాకా అన్నీ అబద్దాలే! గతంలో ఎన్నికల ముందు తెలంగాణకు రెండు లక్షల కోట్లిచ్చినట్లు ప్రకటన చేశారు. మరో బిజేపి నాయకుడు వచ్చి అది మరో లెక్క చెప్పాడు. అసలు ఆ పార్టీలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. దామాషా ప్రకారం కేంద్రం నుంచి అందే నిధులను కూడా ఇస్తున్నట్లు చెప్పుకోవడం గతంలో ఎన్నడూ చూడలేదు. అంతదాకా ఎందుకు గత ఏడాది తెలంగాణ లో భారీ వర్షాలు కురిసాయి. కేంద్రం స్పందన సున్నా! ఈసారి తూ..తూ మంత్రంగా కేంద్ర బృందం పంపారు. కేంద్ర బృందం వచ్చింది. వెళ్లింది. కేంద్రం నుంచి సాయం ప్రకటన రాలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణ కు ఎనభై వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినట్లు బిజేపి ఎంపి. అన్నారు. ఇదే బిజేపికి చెందిన కొందరు ఎంపిలు కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రకటిస్తారు. మరి కొందరు ఎంపిలు కాళేశ్వరం ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబానికి ఏటిఎం లాగా పని చేస్తుందంటారు. అసలు ప్రాజెక్టు వ్యయమే ఎనభై వేల కోట్లయితే, లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమౌతుందో బిజేపి నేతలే చెప్పాలి. ఇదిలా వుంటే ఒకటికి రెండుసార్లు గతంలోనే కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పార్లమెంటు లోనే కాళేశ్వరం లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పింది. ఇప్పుడు బిజేపి ఎంపి కాళేశ్వరం నిధులు కేంద్రానివే అంటున్నాడు. అదే నిజమైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సాయం చేయమంటే కేంద్రం ఎందుకు? స్పందించలేదు. ఎన్ని ఉత్తరాలు రాసినా ఎందుకు కనికరించలేదు. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలని కోరితే ఎందుకు కాదన్నది. ఒకవేళ జాతీయ హోదా ఇస్తే కేంద్రం నిధులివ్వాల్సి వస్తుందనే కాదన్నది. ఈ మాత్రం తెలియకుండానే బిజేపి ఎంపి ఓ మాట అనేస్తే ప్రజలు నమ్ముతారని భ్రమపడ్డట్టున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి బిజేపి నేతలు ఎల్లకాలం మోసం చేయలేరులేరు. తెలంగాణ ప్రజలే కాదు, దేశ వ్యాప్తంగా అన్నీ గమనిస్తున్నారు. దేశ ప్రజలు నమ్మి గెలిపిస్తే బిజేపి ఎవరికి మేలు చేస్తుందో దేశ ప్రజలు చూస్తున్నారు? కాళేశ్వరానికి కేంద్రం రూపాయి ఇచ్చిందా? బిజేపి నాయకుడు ఎలా ప్రకటిస్తాడు? అనేది ఇప్పుడు తెలంగాణలో విసృతంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చ వల్ల తెలంగాణ బిజేపి నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. సొంత పార్టీ ఎంపి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బిజేపి నేతలు ఖండిరచలేరు. అలా అని సమర్థించలేరు. ఎన్నికల ముందు చేసిన వాగ్థానాలే తెలంగాణ బిజేపి ఎంపిలు పూర్తి చేయలేకపోయారు. పసుపు బోర్డు రాలేదు. అయినా సమర్థించుకోవడానికే నిజామాబాదు ఎంపి. అరవింద్‌ నానా తంటాలు పడుతున్నారు. ఇక మరో ఎంపి తన నిధులతోని ఇల్లు కట్టుకున్నానంటాడు. కానీ నిధులు దుర్వినియోగం చేయలేదంటాడు. ఇలా నిజానికే విసుగొచ్చేలా బిజేపి ఎంపిలు మాట్లాడుతున్నారు. జిహెచ్‌ఎంసి. ఎన్నికల ముందు బిజేపి అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలను ఇటీవలే ముఖ్యమంత్రి కేసిఆర్‌ అసెంబ్లీలో గుర్తు చేసి, తూర్పారపట్టాడు. 

గతంలో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లకైనా సాయం చేయమని మంత్రి హరీష్‌ రావు, మంత్రి కేటిఆర్‌ అనేక సార్లు కోరడం జరిగింది. 

కానీ పైసా ఇచ్చింది లేదు! నీతి ఆయోగ్‌ చెప్పినా వినిపించుకున్నది లేదు! మిషన్‌ కాకతీయ కు, మిషన్‌ భగీరథ కార్యక్రమాలకు నిధులివ్వాలని నీతి ఆయోగ్‌ చెప్పిందనే విషయాన్ని గుర్తు చేసినా, తెలంగాణ మొర ఆలకించింది లేదు! అలాంటిది తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కు ఎనభై వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పడం ఏమిటి? ఈ విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి తెలియకుండానే నిధులొచ్చాయా? ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్‌ కేటాయింపులు చేయకుండానే ఇచ్చారా? రైల్వే ప్రాజెక్టుల విషయంలో లక్ష రూపాయల కేటాయింపులు కూడా బడ్జెట్‌ లో పొందుపర్చుతుంటారు. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలా నిధులు కేటాయించారో కూడా చెప్పాలి. అసలు రేషన్‌ దుఖానాలలో ప్రధాని మోడీ ఫోటో లేదనే గాయి, గాయి చేసిన ముచ్చట మర్చిపోయారా? దేశమంతా ఆ సంఘటన చూసింది. నివ్వెరపోయింది. అలాంటిది కాళేశ్వరానికి నిధులిస్తే బిజేపి ఇంతకాలం ఆగేదా? కనీసం కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వమని అడిగితే కనీసం విన్నారా? సరే పోనీ ఎన్నికల సమయంలో నైనా తెలంగాణ కు ఏమైనా వరాలు కురిపించారా? ఉత్తరాధి రాష్ట్రాల ఎన్నికల ప్రచారాలలో వేల కోట్లు ప్రకటించడం చూస్తూనే వున్నాం. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత జరిగిన బిహార్‌ ఎన్నికలలో ఏకంగా ఆ రాష్ట్రానికి ఎనభై వేల కోట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలంటే చాలు నిధుల మీద నిధులు వేల కోట్లలో ప్రకటిస్తారు. మరి మా తెలంగాణ కు ఏమిస్తారని ఒక్క బిజేపి ఎంపి కేంద్రాన్ని అడగరు. నిధులు తేరు. ఇవ్వని నిధులు ఇచ్చినట్లు బిజేపి ఎంపిలు తెలంగాణపై అబద్దాలు ప్రచారం చేస్తుంటే మౌనంగా వుంటారు. 

తెలంగాణ కు ఎన్నడైనా రూపాయి ప్రకటించారా? అని బిజేపి పెద్దలను అడగలేరు. ఆఖరుకు తెలంగాణ కు గతంలో మంజూరు చేసిన ప్రాజెక్టులు కేంద్రం ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతుంటే ప్రశ్నించరు. నోరు పెగల్చలేరు. ఊకదంపుడు మాటలు చెప్పమంటే అందరికంటే ఫస్టు, బెస్ట్‌ మన బిజేపి ఎంపిలే అని మాత్రం చెప్పుకునేలా చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!