జిల్లా వైద్యాధికారులు దవాఖానల్లో నిద్ర

డీఎంహెచ్వో, డిప్యూటీ డిఎంహెచ్వోలు నెలలో ప్రతి పి హెచ్ సీ సందర్శించాలి.

• నెలలో ఒక రోజు పి హెచ్ సీల్లో నిద్ర చేయాలి.

• నేను కూడా నిద్ర చేస్తాను

 

• ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి

• హెచ్ వో డీ లు నెలవారీ సమీక్షలు చేసుకోవాలి

• సిజెరియన్ల రేటు గణనీయంగా తగ్గించాలి

• తీరు మారని ప్రైవేటు ఆసుపత్రులపై మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలి

• వచ్చే నెల నాటికి పనితీరు మరింత మెరుగు పడాలి. లేకుంటే చర్యలు తప్పవు

• పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటింటా కరోనా వాక్సిన్ ఇవ్వాలి

• సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.

• పి హెచ్ సీ ల పై నెలవారీ సమీక్షలో ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

 

 

నెల వారీ (హెల్త్ క్యాలెండర్) సమీక్షలో భాగంగా పీహెచ్‌సీల ప‌నితీరు, పురోగతి పై వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు ఆదివారం అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం ఆఫీస‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, సూప‌ర్‌వైజ‌రీ సిబ్బందితో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఎన్సిడి స్క్రీనింగ్, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సి- సెక్షన్ల రేటు, ఏ ఎన్ సి రిజిస్ట్రేషన్, గర్భిణులకు అందుతున్న ఇతర సేవలు, ఓపీ, టీబీ, టి- డయాగ్నొస్టిక్, ఐహెచ్ఐపి, తదితర వైద్య సేవలపై జిల్లాలు, పీహెచ్సిల వారీగా సమీక్ష నిర్వహిచారు.

 

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..

 

ప్రాథమిక దశలో రోగాలు గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారా దీర్ఘకాలిక రోగంగా మారకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది. ఇందులో పి హెచ్ సిలది కీలక పాత్ర. 

 

క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలు తెల్సుకునేందుకు, తక్షణం పరిష్కరించి ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రతి నెల అన్ని పి హెచ్ సీ లు తప్పని సరిగా సందర్శించాలి. నెలలో ఒక రోజు రాత్రి 24×7 పి హెచ్ సీలో నిద్ర చేయాలి. ఒక రోజు నేను నిద్ర చేస్తాను. అక్కడి పరిస్థితులు తెల్సుకుంటాను.

 

ముఖ్యమంత్రి కే సి ఆర్ గారి సహకారంతో మనందరం చేస్తున్న కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే ఇంకా చాలా మార్పు రావాలి.

 

తాజాగా విడుదలైన కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం, IMR – శిశు మరణాల రేటు 23 నుండి 21 కి తగ్గింది. 2014 లో ఇది 39 ఉండేది. దేశంలో ప్రస్తుతం 28 గా ఉంది.

 

దవాఖానల్లో ప్రసవాలు పెరగటం, కేసీఆర్ కిట్లు, అరోగ్య లక్ష్మీ, 102 వాహన సేవలు, మారుమూల ప్రాంతాలకు సైతం మెటర్నిటీ సేవలు విస్తరించడం, ప్రత్యేకంగా చిన్న పిల్లలకు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు వంటివి తగ్గుదలకు దోహదం చేశాయి. 

 

జాతీయ అరోగ్య సూచిల్లో పురోగతి (2014-2021)

MMR 92 – 56% ( IND 103)

NMR 25-16% (IND 22)

Under 5MR – 41-30% (IND 36)

Insti. Deliveries – 91-98 (IND 79)

Deliveries in Govt – 30 – 56

 

ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలందరికీ చేరువ చేస్తున్న మీ అందరి భాగస్వామ్యం ఇందులో ఉంది. 

 

దేశంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్న విషయంలో మనం దేశంలో మూడో స్థానంలో ఉన్నాం. మొదటి స్థానానికి చేరువ చేరుకోవాల్సిన అవసరం ఉంది. 

 

ముఖ్యంగా సిజేరియన్లు తగ్గించే విషయంలో మనం లక్ష్యం ఏర్పాటు చేసుకొని పని చేస్తున్నం. రాష్ట్రంలో 60 శాతం సిజెరియన్లు జరుగుతున్నాయి. ఇది చాలా వరకు తగ్గాలి. 

 

రాష్ట్రంలో 210 సబ్ సెంటర్ల పరిధిలో 70 శాతం కంటే ఎక్కువ ప్రసవాలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరుగు తున్నట్టు గుర్తించాము. దీంతో సిజెరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నము. గత మూడు నెలలుగా వారిపై ప్రత్యేక దృష్టి సారించాము.

 

ఇందులో కొన్ని పీహెచ్ సీ ల పరిధిలోని సబ్ సెంటర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వచ్చే నెల నాటికి తీరు మారాలి.

 

ప్రైవేటు ఆసుపత్రుల్లో అనవసర సిజెరియన్లు జరగకుండా చూడాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలి.

 

పీహెచ్‌సీ స్థాయికి ఆరోగ్య శ్రీ సేవ‌ల‌ను విస్త‌రించడం జరిగింది. వచ్చే మూడు నెలల్లో అన్ని కేంద్రాల్లో అందేలా చర్యలు తీసుకుంటున్నము. పీ హెచ్ సీ లలో ప్రసవాలు పెరగాలి. సాధార‌ణ ప్ర‌స‌వాలు పెంచాల‌నే ల‌క్ష్యంలో భాగంగా ప్రభుత్వ వైద్యుల‌కు, నర్సులకు ఇన్సెంటివ్ ఇవ్వ‌బోతున్నాము.

 

 

పీహెచ్‌సీల్లో అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.మందులు లేవు అనే ప‌రిస్థితి ఎట్టిపరిస్థితుల్లో ఉందొద్దు. మందుల పంపిణీ ఈ ఔషధీ పోర్టల్ ద్వారా జరగాలి.

 

ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు విధుల్లో ఉంటూ వైద్యులు, సిబ్బంది ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాలి.

 

24 గంట‌లు న‌డిచే పీహెచ్‌సీలు అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను అన్ని వేళ‌ల్లో అందించాలి.

 

అన్ని వివరాలను ఎప్పటి కప్పుడు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాంలో (IHIP) అప్‌లోడ్ చేయాలి.

 

ఎన్సీడీ స్క్రీనింగ్ మీ పరిధిలో ఈ నెల చివరి నాటికి వంద శాతం పూర్తి అయ్యేలా చూడాలి, అవసరమైన వారికి మందులు అందే విధంగా చూడాలి. టి- డ‌యాగ్నోస్టిక్ సేవలు వినియోగించుకోవాలి. 

 

కరోనా కేసులు దేశం లో కొన్ని చోట్ల పెరుగుతున్నాయి. మనం అప్రమత్తంగా ఉందాం. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలి. అన్ని కేటగిరీల్లో వంద శాతం పూర్తి చేయాలి. పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా..స్థానిక ప్రజా ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని, ఇంటింటా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలి.

 

 

వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సీఎం గారి ఆలోచన మేరకు పని చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.

 

కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్వేతా మహంతి, డీ హెచ్ శ్రీనివాస్ రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, Tsmsidc ఎండి చంద్ర శేఖర్ రెడ్డి, పలు విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *