కొంపల్లి , నేటిధాత్రీ :
నాసా నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లో శ్రీచైతన్య కొంపల్లి -2 పాఠశాల విద్యార్థులు పాల్గొని , జనాoతరిక్ష్ అనే పేరుతో స్పేస్ కాలనీ ఏర్పాటు చేశారు . ఈ కాంటెస్ట్ లో శ్రీచైతన్య కొంపల్లి -2 పాఠశాల విద్యార్థులు కు జాతీయ స్థాయిలో 2 వ బహుమతి గెలుచుకున్నారు. విజయాన్ని సాధించిన జి. తేజశ్విని, ఎన్. వినూత్న రెడ్డి,డి. సాయి యశస్విని,టి. అన్విక, కె.రక్షిత,ఎం.మేధారెడ్డి, పి. సృజన,జి.హిరణ్మయి,ఎం. నందిని అనే విద్యార్థులకు మేమెంటోలు, సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసినట్లు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సీమ పేర్కొన్నారు.
ఈ సందర్బంగా కొంపల్లి -2 ఏజిఎం – జి.వి. రమణారావు కో -ఆర్డినేటర్లు సీతారాం ,జైపాల్ , పాఠశాల ప్రిన్సిపాల్ కరుణబిందు, హాస్టల్ ప్రిన్సిపల్ హేమలత ,పీఠాధిపతి రాజేష్ , ఎంపిఎల్ ఇంచార్జి త్రివేణి , సి -బ్యాచ్ -ఇంచార్జ్, కృష్ణంరాజు తదితర ఉపాధ్యాయ బృoదాన్ని ప్రత్యేకంగా అభినందించారు.