జస్ట్‌ బ్రేకప్‌!

కరోనా కాలంలో కాపురాలు మాయం…
సనీ పరిశ్రమలో వరుస సంఘటనలు…
చైతూ..సమంతల విడాకులు మర్చిపోకముందే…
ధనుష్‌ , ఐశ్వర్యలు ప్రకటన…
శ్రీజ, కళ్యాణ్‌ దేవ్‌ కూడా అదే దారి అంటూ వార్త…
ఇంతకీ ఏమిటీ వైపరిత్యం…ఇగోలు తెస్తున్న గండం…
దూరం వుంటేనే ప్రేమలు…ఇదే సినీ బాష్యం సామెతలు…
పని లేకపోతే ఊరు మీద పంచాయితీలన్నీ నెత్తి మీద పడతాయంటే ఇదే…కరోనా తెచ్చిన గండాలలో కాపురాలు మాయం కూడా ఒక కారణం. ఎప్పుడూ బిజీగా వుంటే సీనీ లోకం అంతా ఒక్క దగ్గరే వుంటున్నారు. అంటే భార్యాభర్తలు కూడా అందుకు మినహాయింపుకాదు. అందులోనూ ఇద్దరూ సినీ పరిశ్రమలో ఏక కాలంలో బిజీగా వుంటే మాత్రం ఇక కథ అంతేనని కరోనా కాలం రుజువు చేసింది. సహజంగా ఒకరికొకరు ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూస్తే విహరం ప్రేమను పెంచుతుంది. ఎప్పుడూ ఇంట్లోనే వుంటుంటే దూరం పెంచుతుందని నిరూపించింది. అవును సినీ మాయ. ఆకర్షణ. అది తగ్గితే ఇక అంతే…దూరం పెరుగుతుందంతే…!
జస్ట్‌ బ్రేకప్‌…అన్నది చాలా చిన్న పదం. పెద్ద నిర్ణయం. తెలుగులో విడాకులు…మావిడాకులు ఎండిపోకుండానే విడాకులా? అని సినిమాల్లో డైలాగులు వింటే ఏమిటో అనుకున్నాం…కాని అదే సినిమా వాళ్లు ఈ మధ్య చాలా సింపుల్‌గా జస్ట్‌ బ్రేకప్‌ అంటుంటే చూస్తున్నాం…ఇదే మాయ రోగం అని తిట్టుకుంటున్నాం…సోషల్‌ మీడియాలో ఎవరికి వారు తమ బాధలు, కోపాలను కూడా చూపిస్తున్నారు. సినిమా వాళ్లు సమాజం మీద ఇంతగా పెనవేసుకుపోయారా? అన్న అనుమానం అప్పుడప్పుడూ కలుగుతుంది. వాళ్లు కలిసింటే ఏమిటి? విడిపోతే ఏమిటి? కాని అవునా…అని తెగ బాధపడిపోతుంటారు. వాళ్లకు లేని బాధలు ప్రేక్షకులే చూపిస్తుంటారు. కన్నీరు కారుస్తుంటారు. సినిమా లేని జీవితం లేదంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా హీరో, హీరోయిన్లు కలసి ఎక్కడికైనా వెళ్లినా, ఎవరూ చూడని ప్రాంతంలో కనిపించినా అదో రకం కథలు అల్లడం, అన్నవి వార్తలుగా వుండేవి. ఆసక్తిని పెంచేవి. ఓసారి మురళీమోహన్‌, జయచిత్ర పెళ్లికి సంబంధించిన షూటింగ్‌ డ్రెస్సులోనే ప్రయాణం చేసి వెళ్తుంటే దాసరి నారాయణ రావు లాంటి వారు కూడా అపోహ పడి ఏంటీ పెళ్లయిపోందా? అన్నాడట. అంటే సినిమా వాళ్ల వార్తలు ప్రజలకే కాదు, సినీ జనాలకు కూడా వార్తలే…అన్నపూర్ణ అనే ఓ నటి అమ్మగా అనేక సినిమాల్లో నటిచింది. ఆమె అమ్మ పాత్రదారిగా వేసిన సినిమాల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా భర్త పాత్రలు వేసేవారు. ఆమె ఇతర నటులకు భార్య పాత్ర వేస్తున్నప్పుడు ఎదురుపడితే తలకొట్టుకునేవాడట…అంటే సరదాగానే అనుకోండి…కాకపోతే పాత్రల్లో పరకాశ ప్రవేశంచేసి, తోటి నటుల మధ్య అనుబంధాలు అంత పెనవేసుకొని పోయేవట. అలా కొన్ని బంధాలుగా మారిన సందార్భాలు కూడా అనేకం వున్నాయి. అలాంటి వాటిలో కృష్ణ, విజయనిర్మల, నాగార్జున,అమల, రాజశేఖర్‌, జీవిత. ఇలా కొన్ని జంటలు మాత్రమే చివరి దాకా మూడు ముళ్ల బంధాలను గౌరవిస్తూ జీవితం సాగిస్తున్నారు. కాని అవకాశం కోసం, ఆశ్రయం కోసం, సినీ రంగంలో నిలదొక్కు కోవడం కోసం, ఆదిపత్యంతో అహంతో పెళ్లి చేసుకోవడం, ముందు ప్రేమించి తర్వాత హింసించి వదిలేయడం కూడా కామన్‌గా సినీ రంగంలో జరిగిన సంఘటలను అనేకం వున్నాయి. అలా జీవితాలు ఆగం చేసుకున్నవారు వున్నారు. శరత్‌బాబు చెప్పే విషయానికి, రమా ప్రభా చెప్పే వివరణకు ఎక్కడా పొంతన వుండదు. కాకపోతే ఇద్దరూ కలిసి జీవితం సాగించారన్నది నిజం. రమా ప్రభ వల్ల శతర్‌ బాబు ఎదిగాడన్నది ఎవరు కాదనలేని నిజం. సిల్క్‌స్మిత వాంటివారి జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణం కూడా రంగుల ప్రపంచంలోని మోసమే…ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో మంచి నటుడు అనిపించుకున్న చలం, తన జీవితంలో ఎంతో మంది హీరోయిన్ల జీవితాలను ఆగం చేశాడు. ఆయన ఆగమయ్యాడు. నటనలో జాతీయస్ధాయి అవార్డులు అందుకున్న శారద జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడని అంటుంటారు. ఇలా సినీ ప్రపంచంలో అనేక కథలు…అనేక విషాదాలు…
ఎవర్‌గ్రీన్‌ శోభన్‌ బాబు…జయలలిత..: ఇది నిజమెంతో కాదో తెలియదు కాని ఇద్దరి మధ్య సఖ్యత అన్నదానిపై అప్పట్లోనే రకరకాలు ఊహాగానాలు. ఎవరూ నిజమని చెప్పింది లేదు. రుజువు చేసింది లేదు. కాని అదిగో పులి..అంటే ఇది తోక అన్నట్లు…వారి అన్యోన్యతకు ఓ కూతురు అన్నారు. కాని ఎవరూ చెప్పింది లేదు. కాని జయలలిత దత్తపుత్రుడు సుధాకర్‌ ను పెంచి పెద్ద చేసి, ఎంతో వైభవంగా వివాహం చేసింది. మరి సొంత కూతురే వుంటే దత్త పుత్రునికి అంత ప్రాధాన్యత ఎందుకిచ్చారన్నది ఎవరూ చెప్పలేదు. శోభన్‌బాబు, జయలలిత ఇద్దరూ కలసి హైదరాబాద్‌లో కొంత కాలం వుంటూ వెళ్లేవారని అంటుంటారు. అందుకు సాక్ష్యంగా జేజేఆర్‌ గార్డెన్స్‌ మాత్రం వుంది. అప్పట్లో ఎన్టీఆర్‌ కూడా ఓ సీనియర్‌ నటితో సన్నిహితంగా వుండేవాని అంటుంటారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని అంటుంటారు…ఇలా పాత కాల ముచ్చట్లు ఎన్ని విన్నా అదో రకమైన ఆసక్తి కాని నేడు….విడాకులపై ఆసక్తులు పెరుగుతున్నాయి.
ఒకనాడు నాగార్జున, తన మొదటి భార్య విడిపోయారంటే అదో పెద్ద వార్త…ఎందుకూ? అన్నది ఆనాడు చర్చే…ఇప్పుడు చైతన్య…సమంత విడిపోయారన్నది ఓ పెద్ద వార్తే…నిన్నటిదాకా రచ్చ రచ్చే…ఇప్పటికీ వాళ్లిద్దరూ ఏది చేసినా ఏదో ఒక వార్తగా మారుతోంది. కాకపోతే తాజా పద్దెనెమిదేళ్లు కలిసి కాపురం చేసిన ధనుష్‌ , రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నారన్న వార్త వెలువడిన కొద్ది సేపటికే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా మళ్లీ విడాకులు అట…అన్న వార్తలు హల్‌ చల్‌ చేశాయి. అంటే పెళ్లికి ఎలాంటి గౌరవం లేదా? అన్నది సమాజంలో చర్చ మొదలైంది.
సినిమా వాళ్లంటే సమాజంలో ఓ క్రేజ్‌…వాళ్లు ఏ దుస్తులు వేసుకుంటే అవే వేసుకోవాలి. వాళ్లు ఎలా నడుచుకుంటే అలా నడుచుకోవాలి. వారిని అనుసరిస్తుండాలి. ఇప్పుడు సమాజంలో తాజాగా విడాకులు కూడా అదే దారిలో నడుస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఒకరి తర్వాత ఒకరు…సినీ పరిశ్రమలో ఇదేం దరిద్రం అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదన్నది ఎలా ఎప్పుడూ వార్తగా నిలుస్తుందో…విడాకుల వార్తలు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి వినిపిస్తూనే వుంటుంది. అలా తీసుకున్నవారిలో నయన తార కోసం భార్యా పిల్లల్ని వదిలేసిన ప్రభుదేవకు నయన తార హాండ్‌ ఇచ్చేసింది. దాంతో తగిన శాస్తి జరిగిందన్న వాదనలు కూడా సమజం నుంచి వినిపించాయి. అటు కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ది ఎలాగో, దక్షిణాదిన నయన తార వార్తలు అంతే…గా నడిచాయి. శింబుతో తోపాటు…మరి కొంత మంది నటులతో పెళ్లిదాకా వచ్చి, ఆగిపోవడాలు..అన్నది కామన్‌గా మారిపోయింది. తాజగా సమంత, చైతన్యల బ్రేకప్‌తో చాలా మంది అదే బాటలో నడుస్తున్నారని తెలిసి ప్రేక్షకులు ఆశ్యర్యపోతున్నారు. వీటన్నింటికీ కారణం కేవలం ఇగో…అంతే…అది తగ్గదు…వాళ్లను తగ్గనీయదు…కాకపోతే మళ్లీ కలిసిపోవచ్చు… కధలు కుదిరితే కలిసి సినిమాలు చేయొచ్చు…జనమే వెర్రివెంగలప్పలయ్యేది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!