` కారే గెలిచింది…
`దేశ రాజకీయాలను మార్చేందుకు మునుగోడు నుంచి బయలుదేరింది.
`నేటిధాత్రి ముందు నుంచి ఇదే చెప్పింది.
`ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వానికి తిరుగులేదని మరో సారి రుజువైంది.
`గత ఎన్నికలలో చౌటుప్పల్ లో చతికిలబడ్డ కారుకు హుషారొచ్చింది.
`ప్రజా వ్యతిరేకత ప్రతిపక్షాలు చేసింత లేదని తరలిపోయింది.
`ప్రజల్లో టిఆర్‌ఎస్ మరింత గూడుకట్టుకొని వుందనేది స్పష్టమైంది.
`టిఆర్‌ఎస్ కూడా కొంత మారాలి?
`నాయకులు నిస్తేజం వదలాలి?
` అధికారంలో వుంటేనే పని చేస్తామనే భావన తొలగిపోవాలి?
` ప్రజల్లోకి మరింత విసృతంగా వెళ్లాలి?
`పక్క చూపులు మానుకోవాలి?
`బిజేపి మాయ మాటలను నమ్మి మోసపోవొద్దు?
`కాంగ్రెస్ ఓటు టిఆర్‌ఎస్ కు బదిలీ!
`కాంగ్రెస్ బలహీన పడుతోందా?
`బిజేపికి చేసిన ప్రయోగంలో సక్సెస్ కాలేదు?
`తెలంగాణ ప్రత్యామ్నాయం మేమే అని బిజేపి చెప్పాలనుకున్నది…?
`మునుగోడుతో కూడా ఆ పార్టీకి అంత సీన్ లేదని తేలిపోయింది.
`బిజేపికి అద్దె నాయకులే దిక్కా?
` బిజేపిలో లీడర్లే లేరా! `క్యాడర్ కూడా లేదా?
`కమ్యూనిస్టులు కలిసొచ్చారా? పక్క చూపులు చూశారా!?
మునుగోడు ఉప ఎన్నికలో కారు మరో విజయం తన ఖాతా వేసుకున్నది. ప్రజల హృదయాలలో తన స్థానం చెక్కు చెదరలేదని నిరూపించుకున్నది. టిఆర్‌ఎస్( బిఆర్‌ఎస్) పార్టీకి ప్రజల్లో మద్దతు స్పష్టమైంది. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఎదురులేదు, తిరుగులేదని మరో సారి రుజువైంది. తెలంగాణ దిక్సూచి, దశ, దిశ కేసిఆరే అని మునుగోడు మరోసారి ఎలుగెత్తి చాటినట్లైంది. అంతే కాదు మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి టిక్కెట్ ఇస్తే కష్టమని ఎంత మంది చెప్పినా, ప్రజలపై తనకున్న నమ్మకం ఎంతటిదో కేసిఆర్ రుజువు చేసుకున్నట్లైంది. పైగా రాత్రికి రాత్రి బిజేపిలో చేరి ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారికి అసలు రాజకీయం బోధపడిరది. తెలంగాణ సంక్షేమం కోసం పాటుపడే కేసిఆర్ నాయకత్వాన్ని కాదని, బిజేపిని నమ్ముకొని పలుచనయ్యామని వారికి తెలిసిపోయింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడా బిజేపి మాటలు నమ్మి తొందరపడొద్దని టిఆర్‌ఎస్ నాయకులకు ఈ గెలుపు గుణపాఠం నేర్పినట్లైంది. బిజేపి వలలో పడేందుకు, పెంచి పోషించిన పార్టీని మోసం చేసి, స్వార్థం చూసుకుందామనుకున్న వారు మునుగోడులో టిఆర్‌ఎస్ విజయం వారిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. నిన్నటి దాకా ఇక్కడ కాకపోతే అక్కడ రాజకీయం అని ఊహించుకున్న వారికి, లెక్కలేసుకున్నవారి లెక్క తప్పింది. టిఆర్‌ఎస్ ను వదిలేస్తే రాజకీయం వుండదని బోధపడిరది. కలలో కూడా టిఆర్‌ఎస్ ను, కేసిఆర్ నాయకత్వాన్ని వదులుకొని వెళ్తే భవిష్యత్తు లేదని ఇప్పటికే చాలామందికి అర్థమైవుంటుంది. ఇకపై బిజేపి నాయకుల మాటలు వినడానికి కూడా టిఆర్‌ఎస్ నాయకులు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
మునుగోడులో టిఆర్‌ఎస్ కు పదివేల మెజారిటీని కొందరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు.
ఆఖరుకు వెయ్యి ఓట్లతో గట్టెక్కిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు లాంటి వారు కూడా మునుగోడులో టిఆర్‌ఎస్ విజయాన్ని చిన్నది చేస్తున్నారు. దుబ్బాక తాను వెయ్యి ఓట్లతో గెలిచే రీ సౌండ్ ఇలా వుంటది అని మాట్లాడిరడు. మునుగోడులో టిఆర్‌ఎస్ ఇచ్చిన రీ సౌండ్ ను గురించి తేలిక చేయడం అంటే అత్మ స్థుతి, పరనింద కాలేదు.
నవంబర్ సెంటిమెంట్ బిజేపిని నాకించేసింది. దుబ్బాక ఉప ఎన్నికల నవంబర్ లో జరిగింది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక నవంబర్ లోనే జరిగింది. మళ్ళీ మునుగోడు ఉప ఎన్నిక కూడా నవంబర్ నెలలోనే వచ్చింది. ఇక బిజేపికి ఎదురులేదు. గెలుపు ఖాయమని కలలుగన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలుసు. అయినా సెంటిమెంట్ పేరు చెప్పి కూడా ప్రజల ఆలోచనల్లో మార్పు తెద్దామని చూశారు. కానీ కుదరలేదు. మొదటికే మోసం వచ్చింది. నిజానికి దుబ్బాక రఘునందన్ రావుకు కలిసివచ్చింది. అక్కడ ఆయనకు సానుభూతి ఓటు తోడయ్యింది. అక్కడ కూడా టిఆర్‌ఎస్ పార్టీ మరో నాయకుడికి అవకాశం ఇస్తే రఘునందన్ రావు అడ్రసు రాజకీయంగా అక్కడితో గల్లంతయ్యేది. రఘునందన్ రావుకు లక్కు ఆ రూపంలో కలిసి వచ్చింది. ఇక హుజూరాబాద్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ కూడా అది బిజేపి గెలుపు కాదు. దాని ఖాతాలో పడలేదు. నవంబర్ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అయ్యిందని చెప్పడం అసలే కదరదు. కానీ నవంబర్ ను సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకుందామని చూసి మునుగోడులో బిజేపి నిండా మునిగింది. సెంటిమెంట్ అని మళ్ళీ మాట్లాకుండా అయ్యింది.
మునుగోడు ఉప ఎన్నిక అన్నది ఆత్మగౌరవం, స్వార్థానికి మధ్య జరిగింది.
అదేదో సినిమాలో పాట లాగా ఉన్నది కాస్త ఊడిరది. సర్వ మంగళం పాడిరది. తిరుక్షవరమైపోయింది అన్నట్లు వున్న ఎమ్మెల్యే పదవి పోయింది. కోట్లాది రూపాయలు ఖర్చయ్యింది. అతిగా ఆవేశపడిన ఆడది, అతిగా అత్యాశ పడిన వ్యక్తి బాగుపడినట్లు చరిత్రలోనే లేదు. అనే డైలాగ్ ఇక్కడ నిజమైంది. 2018 ఎన్నికలలో ప్రజలు రాజగోపాల్ రెడ్డి ని మంచి మెజారిటీతో గెలిపించారు. ఆ కృతజ్ఞత రాజగోపాల్ మర్చిపోయాడు. ఎంత లేదన్నా కనీసం రాజగోపాల్ రెడ్డి కి మూడు వందల కోట్లకు పైగా ఖర్చయ్యివుండొచ్చు. ఆ డబ్బులే నియోజకవర్గంలో ఖర్చు చేస్తే జీవితాంతం అతని నాయకత్వానికి తిరుగువుండకపోయేది. మునుగోడులో ఎలాగూ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లను కూడా ఫిల్టర్ చేసే ప్యూరిఫయర్లు ఊరికొకటి ఏర్పాటు చేస్తే ప్రజలు వచ్చే ఎన్నికలలో కూడా ఆచరించేవారు. ఉప ఎన్నిక కోసం చేసిన ఖర్చుతో మునుగోడు మొత్తానికి సిసి రోడ్లు, స్కూల్ భవనాల నిర్మాణం జరిగేది. కానీ అత్యాశకు పోయి చేసిన ఖర్చు వల్ల వచ్చే ఎన్నికలలో ఒక వేళ పోటీ చేసినా నయాపైస లాభం వుండదు. అప్పుడు ఇప్పుడిచ్చిన దానికి మరింత అదనం జోడిస్తే గాని ఇప్పుడు పడిన ఓట్లు అప్పుడు పడవు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ లోని అన్ని ప్రాంతాల బిజేపి శ్రేణులు శ్రమించాయి. వచ్చే ఎన్నికలలో ఒక్కడే రాజగోపాల్ రెడ్డి ఒంటరి ప్రచారం చేసుకోవాలి. ఇంతకు మించి ఖర్చు చేయాలి.
మునుగోడు ఉప ఎన్నికతో బిజేపికి తెలంగాణ రాష్ట్రంలో అద్దె నాయకులే దిక్కన్నది స్పష్టమౌతోంది.
ఎనమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో వున్నా ఇప్పటికీ గెలిచే నాయకుడు ఆ పార్టీలో లేడన్నది తేటలెల్లమౌతోంది. ఈ లెక్కన భవిష్యత్తులో బిజేపికి మళ్ళీ పాత రోజులు తప్ప, మంచి రోజులు కనిపించడం లేదు. గెలుపు గుర్రాలు వస్తే, తప్ప బిజేపి బలపడే పరిస్థితి కనిపించడం లేదు. మునుగోడు ఉప ఎన్నిక తెచ్చి తాము బలపడ్డామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే చిదిమేశారు. మునుగోడు వరకు రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 2018లో విజయం సాధించాడు. అదే రాజగోపాల్ రెడ్డి బిజేపిని నమ్మి, ఆ పార్టీ పంచన చేరి ఓడిపోయాడు. తనకు తానుగా బలవంతుడిని అని చెప్పుకునే చోటనే బలహీనుడయ్యాడు. వున్న బలం కోల్పోయాడు. నాయకత్వం వదులుకున్నాడు. ఎన్నుకున్న ప్రజల చేత ఓడిరపబడ్డాడు. ఒక వేళ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఈ సారైనా ఆ గెలుపును ఖాతాలో వేసుకోవాలని చూసిన బిజేపికి ఆశనిపాతమే మిగిలింది. దుబ్బాక గెలిచినా అది బిజేపి గెలుపు కాదన్నారు. ముమ్మాటికీ రఘునందన్ రావు గెలుపన్నారు. రఘునందన్ రావు కూడా ఇప్పటి వరకు తన గెలుపు పూర్తిగా బిజేపి వల్లనే సాధ్యమైందని ఎక్కడా చెప్పలేదు. అలా చెబితే తన నాయకత్వం వీక్ అవుతుందని ఆయనకు తెలుసు. అందుకే రఘునందన్ రావు విజయాన్ని మీడియా బిజేపి ఖాతాలో వేయకపోవడమే మంచిదైందని అనుకునేవారిలో ఆయన కూడా వుంటారు. హుజూరాబాద్ గెలిచినా అది స్పష్టంగా ఈటెల రాజేందర్ గెలుపుగానే అందరూ చూశారు. రాజేందర్ గెలుపును ఎవరూ బిజేపి గెలుపుగా చెప్పుకోవడానికి ఆ పార్టీ నేతలే ధైర్యం చేయలేదు. కనీసం ఇప్పుడైనా చెప్పుకుందామనుకుంటే అది కూడా దక్కడం లేదు. రాజగోపాల్ రెడ్డి ఓడినా వచ్చిన ఓట్లు కూడా ఆయన ఖాతాలోకే వెళ్లిపోతాయి. కొట్లాడిన బిజేపికి ఏమీ మిగలలేదు. మునుగోడు గెలిస్తే రాజకీయం ఆగం చేద్దామనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలు చేసినట్లు స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆరే చెప్పడం జరిగింది. బిజేపి పెట్టుకున్న ఆశలు తలకిందులయ్యాయి. రాజగోపాల్ రెడ్డి కి ఇచ్చిన కాంట్రాక్టు ఏమౌతుందో అన్న అనుమానం కూడా చాలా మందే వ్యక్తం చేస్తున్నారు.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఓటు టిఆర్‌ఎస్ కు మళ్లిందా? రాజగోపాల్ ఎత్తుకుపోయాడా? అన్నది కాంగ్రెస్ ఆత్మావలోకనం చేసుకోవాలి.
క్రమంగా కాంగ్రెస్ ఇలా ఎందుకు కనుమరుగౌతుందన్న దానిని విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు సమసిపోవు. నాయకుల ఆధిపత్య రాజకీయాలు ఆగవు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర వుండడం కూడా ఆ పార్టీకి మైనస్ అయ్యింది. సీనియర్లు మునుగోడు వైపు తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందరూ నేనే ముఖ్యమంత్రి అంటారు. అలాంటి వారిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులే ఎక్కువ. అందులో జానారెడ్డి లాంటి నాయకుడు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో జాడే లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మునుగోడులో సొంతంగా ప్రచారం చేసింది లేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ,ఆ రోడ్ షోలలో మాత్రమే కనిపించాడు. ఇక సీనియర్లలో అన్నింటిలో మేమే ముందు అనే హనుమంతరావు, పొన్నాల, జగ్గారెడ్డి, దామోదర్ రాజనర్సింహ, మధయాష్కీలు మునుగోడులో మకాం వేసింది లేదు. ప్రచారం చేసింది అంతకన్నా లేదు. స్రవంతిని ఒంటరి చేశారు. ఓటు ఎటువెళ్లినా ఫరవాలేదని పార్టిని గాలికొదిలేశారు. మునుగోడులో ఓట్లు తక్కువైతే రేవంత్ ను దించేయొచ్చన్న రాజకీయం తప్ప, పార్టీని గట్టెక్కిద్దామన్న సోయి ఎవ్వరిలో కూడా లేదు.
ఆఖరుగా టిఆర్‌ఎస్ నాయకుల ఆలోచనల్లో కూడా మార్పు రావాలి.
టిఆర్‌ఎస్ కూడా కొంత మారాలి? తమ నాయకత్వమే కాదు, పార్టీ కోసం పని చేసే సమయం మరింత కేటాయించుకోవాలి. కేసిఆర్ చలువతో, పార్టీ ఊపులో గెలుస్తా? గెలవలనుకున్నప్పుడు పక్క చూపులు చూస్తా అన్నట్లు వ్యవహరించకూడదు. టిఆర్‌ఎస్ నాయకుల నిస్తేజమే బిజేపికి అడ్వాంటేజ్ అవుతుంది. అసలు బిజేపికి రాష్ట్రంలో బలమే లేదు. ఆ పార్టీ లోకి వచ్చే నాయకుల బలగంతోనే బిజేపి బలం పెంచుకోవాలని చూస్తోంది. ఈ మాత్రం అవగాహన టిఆర్‌ఎస్ నేతలకు వుంటే చాలు. బిజేపి అన్న పదమే వినిపించుకోరు. ఇరవై రెండేళ్ల కాలం ఎన్నో విజయాలను చూసిన టిఆర్‌ఎస్ పార్టీ నేతలు, రెండు వ్యక్తిగత గెలుపులను చూసి బిజేపి వైపు తొంగి చూసే నేతలు ఎప్పటినా ప్రమాదమే.