జన జాతర సభను జయప్రదం చేయాలి
కెవిపిఎస్. జిల్లా కార్యదర్శి అరూరి కుమార్
నర్సంపేట,నేటిధాత్రి:
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 30 న వరంగల్ మహానగరంలో జరగబోవు పూలే అంబేద్కర్ జన జాతర సభను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం నర్సంపేట పట్టణ కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ జన జాతర సెమినార్ నిర్వహించారు. అరూరి కుమార్ మాట్లాడుతూ
మనువాదుల చెర నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అణిచివేత ఆధిపత్యంపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.
రైతు సంఘం నాయకులు కోరబోయిన కుమారస్వామి మాట్లాడుతూ
జిల్లాలో కులవివక్ష అంటరానితనం ఎక్కడ ఉన్న ఆయా జిల్లాలోని కెవిపిఎస్ నాయకులను కలిసి వివక్షను తెలియజేయాలన్నారు. టౌన్ కార్యదర్శి ములుగురి రాజు అధ్యక్షత వహించగ ఈ సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు కలకోటి అనిల్, ఐద్వా నాయకురాలు స్వప్న, దారా మహేందర్, సాయిచంద్, సుధాకర్ విజయ నాగమణి ఫరీదా,కెవిపిఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.