చేసింది చెప్పుకోలేరు! చెప్పాల్సింది ప్రచారం చేసుకోరు!!

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయి.

కరంటు కొరత లేదు,కోత లేదు…

నిరంతర విద్యుత్‌ తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు…

ఏ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ జరిగింది లేదు…..

తెలంగాణలో పెరిగిన భూగర్భ మట్టాలు మరెక్కడా లేవు….

తెలంగాణ వ్యాప్తంగా నీటి జాడల పరవళ్లు గతంలో లేవు…

రైతు బంధు ఏ రాష్ట్రంలో లేదు…

రైతు భీమా మరే రాష్ట్రంలో లేదు…

ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు…

కళ్యాణ లక్షి సరికొత్త విప్లవం….

పార్టీ ప్రచారం చేయదు…నాయకులకు తీరిక లేదు..

టిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఏం చేస్తుందో జాడే లేదు….

సిఎంఓ నుంచి వచ్చే వార్తలే తప్ప ఐఅండ్‌ పిఆర్‌ చేస్తున్నదేమీ లేదు…

ఉద్యమ కాలంలో వున్న ఊపు కార్యకర్తలలో ఇప్పుడెందుకు లేదు?

టి న్యూస్‌ చెప్పదు….నమస్తే తెలంగాణ రాయదు…

ప్రభుత్వ పనితీరును చెప్పేవారే కరువు…

హైదరాబాద్‌,నేటిధాత్రి: పావల పని చేస్తే రూపాయి ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం సరైన ప్రచార విధానం అవలంభించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులను ప్రచారం చేసుకోకపోవడం వల్ల ప్రతిపక్షాలు చెప్పే విషయాలే జనం నిజాలని నమ్మే పరిస్ధితి ఎదురుకానున్నది. ఈ విషయంలో టిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సోషల్‌ మీడియా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ప్రతిపక్షాలకు చెందిన సోషల్‌ మీడియా వున్నంత దూకుడు టిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా లేకపోవడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని అధ్భుతమైన సంక్షేమ పధకాలు తెలంగాణలో మాత్రమే అమలౌతున్నాయి. దేశమంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధకాలు దేశమంతా ఆదర్శంగా తీసుకుంటోంది. కాని టిఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకోవం లేదు. ఇక కరంటు గురించి చెప్పాల్సి వస్తే మనం చూస్తున్న నిరంతరం విద్యుత్‌ దేశంలోని అన్ని రాష్ట్రాలలో అమలు కావడంలేదు. తెలంగాణ రాక మందు తెలంగాణలో కరంటు అన్నది ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో…రోజులో ఎంత సేపుంటుందో తెలియని పరిస్ధితి. అలాంటి అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్న కాలం. ఒక దశలో పరిశ్రమలకు పవర్‌ హాలీడే ప్రకటించిన కాలం నుంచి నేడు గృహఅవసరాలకు, పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి సైతం 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా అన్నది తెలంగాణలో తప్ప మరెక్కడా లేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్ర కేసిఆర్‌ సాధించిన అధ్భుతమైన విజయం. 

తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సంక్షేమఫ్రభుత్వం. రైతు బంధు ప్రభుత్వం. దేశంలో ఎక్కడా రైతు బంధు వంటి పధకం లేదు. ఒక్క తెలంగాణలోనే అమలు జరుగుతోంది. రైతుకు పెట్టుబడి సాయం అన్నది చరిత్రలోనే ఒక వినూత్నమైన కార్యామ్రకం. మరి అలాంటి పధకం అమలు అన్న దానిపై విపరీత వ్యాఖ్యలు చేసే ప్రతిపక్షాలను తిప్పికొట్టాల్సిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా విభాగం చూస్తూ ఊరుకుంటుందే కాని, దీటైన సమాధానాలు ఇవ్వడం లేదు. పేదింటి అమ్మాయి పెళ్లి విషయంలో ఇబ్బందులు రాకుండా, బాల్యవిహావాలను అరికట్టడంలో కళ్యాణ లక్ష్మి పధకం ప్రశంసలు అందుకుంటోంది. ఇలాంటి పధకం ఒకటి అమలు చేయొచ్చని నిరూపించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఒకనాడు నీటిగోస తెలంగాణలో గుక్కెడు మంచినీటికి సైతం అల్లాడిన రోజులున్నాయి. సాగు నీటికి కష్టమే…తాగు నీటికి కష్టమే…అలాంటి తెలంగాణలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదుర్కొన్న రోజులున్నాయి. కాని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే, ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెరువుల పునరుద్దరణ చేపడతారని ఎవరూ ఊహింలేదు. అసలు తెలంగాణలో ఇంత తొందరగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడం, 46వేల చెరువులు బాగు పడడం అన్నది కలలో కూడా ఊహించినవి కాదు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు అన్న పదమే వినపడని రోజులు చూశాం…అలాంటిది చెరువులు ఎండిపోయిన కాలం చూశాం… కాని నేడు ఏ ఊరుకెళ్లినా ఎండాకాలంలో కూడా చెరువులు కళకళలాడుతున్నాయి. దాంతో తెలంగాణ వ్యాప్తంగా భూగర్భజలాల విపరీంగా పెరగడంతో నీటికరువు అన్నది ఎనాడో తీరిపోయింది. ఎండమావుల్లాంటి తెలంగాణ చెరువులు నేడు ఏడాది పొడవునా నీటితో నిండి వుంటున్నాయి. ఎప్పటికప్పుడు గోదావరి జలాలతో చెరువులు నింపుతూనే వున్నారు. ఇవన్నీ ప్రజలు కనిస్తున్నా, ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూనే వుంటాయి. ఇక పించన్ల విషయానికి వస్తే ఒకప్పుడు ఉమ్మడి రాష్టంలో నెలకు రూ.75 చొప్పున జన్మభూమి అనే కార్యక్రమం ఆరునెలల కోసారి అందజేసేవారు. అయితే ఊరిలోని అందరికీ ఇచ్చేవారు కాదు…ఊరికి ఒకరికో ఇద్దరికో తప్ప కనీసం పదుల సంఖ్యలో కూడా పింఛన్లు అందేవి కాదు. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి రూ.200 ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ పింఛన్లును నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో ప్రచారం చేసుకునేది. మరి నేడు తెలంగాణలో రూ.2116 ఇస్తున్నారు. సమారు 47 లక్షల మందికి ఈ లబ్ధి జరుగుతోంది. దివ్యాంగులకు రూ.3500 ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడి కార్మికులకు కూడా పించన్లు ఇస్తున్నారు. ఒంటరి మహిళలకు ప్రత్యేకంగా అందజేస్తున్నారు. మరి ఇన్ని రకాలా పించన్లు అందిస్తున్నా ప్రచారం చేసుకోవడంతో టిఆర్‌ఎస్‌ వెనుకబడే వుందనిచెప్పక తప్పదు.

ఏమీ చేయలేని, అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఏ ఒక్కటీ అమలు చేయడంలేని కాంగ్రెస్‌, బిజేపిలు మాత్రం సోషల్‌ మీడియా ప్రచారంలో మాత్రం దూసుకుపోతున్నాయి. నిజాలను అబద్డాలు చేయడంల ఆరితేరిపోతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రచారం చేయాల్సిన ఐఅండ్‌ పిఆర్‌ ఏం చేస్తున్నదనేది పెద్ద ప్రశ్న. ప్రభుత్వానికి సంబంధించి వార్తలు అందించలేదు. సెంట్రల్‌ గవర్నమెంటుకు సంబంధించిన వార్తలపై ఎప్పటికిప్పుడు పిఐబి మీడియా రిలేషన్‌ మెంటైన్‌ చేసిన దాంట్లో కనీసం పదో వంతు కూడా ఐఆండ్‌ పిఆర్‌ పని చేయడంలేదు. రాష్ట్రంలో వున్న అనేక చిన్నా, చితక, పెద్ద పత్రికలకు కోట్లాది రూపాయలు ప్రకటనల కోసం ఖర్చు చేస్తోంది. కాని ఏ పత్రికలో ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయో కనీసం చూసుకునే తీరిక కూడా ఐఆండ్‌ పిఆర్‌ శాఖ అధికారులకు లేదు. చిన్న, మీడియం వందల పత్రికల్లో కూడా ఒకటే బ్యానర్‌ వుంటుంది. అవే వార్తలుంటాయి. ఆ పత్రికలకు గ్రేడ్‌లు ఇచ్చి మరీ నెల నెల లక్షలాది రూపాయలు ప్రకటనలు ఇస్తున్నారు. ప్రభుత్వ వార్తలు తప్పనిసరిగా వుండాలన్న నిబంధనలు పెట్టడం లేదు. ప్రభుత్వానికి సంబంధిచిన వార్తలు అందజేయలేరు. రోజూ పత్రికలను తిరగలేయలేరు. పత్రికలకు వార్తలు అందించలేరు. ఇక కమీషనర్‌ ఎప్పుడొస్తారో…ఎప్పుడు రారో..తెలియదు? కనీసం మీడియాకు అందుబాటులో వుండే అవకాశమే లేదు. రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్‌ వినోద్‌కుమార్‌ లాంటి వాళ్ల పోన్లు కూడా లిఫ్ట్‌ చేయలేనంత బిజీగా కమీషనర్‌ వుంటాడు…ఇలా అయితే ప్రభుత్వానికి సంబంధించిన ప్రచారం ఎలా జరగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసే తెలంగాణ అధికార మాసపత్రిక ఎంత మందికి చేరువౌతుందో కూడా తెలియని పరిస్ధితి. సిఎంవో నుంచి వచ్చే వార్తలు తప్ప ఐండ్‌ పిఆర్‌ నుంచి వార్తలు పంపడమే వదిలేశారు…టిఆర్‌ఎస్‌ అధికార పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ ప్రభుత్వ పధకాలను నిత్యం రాయదు…టిన్యూస్‌ చెప్పదు…

ఇదిలా వుంటే టిఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది కార్యకర్తలున్నారు. కాని ఆ కార్యకర్తలు కూడా టి న్యూస్‌ను సబ్‌స్రైబ్‌ చేసుకోలేదు. అసలు మొత్తం కార్యకర్తలు టిన్యూస్‌ను సబ్‌స్రైబ్‌ను చేసుకొని, వాటి నుంచి వచ్చే వార్తలను షేర్లు చేస్తే టిఆర్‌ఎస్‌కు తిరుగుంటుందా? ఎదురుంటుందా? అయినా గతంలో వున్నంత దూకుడు ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారంలు నమ్ముతున్నారే గాని, దేశంలో ఎక్కడా లేని పధకాలు అమలు చేస్తున్నామని వారు ప్రచారం చేసుకోలేపోతున్నారు. నాయకులు చూస్తే అలా వున్నారు….కార్యకర్తలు ఇలా వున్నారు..సోషల్‌ మీడియా ఎందుకు వుందో అర్ధం కాదు….ఇన్ఫర్మేష్‌ డిపార్లుమెంటు ఏం చేస్తుందో తెలియదు….. ఎవరేం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు అంటే ఫైర్‌ బ్రాండ్స్‌ అన్నంత దూకుడుతో వుండేవారు. పార్టీ కోసం అంతగా పనిచేసేవారు. కాని ఇప్పుడు పార్టీ అధికారంలో వున్నా, అనేక సంక్షేమ పధకాలు అమలౌతున్నా, ప్రతిపక్షాలను తిప్పికొట్టులేకపోతున్నారు. నాయకులు తమకు వచ్చే సోషల్‌ మీడియా మెస్సేజులు చూసుకోవడానికి కూడా తీరికలేదన్నట్టుంటున్నారు. అదే ప్రతిపక్షాలు లేని బలాన్ని సోషల్‌ మీడియాలో చూపిస్తున్నాయి. ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం పార్టీ మీద వుంది…అయినా చలిస్తారో లేదో చూడాలి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!