హనుమకొండ జిల్లా నేటిధాత్రి:
కుల వృత్తులను ప్రోస్తహిస్తు
చేనేతకు అండగా ఉన్న ఏకైక రాష్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చండూరు మున్సిపాలిటీ లోని 5వ వార్డులోనీ పద్మశాలి కాలనీలో తెరాస అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోరుతూ ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నప్పుడే పద్మశాలి ఇంట్లో చదువుకున్న వ్యక్తి. అందుకే ఆయనకి చేనేతల పట్ల ప్రత్యేక ప్రేమ ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగం కోసం 5,752 కోట్లు కేటాయించింది. కానీ 70 సంవత్సరాలలో గత ప్రభుత్వాలు ఇందులో 10 శాతం కూడా ఖర్చు చేయలేదు, తెరాస ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా 40% యార్న్ సబ్సిడీ ఇస్తు చేనేతకు అండగా నిలిచిందన్నారు.ఈ ప్రభుత్వం నేతన్నలు తెచ్చిన ప్రభుత్వం. వారి సంక్షేమం కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ,స్థానిక డివిజన్ ఇంఛార్జి రామలింగం,మాజీ సర్పంచ్ మల్లేశం, బొల్లం అశోక్, వెంకటేష్, రమశంకర్, బీరయ్య, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.