చిన్నారి చైత్ర హంతకుణ్ని కఠినంగా శిక్షించాలి

బాధిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి సేవాలాల్ సేన పెద్దపల్లి,జయశంకర్ జిల్లాల కన్వీనర్ అంగోత్ రాజునాయక్ డిమాండ్

మల్హర్రావు నేటిదాత్రి: హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ లో 6 సంవత్సరాల పసికందు గిరిజన బిడ్డ చిన్నారి చైత్ర ను అత్యాచారం చేసి,హత్య చేసిన కిరాతకున్ని కఠినంగా శిక్షించాలని రాజు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంఘటన జరిగి 5 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ పెద్దలు గానీ, కనీసం గిరిజన మంత్రి మహిళ అయి ఉండి కూడా నేటి వరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించి కా పోవడం బాధాకరం
రాష్ట్రంలో ఇంత గోరం జరుగుతున్నా కనీసం గిరిజన MLA లు గాని MP లు గాని మంత్రులు, ప్రజా ప్రతినిధులు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు వీళ్ళని గిరిజన సమాజం ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు
అత్యాచారం, హత్య, పోక్సో చట్టాల కింద తక్షణమే విచారణ పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీస్ శాఖ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఖమ్మంలో మరియమ్మ కుటుంబానికి ఇచ్చినట్టుగానే ఈ కుటుంబానికి కూడా 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగం అమ్మాయి తండ్రికి ఇవ్వాలని మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఒక ప్రకటనలో రాజు నాయక్ డిమాండ్ చేశారు
సింగరేణి కాలనీ లో గుడుంబా, డ్రగ్స్ వ్యాపారం ఒక మాఫియా లాగా తయారై విచ్చలవిడిగా అమ్ముతున్న ఇక్కడ ఎక్సైజ్ అధికారులు కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో దళిత, గిరిజనుల పై దాడులు, అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.
సినిమాలు, టీవీలు ,మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నా విచ్చలవిడి అశ్లీలత అరికట్టడంలో సెన్సార్ బోర్డు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!