రామడుగు, నేటిధాత్రి:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేయించి జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జంగం అంజయ్య ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం రాబోవు ఎన్నికలలో ఓడిపోతానని భయంతో చంద్రబాబు నాయుడుకి సంబంధంలేని పాత కేసును తిరగదొడి ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకున్నా కావాలని సిఐడినీ అడ్డం పెట్టుకొని అధికారం ఉంది కదా అని అరెస్టు చేయించి గత మూడు రోజులుగా చంద్రబాబు నాయుడుని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిని తెలుగు ప్రజలు గమనిస్తున్నారు, అతన్ని జైలుకు పంపడంతో తెలుగు ప్రజలే కాక యావత్ భారతదేశం నిర్గాంత పోయింది, ఒక మచ్చలేని నాయకుడు ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన నాయకుడిని అరెస్టు చేయడం తెలుగు ప్రజలను ఉక్రోసానికి గురిచేస్తుంది, ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూనీ చేయబడింది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాకుండా కేవలం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే అటువంటి రోజు దగ్గరలోనే ఉందని, బేషరతుగా చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం, మండల పార్టీ అధ్యక్షులు అమీరిశెట్టి సుధాకర్, కరీంనగర్ పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షులు బోలుమాల సదానంద, పార్లమెంటు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు కోరే గట్టయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పూరెల్ల గోపాల్ గౌడ్, మండల పార్టీ జనరల్ సెక్రెటరీ వెంకటేష్ గౌడ్, వార్డు మెంబర్ జవ్వాజి కాంతయ్య, గంటే మునిందర్, పూరెల్ల మనోజ్, గుర్రం శ్రీకాంత్, మిరియాల సంపత్ రెడ్డి, గోదారి కనకయ్య, వోడ్నాల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.