శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మాన్య శ్రీ కాన్షి రామ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంఘం నాయకులు పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం అధ్యక్షులు కొంగర విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఓట్లు మావి సీట్లు మీవా ఓట్లు మావే సీట్లు మావే అని బహుజన సమాజ్ పార్టీని స్థాపించిన అసలు సిసలు బహుజన నాయకుడు కాన్షిరాం ఒక్కరే అని అన్నారు.దళిత మహిళ ముఖ్యమంత్రిని చేసిన ఘనుడు మాన్య శ్రీ కాన్షిరాం అని అన్నారు.బిసి ఎస్సి ఎస్టీలు చట్ట సభల్లో ఉన్నప్పుడే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని గుర్తించి అణగారిన వారిని చట్ట సభల్లోకి పంపిన కాన్షిరాం కూడా కులానికే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..ఈ కార్యక్రమం ప్రధాన కార్యదర్శి నాలికె శ్రీకాంత్, కునవల్ల సాయితిలక్, కునమల్ల సాయి రక్షన్, ప్రమోద్ కళ్యాణ్ సుమన్ పాల్గొన్నారు