మంగపేట- నేటిధాత్రి
మంగపేట మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో బోనాల పండుగ ఊరంతా కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది.బోనాలు ఎత్తుకొని ఊరి నుండి బయలుదేరి పోచమ్మ గుడి వరకు భారీ ఎత్తున తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని ముక్కుడి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బిజెపి మండల అధ్యక్షులు లోడే శ్రీనివాస్ గౌడ్ దామర సారయ్య ,మాసిరెడ్డి వెంకటరెడ్డి ,కార్పోతుల నరసయ్య గౌడ్,లోడే కృష్ణ,గొడిసాల నాగరాజు,బూర సుధాకర్ గౌడ్ ,చీకట్ల యాకస్వామి గౌడ్ గోడిశాల యాకోబు ,మల్యాల రవీందర్ ,కల్తి రామకృష్ణ ,వట్టం సంతోష్ ,కార్బోతుల మధు,మొదలగు వారు పాల్గొనడం జరిగింది.